లెఫ్ట్ పార్టీ విషయంలో కేసీఆర్ కొత్త వ్యూహం
రాజకీయ వ్యూహారచనలో తెలంగాణ సీఎం కేసీఆర్ గారి ఎవరు సాటి రారు. ఆయనను రాజకీయంగా ఎదుర్కోవాలని భావిస్తున్న నేతలంతా ముందుగా కేసీఆర్ ఏ రకమైన వ్యూహాలను అనుసరిస్తున్నారనే విషయాన్ని గ్రహించేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించేందుకు వామపక్షాలు సహకరించాయి. అక్కడ వామపక్షాలకు ఉన్న కొంతమేర రాజకీయ బలం. బీఆర్ఎస్ విజయం సాధించేందుకు ఎంతగానో కలిసొచ్చిందని ఫలితాలను తరువాత తేలింది. బీఆర్ఎస్ విజయానికి వామపక్షాల సహకారం అవసరమని భావించిన కేసీఆర్. ముందుగానే వారితో సంప్రదింపులు జరిపి వారితో సయోధ్య కుదుర్చుకున్నారు.
అలాగే మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం తరువాత అసెంబ్లీ ఎన్నికల్లోనూ వామపక్షాలతో బీఆర్ఎస్ పొత్తు కొనసాగుతుందని ప్రచారం సాగింది. వామపక్షాలు సైతం తమకు బలం ఉన్న స్థానాల్లో తాము పోటీ చేస్తామని. బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ వచ్చాయి. కానీ లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకునే విషయంలోకేసిర్ ఏ విధమైన ఆలోచనతో ఉన్నారనే విషయాలో మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. అయితే కేసీఆర్ మాత్రం వామపక్షాలతో పొత్తు ఉండాలని భావిస్తున్నా వారికి ఎన్నికల్లో సీట్లు కేటాయించే యోచనలో లేరని తెలుస్తోంది. వారికి అసెంబ్లీ సీట్లు కాకుండా. అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వాలనే ఆలోచనతో గులాబీ బాస్ ఉన్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలకు సీట్లు ఇవ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని భావిస్తున్న కేసీఆర్. అందుకు బదులుగా వారికి మండలిలో సీట్లు కేటాయిస్తే బాగుంటుందని అనుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వామపక్షాలు మాత్రం తమకు బలం ఉన్న కొన్ని సీట్లలో కచ్చితంగా పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల సీపీఐ,సీపీఎం పార్టీలు సమావేశమై కచ్చితంగా పోటీ చేయాలని. సీట్ల విషయంలో సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయించాయి. దీంతో ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్తో పొత్తు విషయాన్ని త్వరగా తేల్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.
ఇది కూడా చదవండి :