Telangana : నేడు తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం

Telangana : నేడు తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం

Telangana : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 21 (బుధవారం)న  రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలు,

ప్రార్థనా మందిరాల్లో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

సమైక్య పాలనలో ఆదరణ లేక ప్రాభవాన్ని కోల్పోయిన దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు స్వరాష్ట్రంలో పునర్వైభవం సంతరించుకుంటున్నాయి.

కేసీఆర్‌ సర్కారు కృషితో ఓ వెలుగు వెలుగుతున్నాయి. ప్రజల్లోనూ ఆధ్యాత్మకత వెల్లివిరిస్తున్నది.

ఇదే సమయంలో ప్రధాన దేవాలయాలైన కొండగట్టు అంజన్న, ధర్మపురి నృసింహస్వామి, వేములవాడ రాజన్న ఆలయాలపై ప్రత్యేక దృష్టిపెట్టిన ప్రభుత్వం.

ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నది. మైనార్టీల ప్రార్థనా మందిరాల్లో ని మౌజమ్‌లు, ఇమామ్‌లకు నెలనెలా వేతనాలు ఇస్తున్నది.

ఇటు ధూపదీప నైవైద్య పథకం కింద దేవాలయాల నిర్వహణతోపాటు పూజారులకు నెలనెలా గౌరవ వేతనాలు అందిస్తున్నది. Telangana : నేడు ఆధ్యాత్మక దినోత్సవాన్ని పురస్కరించుకొని..

ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఈ పథకాన్ని మరో 214 గుళ్లకు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేయగా.

. బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో సర్వమతాలకు సముచిత ప్రాధాన్యం దక్కుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు పరాధీనమైన ఆలయాల భూములను తిరిగి రాబట్టేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ ఆలయాల ఆస్తుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.

ఆధ్మాత్మిక దివస్ సంద‌ర్భంగా మామిడి తోరణాలు, పూలు, విద్యుత్తు దీపాలతో ఆలయాలను అలంకరించడంతోపాటు వేద పారాయాణం, అభిషేకాలు, హోమాలు, హరికథలు, కవి సమ్మేళనం, సత్కారాలు, శాస్త్రీయ సంగీతం – నృత్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.

నేడు తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం

కొత్తగా 2,043 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం అమలుకు శ్రీకారం చుట్టనునట్లు మంత్రి వెల్లడించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 3,645 దేవాలయాలకు ఈ పథకం వర్తిస్తుండగా, కొత్త వాటితో కలుపుకుని మొత్తం 6,661 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకం అమలు కానుంది అన్నారు.

ధూప దీప నైవేద్య అర్చకుల వేతనాలను రూ.6,000 నుంచి రూ.10,000 లకు పెంచుతామని సీయం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.

త్వరలోనే ఈ హామీని అమలు చేస్తామని తెలిపారు.

అలాగే ఆధ్మాత్మిక దివస్ సంద‌ర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాల‌యంలో

నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాల్లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి పాల్గొంటారు.

నేటి నుంచి భ‌క్తుల‌కు అందుబాటులోకి మిల్లెట్ ప్రసాద సేవ‌ల‌ను ప్రారంభించ‌డం, ఆధ్మాత్మిక దినోత్సవం సంద‌ర్భంగా

భ‌క్తుల‌కు ఉచితంగా మిల్లెట్ ప్రసాదాన్ని అంద‌జేయ‌డంతో పాటు, యాదాద్రి శ్రీ ల‌క్ష్మీ న‌రసింహ స్వామి వారి బంగారం, వెండి నాణేల అమ్మకం,

ఆన్ లైన్ టికెట్ సేవ‌ల ప్రారంభం, రాయ‌గిరి వేద‌పాఠ‌శాల నిర్మాణానికి భూమిపూజ‌, అన్నదాన సత్రం ప్రారంభం, ప్రెసిడెన్షియ‌ల్ సూట్ స‌మీపంలో క‌ళ్యాణ మండ‌పాన్ని ప్రారంభించ‌నున్నారు.

అలాగే ఉమ్మడిజిల్లాలోని ప్రధాన దేవాయాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టిపెట్టారు.

వేములవాడ రాజన్న ఆలయం పరిధిని విస్తరించేందుకు 30 కోట్లు వెచ్చించి 33 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అభివృద్ధి చేశారు.

బద్దిపోచమ్మ ఆలయ విస్తరణకు 17.60 కోట్లు, వేములవాడతో అనుసంధానంగా ఉన్న అన్ని ప్రధాన రహదారుల

అభివృద్ధికి 15.8 కోట్లు, రాజన్న ఆలయానికి మిషన్‌ భగీరథ నీళ్లు ఇచ్చేందుకు 3.69 కోట్లు వెచ్చించారు.

ఇవేకాక దాదాపు మరో 20 కోట్లతో టౌన్‌, దేవాలయ అభివృద్ధి పనులు సాగుతుండగా, భవిష్యత్తులో Telangana : యాదాద్రి తరహాలో రాజన్న దేవాలయాన్ని వైభవంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు

రూపుదిద్దుకుంటున్నాయి. ధర్మపురి నర్సింహస్వామి ఆలయ అభివృద్ధికి ఇప్పటికే ప్రభుత్వం 100 కోట్లు ఇచ్చింది.

వీటితో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. కొండగట్టు అంజన్న స్వామి అలయ అభివృద్ధికి 100 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

ఆంజన్న దేవాలయాన్ని సమగ్ర అభివృద్ధి చేసేందుకు పలు ప్రణాళికలు పురుడు పోసుకోగా కొన్ని పనులకు టెండర్లు సైతం పూర్తయ్యాయి.

ఈ మూడు దేవాయాలు ప్రభుత్వం అనుకున్న తరహాలో అభివృద్ధి అయితే.. గొప్ప పర్యాటక కేంద్రాలుగా బాసిల్లనున్నాయి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh