మోదీ సర్కార్ సీనియర్ సిటిజన్స్‌కు గుడ్ న్యూస్

Good news for senior citizens of Modi government

Railway Ticket Concession: మోదీ సర్కార్ సీనియర్ సిటిజన్స్‌కు గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పానున్నది. తెలిసిన సమాచారం  ప్రకారం మోదీ సర్కార్ ట్రైన్ టికెట్లపై రాయితీ సర్వీసులను మళ్లీ ప్రారంభించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. సీనియర్ సిటిజన్స్‌కు మళ్లీ ట్రైన్ టికెట్లపై తగ్గింపు అందుబాటులోకి రావొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదే జరిగితే చాలా మంది సీనియర్ సిటిజన్స్‌కు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వం కరోనా వచ్చిన దగ్గరి నుంచి ట్రైన్ టికెట్లపై సీనియర్ సిటిజన్స్‌కు అందించే రాయితీని ఎత్తివేసింది. మళ్లీ ఈ తగ్గింపు ప్రయోజానాన్ని తీసుకువచ్చే ఆలోచనలో లేదని గతంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే తాజాగా చోటు చేసుకున్న పరిణామం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్‌కు రాయితీ సర్వీసులు తీసుకు రావొచ్చని తెలుస్తోంది.

పార్లమెంటరీ కమిటీ సీనియర్ సిటిజన్స్‌కు ట్రైన్స్ టికెట్లపై రాయితీ ప్రయోజనాన్ని కల్పించాలని సిఫార్సు చేసింది. రాధా మోహన్ సింగ్ సారథ్యంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తాజాగా రైల్వే మంత్రిత్వ శాఖకు కీలక సిఫార్సు చేసింది. రైళ్లలో ప్రయాణించేటప్పుడు సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీని పునరుద్ధరించడాన్ని సానుభూతితో పరిశీలించాలని రైల్వే మంత్రిత్వ శాఖను కోరింది.

స్లీపర్ క్లాస్, 3ఏ తరగతిలో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు ట్రైన్ టికెట్లపై రాయితీ కల్పించాలని సూచించింది. లోక్ సభ, రాజ్య సభలో ప్రవేశపెట్టిన తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. నివేదిక ప్రకారం చూస్తే ఇది వరకు 60 ఏళ్లు లేదా ఆపైన వయసు కలిగిన మగ వారికి ట్రైన్ టికెట్ ధరలో 40 శాతం తగ్గింపు అందిస్తోంది. అదే మహిళా సీనియర్ సిటిజన్స్ విషయానికి వస్తే 58 ఏళ్లు నిండిన వారు రైల్వే ప్రయాణం చేస్తూ ఉంటే వారికి టికెట్ ధరలో 50 శాతం తగ్గింపు ఉంది. మెయిల్, ఎక్స్‌ప్రెస్, రాజధాని, శతాబ్ది, డ్యూరొంటో వంటి అన్ని ట్రైన్స్‌కు అని తరగతుల ప్రయాణానికి ఈ తగ్గింపు వర్తిస్తుంది.

అయితే కోవిడ్ 19 సంక్షోభం నుంచి ఇండియన్ రైల్వేస్ ఈ రాయితీ సర్వీసులును తొలగించింది. అయితే ఇప్పుడు స్టాండింగ్ కమిటీ మళ్లీ ఈ ట్రైన్ టికెట్లపై రాయితీని తీసుకురావాలని సూచించింది. అయితే అన్ని తరగతుల ప్రయాణానికి కాకుండా కేవలం స్లీపర్, 3ఏ తరగతి ప్రయాణానికి మాత్రమే తగ్గింపు వర్తింప జేయాలని తెలిపింది. అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్‌కు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంచాలని తెలిపింది. టికెట్ ధరలపై రాయితీ వద్దనుకునే సీనియన్ సిటిజన్స్ ఉండొచ్చని, అలాంటి వారికి రాయితీ వద్దనుకునే ఆప్షన్ ఉంచాలని తెలిపింది.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh