Uppal SkyWalk: KTR చే నేడు ఉప్పల్‌ స్కైవాక్ ప్రారంభం

Uppal SkyWalk

Uppal SkyWalk: KTR చే నేడు ఉప్పల్‌ స్కైవాక్ ప్రారంభం

Uppal SkyWalk: భాగ్యనగరంలో అత్యంత రద్దీ రహదారులలో ఒకటైన ఉప్పల్‌ చౌరస్తాలో  నడిచి వెళ్ళే వారు రోడ్డు దాటడం అంత సులువు  అయిన విషయం కాదు. నలువైపులా నుంచి వచ్చే వాహనాలతో రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇక సెలవు రోజులు, పండుగ సీజన్‌లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో నడిచి వెళ్ళే వారు నానా అవస్థలు పడాల్సి వస్తున్నది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఉప్పల్‌ చౌరస్తాలో అత్యద్భుతంగా ఎంతో స్కైవాక్‌ను  హెచ్‌ఎండీఏ నిర్మించింది.  తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ  మంత్రి కేటీఆర్ గారు ఈ రోజు  ఉదయం 11 గంటలకు ఈ స్కైవాక్‌ని ప్రారంభిస్తారు. దీంతోపాటూ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతారు.

ఈ స్కైవాక్‌ను రూ. 25 కోట్ల వ్య‌యంతో నిర్మించారు. దాదాపు 1,000 ట‌న్నుల‌కు పైగా స్టీల్‌ను వినియోగించి, అధునాత‌నంగా స్కైవాక్‌ను తీర్చిదిద్దారు. స్కైవాక్‌కు ఆరు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. నాగోల్ రోడ్డు, రామంతాపూర్ రోడ్డు, జీహెచ్ఎంసీ థీమ్ పార్క్, జీహెచ్ఎంసీ ఆఫీసు స‌మీపంలోని వ‌రంగ‌ల్ బ‌స్టాప్, ఉప్ప‌ల్ పోలీసు స్టేష‌న్, ఉప్ప‌ల్ ఎల‌క్ట్రిక‌ల్ స‌బ్‌స్టేష‌న్ ఎదురుగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల‌ను ఏర్పాటు చేశారు.

ఇది మొత్తం 660 మీటర్ల పొడవు వుంది. దీని ద్వారా ప్రజలు ఈజీగా ఉప్పల్ క్రాస్ రోడ్స్‌ని దాటగలరు. అక్కడి ఏ రోడ్డు నుంచి ఏ రోడ్డుకి వెళ్లాలన్నా వీలుగా ఇది ఉంది. ఉప్పల్ లోని అన్ని బస్టాప్‌లకూ ఈ స్కై వాక్ ద్వారా చేరుకునేందుకు వీలు ఉంది. అందువల్ల ఇకపై ట్రాఫిక్‌లో పరుగులు పెడుతూ రోడ్డు దాటాల్సిన అవసరం లేదు.

అలాగే ఈ స్కైవే ద్వారా ఉప్పల్ మెట్రో రైల్వేస్టేషన్‌కి కూడా త్వరగా వెళ్లగలరు. ఎలాంటి ట్రాఫిక్ సమస్యా ఉండదు. డైరెక్టుగా మెట్రో స్టేషన్ లోపలికి వెళ్లిపోవచ్చు. దీని ప్రత్యేకతలు చాలా బాగున్నాయి. ఇందులో 8 లిఫ్టులు ఉన్నాయి. 4 ఎస్కలేటర్లు, 6 మెట్ల మార్గాలు ఉన్నాయి. చూడటానికి లుక్ కూడా చాలా బాగుంది. డిజైన్ ఇంటర్నేషనల్ రేంజ్‌లో నిర్మించారు. దీని రూఫ్‌కి టెన్సిల్ ఫ్యాబ్రిక్ వాడారు. అందువల్ల దీని లుక్ బాగుంది. దీని ఎత్తు 6 మీటర్లు మాత్రమే. అందువల్ల మెట్లు ఎక్కుతూ వెళ్లేవారికి కూడా ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. మొత్తం 6 ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ స్కైవాక్ అంతటా LED లైట్లు పెట్టారు. రాత్రివేళ కూడా ఇది ఎంతో అందంగా, సౌకర్యవంతంగా ఉంటుంది.

ఇక ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌లోని శిల్పారామంలో రూ.10 కోట్ల వ్యయంతో సమావేశాల కోసం ప్రత్యేకంగా నిర్మించిన కన్వెన్షన్‌ హాలును మంత్రి కేటీఆర్‌ సోమవారం మధ్యాహ్నం ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. భ‌విష్య‌త్ త‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ స్కైవాక్‌ను ఏర్పాటు చేయడం జరిగింది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh