సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.తన తండ్రి మరణానంతరం కొంచెం టైం తీసుకున్న మహేష్ బాబు మళ్లీ షూటింగ్‌కు రెడీ అయిపోయారు . ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి తాను ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నఓ కంపెనీకి యాడ్ చేస్తున్నారు . . దీనికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయింది.ఆ ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. త్రివిక్రమ్‌తో నటించనున్న సినిమా షూటింగ్ కూడా ఈ నెలలోనే మొదలు పెట్టనున్నారు.గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పక్క యాక్షన్ ఎంటర్టైనర్ తో .ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు మహేష్ , త్రివిక్రమ్. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. మహేష్ ఇంట వరుస విషాదాలు నెలకొనడంతో ఈ సినిమా షూటింగ్ కు చిన్న బ్రేక్ పడింది. త్వరలోనే మహేష్ తిరిగి షూటింగ్ లో జాయిన్ కానున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మహేష్ దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహేష్ తో ఓ అడ్వెంచర్ మూవీ చేయనున్నారు జక్కన్న. ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మహేష్ సినిమా కథను సిద్ధం చేస్తున్నారు.మహేష్ బాబుతో చేయనున్న సినిమా వివరాలను రాజమౌళి.. . ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు . తనకు అడ్వెంచర్ సినిమాలు అంటే ఎంతో ఇష్టమని అందుకే… ఇండియన్ సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు కనిపించని సరికొత్త యాక్షన్ అడ్వెంచర్ మూవీని రూపొందించబోతున్నట్లు తెలిపారు. ఇండియానా జోన్స్ తరహా చిత్రంలా రూపొందిస్తున్నట్లు తెలిపారు రాజమౌళి .ఇదిలా ఉంటే తాజాగా విజయేంద్ర ప్రసాద్ మహేష్ బాబు గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మహేష్ బాబు ఇంటెన్స్ ఉన్న యాక్టర్.. అతను నటించిన యాక్షన్ సీన్స్ చూసినప్పుడు వెరీ ఇంటెన్సిటివిటీ కనిపిస్తుంది..మహేష్ ఇంటెన్స్ కారణంగా ఏ రచయితకైనా తన పని సులభం అవుతుంది అని .. చాలా మంది రైటర్స్ మహేష్ గురించి అదే మాట్లాడుకుంటుంటారు అని చెప్పుకొచ్చారు… విజయేంద్ర ప్రసాద్.

Dimple Hayathi In Shankars Movie keerthi suresh