Car Driving: నిజమైన కారు డ్రైవింగ్ చేస్తూ బొమ్మ కారును కొనేందుకు వెళ్ళిన అన్నదమ్ములు

Car Driving:

Car Driving: నిజమైన కారు డ్రైవింగ్ చేస్తూ బొమ్మ కారును కొనేందుకు వెళ్ళిన అన్నదమ్ములు

Car Driving: అసలు  చిన్నపిల్లలు ఎప్పుడూ కొత్త కొత్త బొమ్మలతో ఆడుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇంట్లో బోలెడన్ని బొమ్మలు ఉన్న ఇంకా కొత్త బొమ్మలు కావాలని తల్లిదండ్రుల దగ్గర మారం చేస్తూ ఉండడం కూడా ఎప్పుడో చూస్తూ ఉంటాం. అయితే కొన్ని కొన్ని సార్లు ఇక పిల్లలు కోరిన విధంగానే ఎప్పటికప్పుడు కొత్త బొమ్మలు తెచ్చి ఇస్తూ ఉంటారు తల్లిదండ్రులు. మరికొన్నిసార్లు తమకు నచ్చిన బొమ్మలను దగ్గరలో ఉన్న షాపులోకి వెళ్లి పిల్లలే స్వయంగా కొనుగోలు చేయడం చూస్తూ ఉంటాం. ఇక్కడ పిల్లలు కూడా ఇలాగే కొత్త కార్ బొమ్మతో ఆడుకోవాలని ఆశపడ్డారు.

ఇది సర్వసాధారణం ఇందులో కొత్త ఏముంది అని అనుకుంటున్నారు కదా. అయితే బొమ్మకారుతో ఆడుకోవాలని ఆశపడిన ఆరేళ్లు, మూడేళ్ల వయసు కలిగిన ఇద్దరు బాలురు.. నిజమైన కారు డ్రైవింగ్ చేస్తూ బొమ్మ కారును కొనేందుకు వెళ్లారు. ఇది వినడానికి షాకింగ్ గా ఉంది కదా మలేషియాలోని లాంగ్ కావిలో ఇది నిజంగానే జరిగింది. Car Driving: దాదాపు 2.5 కిలోమీటర్ల వరకు అలాగే నిజమైన కారు నడిపారు.  అతని మూడేళ్ల సోదరుడు ప్యాసింజర్ సీటుపై కూర్చున్నాడు. ఉలు మెలక నుండి కంపుంగ్ నైయోర్ చబాంగ్ వైపు ప్రయాణిస్తుండగా, కారు అదుపు తప్పి నేరుగా  విద్యుత్  స్తంభాన్ని ఢీకొట్టింది.  అక్కడున్నా స్థానికులు పరుగున వచ్చి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ఎక్కడున్నాడో అని చూస్తే ఇద్దరు చిన్నారులు ఉండడం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  తమ తల్లిదండ్రులు ఇంటి పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో ఇలా అన్నదమ్ములు ఇద్దరు కూడా గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో ఉన్న కారును బయటకు తీసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసం కాగా ఆరేళ్ల బాలుడికి స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే బొమ్మ కారు కొనేందుకుగాను Car Driving: ఇలా నిజమైన కారులో దుకాణానికి బయలుదేరినట్లు చిన్నారులు చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. అయితే తొలుత ఎవరో మద్యం మత్తులో కారు నడుపుతున్నట్లు భావించామని.. కానీ దగ్గరికి వెళ్లి చూస్తే అందులో పిల్లలు ఉన్నారని.. కానీ వారు క్షేమంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నామని స్థానికులు చెబుతున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh