Teacher Jobs : ఏకలవ్య పాఠశాలల్లో 239 పోస్టుల భర్తీకి … నోటిఫికేషన్

Teacher Jobs

Teacher Jobs : ఏకలవ్య పాఠశాలల్లో 239 పోస్టుల భర్తీకి … నోటిఫికేషన్

Teacher Jobs : తెలంగాణలోని 23 ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన 239 గెస్ట్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.

అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

అలాగే ఎంపికైన అభ్యర్థులకు పాఠశాల ఆవరణలోనే వసతి కల్పిస్తారు. సీబీఎస్ఈ సిలబస్ ను  ఇంగ్లిష్ లోనే  బోధించాలి.

అర్హులైన అభ్యర్థులు జూలై 2లోగా ఆన్లైన్ లో  దరఖాస్తు చేసుకోవాలని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ (టీఎస్ఈఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది.

సంబంధిత సబ్జెక్టు స్పెషలైజేషన్ ఉన్న డిగ్రీ, పీజీ, బీఈడీ, పీహెచ్ డీ, ఎంఫిల్, ఎంఈడీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టెట్ లో అర్హతతో పాటు టీచింగ్ అనుభవం తప్పనిసరి.

అభ్యర్థుల వయస్సు 2023 జూలై 1 నాటికి 60 ఏళ్లు మించకూడదు.

ఏయే పోస్టులు ఎన్నంటే..?

ప్రిన్సిపల్‌ 740; వైస్‌ ప్రిన్సిపల్‌ 740; పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (PGT) 8880, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (TGT) 8840; ఆర్ట్‌ టీచర్‌ 740, మ్యూజిక్‌ టీచర్‌ 740; ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌(PET) 1480; లైబ్రేరియన్‌ 740; కౌన్సెలర్‌ 740; స్టాఫ్‌

నర్సు 740; హాస్టల్‌ వార్డెన్‌ 1480; అకౌంటెంట్‌ 740; సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ 740; జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ 1480; క్యాటరింగ్ అసిస్టెంట్‌ 740; డ్రైవర్‌ 740, ఎలక్ట్రీషియన్‌, ప్లంబర్‌ 740; ల్యాబ్‌ అటెండెంట్‌ 740;

గార్డెనర్‌ 740; కుక్‌ 470, మెస్‌ హెల్పర్‌ 1480; చౌకీదార్‌ 1480; స్వీపర్‌ 2220 చొప్పున ఉన్నాయి.

అలాగే అకడమిక్ మెరిట్, టీచింగ్ ఎక్స్పీరియన్స్, స్కిల్స్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఎంపికైన అభ్యర్థులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ)కు నెలకు రూ.35,750 చెల్లిస్తారు.

అదేవిధంగా శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)కు రూ.34,125 వరకు వేతనం చెల్లిస్తారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మినహా మిగతా అభ్యర్థులు రూ.100 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.

సబ్జెక్ట్ వారీగా ఖాళీల వివరాలు..
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు (పీజీటీ)
ఇంగ్లిష్- 15, హిందీ- 9, గణితం- 11, భౌతికశాస్త్రం- 18, కెమిస్ట్రీ- 5, జీవశాస్త్రం- 13, చరిత్ర- 16, భూగోళశాస్త్రం- 17, కామర్స్‌- 5, ఎకనామిక్స్‌- 10, తెలుగు- 07, ఐటీ- 13

ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్ (టీజీటీ)
ఇంగ్లిష్- 27, హిందీ- 12, తెలుగు- 17, గణితం- 14, సైన్స్- 19, సోషల్‌ సైన్సెస్‌- 11

ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ)

ఇంగ్లిష్‌- 27, హిందీ- 12, తెలుగు- 17, గణితం- 14, సైన్స్‌- 19, సోషల్‌ సైన్సెస్‌- 11

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh