UPI చెల్లింపుల్లో ఇక విటినీ వాడొచ్చు..
నగదు రహిత లావాదేవీలకు పలు మార్గాలు ఉన్నాయి. వాటిలో UPI సేవలు అత్యంత ప్రజాధరణ పొందుతున్నాయి. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్ లలో వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. తద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ భారత్ లో ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు UPI ద్వారా సేవింగ్స్ ఖాతాలోని నగదును మాత్రమే ఖర్చు చేసేందుకు అవకాశం ఉంది. కాగా ఇప్పడుఈ క్రెడిట్ కార్డుతో సైతం చెల్లింపులు చేసే అవకాశం కలిగింది. రూపే క్రెడిట్ కార్డులను వినియోగదారులు UPIతో లింక్ చేసేందుకు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ మంగళవారం తెలిపింది. తద్వారా సేవింగ్స్ ఖాతా నుంచి మాత్రమే కాకుండా క్రెడిట్ కార్డు నుంచి సైతం UPI ద్వారా వ్యాపార లావాదేవీలను నిర్వహించవచ్చని పేర్కొంది.
వినియోగదారులు పేటీఎం యాప్ నుంచి QR కోడ్ ను స్కాన్ చేయడంతో ఆన్లైన్, ఆఫ్‌లైన్ లో UPI ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఈ విధానం వల్ల ప్రత్యేకంగా కార్డులు తీసుకెళ్లవలసిన అవసరం లేదు. QR కోడ్ పేమెంట్లలో క్రెడిట్ కార్డు వినియోగం వల్ల, క్రెడిట్ ఎకోసిస్టం మరింత మెరుగుపడుతుందని Paytm చెల్లింపుల MD & CEO సురీందర్ చావ్లా తెలిపారు. తద్వారా వ్యాపారులూ లబ్ధి పొందుతారని వెల్లడించారు. UPI ద్వారా లావాదేవీలను NPIC నిర్వహిస్తూ ఉంటుంది. ఈ విధానానికి క్రెడిట్ కార్డులనూ లింక్ చేయాలని జూన్ 2022లో రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదించింది. క్రెడిట్ కార్డుల వినియోగాన్ని పెంచడానికి, డిజిటల్ చెల్లింపుల పరిధిని విస్తరించడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో RuPay క్రెడిట్ కార్డ్‌లు, UPI మధ్య అనుసంధానం కోసం ఆపరేటింగ్ సర్క్యులర్‌ను NPCI విడుదల చేసింది.
ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన రూపే క్రెడిట్ కార్డులను మాత్రమే ప్రస్తుతానికి UPIకి లింక్ చేయవచ్చు. SBI కార్డ్, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ఇతర ప్రముఖ క్రెడిట్ కార్డ్ జారీదారులతోనూ NPCI చర్చలు జరుపుతోంది. ఒకే UPI యాప్ తో అన్ని రకాల చెల్లింపులు, రివార్డులు, ఇతర ప్రయోజనాలనూ రూపే క్రెడిట్ కార్డుల ద్వారా పొందవచ్చని NPCI చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణా రాయ్ తెలిపారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ మోడ్ లలో సౌకర్యవంతమైన, వేగవంతమైన చెల్లింపులతో పాటు రూపే కార్డ్‌ల విస్తృత వినియోగానికి ఈ విధానం ఎంతగానో ఉపయోగపడతాయి, అని అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి :