Rohith reddy : ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి తప్పిన పెను ప్రమాదం

Rohoth reddy

Rohith reddy : ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి తప్పిన పెను ప్రమాదం

Rohith reddy :తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కూడా ప్రమాదానికి గురైంది.  ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో చోటుచేసుకుంది.

ఈ ఘటన శనివారం రోజు ఉదయం చోటుచేసుకుంది.

ఎమ్మెల్యే పైలేట్ రోహిత్ రెడ్డి పని మీద బెంగుళూరు వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తున్న క్రమంలో.

. మంగళూరు సమీపంలోని ముడూరు- నల్లూరు క్రాస్ వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు ఒక్కసారిగా అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది.

అయితే.. కారులో ప్రయాణిస్తున్న పైలెట్ రోహిత్ రెడ్డికి ఎలాంటి ప్రమాదం జరగలేదని.. ఆయన పూర్తి క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావటంతో.. పైలెట్ రోహిత్ రెడ్డికి ప్రమాదం తప్పింది.

అయితే.. ఇదే విషయమై రోహిత్ రెడ్డి స్పందించారు. సోషల్ మీడియాలో తనకు ఈ ఉదయం యాక్సిడెంట్ అయినట్టు వస్తున్నా వార్తలు వాస్తవమేనని స్పష్టం చేశారు.

అయితే.. ఈ ప్రమాదంలో తనకు ఎటువంటి గాయాలు కాలేదని… అందరి ప్రేమానురాగాల వల్ల తాను క్షేమంగానే ఉన్నట్టు తెలిపారు.

తన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని పైలెట్ రోహిత్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇక ఈ ఘటనపై స్థానిక కర్కల పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు.

ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh