తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా రూపొందుతున్న తమిళ సినిమా ‘వారిసు’. తెలుగులో ‘వారసుడు’గా విడుదల కానుంది…తెలుగు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ..వంశి పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇంకా విడుదల తేదీ అయితే ప్రకటించలేదు…కానీ, జనవరి 12న విడుదల చేయటానికి సన్నాహాలు అయితే చేస్తున్నారు .. ఇందులో భాగంగా రెండో పాట ‘థీ దళపతి…’ పాటను ఈ రోజు విడుదల చేశారు.’థీ దళపతి…’ పాటను యువ తమిళ హీరో శింబు పాడిన సంగతి తెలిసిందే. పాడటమే కాదు… ఆయన లిరికల్ వీడియో కోసం డ్యాన్స్ కూడా చేశారు. అందుకుగాను ఆయనకు చిత్ర బృందం ప్రత్యేకంగా థాంక్స్ చెప్పింది.
హీరోగా విజయ్ కెరియర్ స్టార్ట్ చేసి 30 ఏళ్ళు అవుతోంది. ఆయన జర్నీ సెలబ్రేట్ చేసేలా ఈ సాంగ్ రూపొందించారు. లిరికల్ వీడియో చూస్తే… థియేటర్లలో ఈ సాంగ్ వచ్చినప్పుడు అరుపులు, కేకలతో దద్దరిల్లిపోవడం ఖాయం అనిపిస్తోంది…మరోవైపు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో దళపతి విజయ్ నటించనున్న సినిమా ప్రారంభం అయింది ..ఈ నెల 7 నుంచి 9 తేదీ మధ్య ప్రోమోను షూట్ చేయనున్నారు ..ముంబైలో జరిగే గ్యాంగ్ స్టార్ డ్రామాగా మూవీ రూపొందనుంది .కోలీవుడ్ హిస్టరీ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా 7 స్క్రీన్ స్టూడియోస్ మూవీని తెరకెక్కిస్తోంది ..ఖైదీ ,విక్రమ్ మూవీల యూనివెర్సెలో ఈ చిత్రాన్ని భాగంగా చేస్తారని మొదట్లో వార్తలు వచ్చాయి …అయితే ఇప్పుడు వాటితో దీనికి సంబంధము లేదు అని సమాచారం .