విరాట్ కోహ్లీ కొత్త విల్లా ఖరీదు ఎంతో తెలుసా ?

Virat Kohli Anushka Sharma Buys ULTRA Luxury Villa

 విరాట్ కోహ్లీ కొత్త విల్లా ఖరీదు ఎంతో తెలుసా ?

క్రికెటర్ల ఆటలోఒకసారి  క్లిక్ అయితే చాలు గుర్తింపుతో పాటు భారీ ఆదాయం కూడా వస్తుంది. అందుకే తమ రేంజ్‌కు తగ్గ ఇళ్లలో ఉండేందుకు క్రికెటర్లు ఇష్టపడతారు తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, జట్టులో కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ మరో లగ్జరీ విల్లాను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు. అది ఎక్కాడ అనుకుంటున్నారా ముంబైలోని అలీబాగ్‌ దగ్గర ఉన్న ఆవాస్ విలేజ్‌లో విరాట్ కోహ్లీ ఇటీవల ఈ విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేశాడు. ముంబైకి దగ్గర్లో రెండువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ విల్లాను కింగ్ కోహ్లీ ఏకంగా రూ.6కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు.  విరాట్ ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బిజీగా ఉన్న నేపథ్యంలోఈ కొత్త విల్లా కొనుగోలుకు సంబంధించిన ఫార్మాలిటీస్‌ను అతడి అన్నయ్య వికాస్ కోహ్లీ పూర్తి చేశాడు. ఈ ప్రాపర్టీ ధర రూ.6కోట్లు కాగా, స్టాంప్ డ్యూటీగా కోహ్లీ రూ.36లక్షలు చెల్లించాడు సూపర్ లగ్జరీ విల్లా  ఈ విల్లాకు మరో ప్రత్యేకత ఉంది. హృతిక్ రోషన్ మాజీ భార్య సుస్సానే ఖాన్ ఈ లగ్జరీ బంగ్లాకు ఇంటీరియర్స్ డిజైన్ చేసిందట. ఈ విల్లాలో 400 చదరపు అడుగుల స్విమ్మింగ్ పూల్ కూడా ఉందట. విరాట్, అనుష్క దంపతులు ఇప్పటికే అలీబాగ్‌లో ఒక ఫాంహౌజ్‌ను కొనుగోలు చేశారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో రూ.19.24 కోట్లతో దాన్ని సొంతం చేసుకున్నారని, ఇందుకు రూ.1.15 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారని వార్తలు వచ్చాయి. మరోవైపు, ప్రస్తుత భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అలీబాగ్‌లో ల్యాండ్ కొనుగోలు చేశాడు. రోహిత్ 2021లో మత్రోలి గ్రామంలో నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు.  అలీబాగ్‌లో ప్రాపర్టీ కాస్ట్ చాలా ఎక్కువ ఈ లగ్జరీ ప్లేస్‌లో ఒక స్వేర్ ఫీట్ ధర రూ.3,000 నుంచి రూ. 3,500 వరకు ఉంటుంది. ఈ ప్రాంతం సెలబ్రిటీస్‌కు బెస్ట్ వీకెండ్ డెస్టినేషన్‌గా మారుతోంది. అందుకే చాలామంది ప్రముఖులు ఇక్కడ విల్లాలు కొనుగోలు చేస్తున్నారు. అవాస్ లివింగ్ అలీబాగ్ LLP సంస్థకు లీగల్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న అడ్వకేట్ మహేశ్ మహయత్రే  ఈ విషయం గురించి మాట్లాడారు. ఆవాస్ విలేజ్ ఒక నేచురల్ బ్యూటీగా ఉంటుందని, అందుకే సెలబ్రిటీస్ ఇక్కడ విల్లాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. మాండ్వా జెట్టీ ఆవాస్ నుంచి ఈ ప్రాంతానికి ఐదు నిమిషాల్లో చేరుకోవచ్చని ఇక్కడి నుంచి స్పీడ్ బోట్లపై ముంబైకి 15 నిమిషాల్లో చేరుకోవచ్చని మహేశ్ వివరించారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh