అల్లకలోలంగా మారిన తుర్కియా సిరియా దేశాలు
ప్రకృతి కోపానికి తుర్కియే సిరియా దేశాలు అల్లకలోలం ఏర్పడింది.ఆ దేశ సరిహద్దులలో సోమవారం తెల్లవారుజామున సంబవించిన భారి భూకంపం పెను విలయం సృష్టించింది భూకంపం తీవ్రతకు వందలది భావనలు నేలమట్టం మయ్యాయి అనేక నగరాలూ మరుభూమిని తలిపిస్తున్నాయి.భూకంపం దాటికి ఇప్పటి వరకు రెండు దేశాలలో 16oo పైగా దుర్మరణం చెందగా వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
తీవ్ర భూకంపం ధాటికి టర్కీ, సిరియా చిగురుటాకుల్లా వణికిపోయాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదైంది.భూకంపం, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. దక్షిణ టర్కీ గాజియాంటెప్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు భూమి కంపించింది. ఆ తర్వాత వరుసగా పలుమార్లు ప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. సైప్రస్, గ్రీస్, జోర్డాన్, లెబనాన్‌లో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నాయని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
సిరియా వాయువ్య ప్రాంతంలో పలు నివాస భవనాలు కూలిపోయాయి. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారని సిరియన్ సివిల్ డిఫెన్స్ తెలిపింది. ప్రస్తుతానికి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయకచర్యలు చేపట్టారు. దక్షిణ టర్కీ ప్రావిన్స్‌లోని ఉస్మానియేలో 15మంది మృతి చెందినట్టు ప్రకటించారు అధికారులు. చాలా భవనాలు కుప్పకూలాయి. 7.8 తీవ్రతతో వచ్చిన భూప్రకంపనలతో ఆస్తి, ప్రాణ నష్టం భారీగా ఉండొచ్చని తెలుస్తోంది.
టర్కీలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2020 జనవరిలో ఇలాజిగ్ ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పుడు 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అదే ఏడాది అక్టోబరులో 7.0 తీవ్రతతో సంభవించిన భూకంప విలయంలో 114 మంది మృత్యువాతపడ్డారు. సిరియా, టర్కీతో పాటు లెబనాన్, ఇరాక్, ఇజ్రాయిల్, పాలస్తీనా, సైప్రస్, గ్రీస్, జోర్డాన్ దేశాల్లోనూ భూకంపం ప్రభావం చూపించింది.
భూకంప విలయం పై భారత ప్రధాని నరేంద్ర మోధీ గారు తీవ్ర దిగ్బంతి వ్యక్తం చేశారు.ఈ విపత్కర సమయం లో ఆ దేశాలకు అండగా వుండాలని సూచించారు.అ దేశాలకు సాయం చేయడానికి సిద్ధంగా వున్నాం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు ప్రధాని.అలాగే క్షతగ్రాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. భారత విదేశంగా మంత్రి ఎస్ జైశంకర్ కూడా తీవ్ర దిగ్బంతి వ్యక్తం చేశారు.తుర్కీయ’ సిరియా ప్రకృతి విలయతండానికి యవతు ప్రపంచం తీవ్ర దిగ్బంతివ్యక్తం చేస్తున్నాయి.అ దేశాలకు సాయం చేయడానికి అన్ని ప్రపంచ దేశాలు ముందుకువస్తున్నాయి.
ఇది కూడా చదవండి :