Tirumala : ఆనంద నిలయం పై సీక్రేట్ గా వీడియో తీసిన వ్యక్తి అరెస్ట్

Tirumala :

Tirumala :ఆనంద నిలయం పై సీక్రేట్ గా వీడియో తీసిన వ్యక్తి అరెస్ట్

 

Tirumala :Tirumala :కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలోని శ్రీవెంకటేశ్వర ఆలయంలో ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహిళలు, పురుషులు, పిల్లలు, సీనియర్ సిటిజన్స్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి స్వామివారి దర్శానానికి పంపిస్తుంటారు. శ్రీవారి దర్శనం చేసుకునే భక్తులను కనీసం మూడుసార్లు సెక్యూరిటీ సిబ్బంది పరిశీలించి లోపలికి పంపిస్తుంటారు.

అలాంటి తిరుమలలోని శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయంలో మొబైల్ లో వీడియో తీసిన ఓ వ్యక్తి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం కలకలం రేపింది. ఎంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్న తిరుమలలోని శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయంలో ఓ వ్యక్తి వీడియో తియ్యడంతో టీటీడీ అధికారులు, భద్రతా సిబ్బంది తీరుపై భక్తులు విమర్శలు గుప్పించారు.

ఈ విషయమై టీటీడీ  భద్రతా సిబ్బంది   రంగంలోకి  దిగి విచారణ  ప్రారంభించారు.   కరీంనగర్ కు చెందిన  రాహుల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని  ఈఓ ధర్మారెడ్డి చెప్పారు.

టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆనంద నిలయం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలు చూసి ఖమ్మం భక్తుడు భద్రతా సిబ్బందిని మోసం చేసి ఆలయంలోనికి మొబైల్ ఫోన్ తీసుకువెళ్లినట్లు నిర్ధారించారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వివరించారు. ఆనంద నిలయంలో సీక్రేట్ గా వీడియో తీసిన ఖమ్మంకు చెందిన అతనిని గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులుTirumala : అతన్ని అదుపులోకి తీసుకుని తిరుపతికి తీసుకోస్తున్నాట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు.

తిరుమల ఆలయంలోకి  మొబైల్స్ వంటి ఎలక్ట్రానిక  వస్తువులు  తీసుకెళ్లడం నిషేధం. కానీ ఈ నిషేధం  ఉన్నా కూడా  రాహుల్ రెడ్డి మొబైల్ ఫోన్ ను  ఆలయంలోకి ఎలా తీసుకెళ్లారనే విషయమై  ఇప్పుడు  టీటీడీ అధికారులు  దర్యాప్తు  చేయనున్నారు.

అయితే గత నెలలో  టీటీడీ ఆలయంపై నుండి  హెలికాప్టర్లు  చక్కర్లు కొట్టాయి.  నో ఫ్లై  జోన్  ప్రాంతమైన  తిరుమలలో  హెలికాప్టర్లు  చక్కర్లు  కొట్టాయి.  ఈ విషయమైTirumala :  భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు.  అయితే  ఆర్మీకి చెందిన  హెలికాప్టర్లు  తిరుమల మీదుగా   చెన్నైకి  బయలుదేరాయని  సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు.

తిరుమలలో భద్రతా వైఫల్యాన్ని  సీరియస్ గా తీసుకుంటామని   టీటీడీ ఈవో  ధర్మారెడ్డి  స్పష్టం  చేశారు.  విధుల విషయంలో  భద్రతా సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యంగా  ఉన్నారా  అనే విషయమై  కూడా దర్యాప్తు  నిర్వహిస్తున్నామని  కూడా  ఈవో  తెలిపారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh