టీడీపీలో విషాదం సీనియర్ నాయకుడు మృతి

TDP MLC BATCHULA ARJUNUDU PASSES AWAY

టీడీపీలో విషాదం సీనియర్ నాయకుడు మృతి

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, గన్నవరం ఇంచార్జ్ బచ్చుల అర్జునుడు అనారోగ్యంతో కన్నుమూశారు. గుండెపోటు  రావడంతో ఆయన జనవరి 28న విజయవాడలోని రమేష్ ఆస్పత్రిలో చేరారు. ఆ రోజు నుంచి వెంటిలేటర్‌పైనే బచ్చుల చికిత్స పొందుతున్నారు. ఆయనకు స్టంట్ వేసినా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం బచ్చుల ఆరోగ్యం మరింత క్షీణించి అవయవాలు అన్నీ పనిచేయకపోవడంతో సాయంత్రం తుదిశ్వాస విడిచారు. అర్జునుడు మృతితో బచ్చుల కుటుంబంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. తమ అభిమాన నేత ఇకలేరని తెలుసుకున్న కార్యకర్తలు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. బచ్చులను చూడటానికి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. అర్జునుడి మృతికి పలువురు టీడీపీ ముఖ్యనేతలు సంతాపం తెలిపారు. కాగా అర్జునుడి స్వస్థలం మచిలీపట్నం ఇటీవలే ఆయన చికిత్స పొందుతుండగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇతర టీడీపీ నేతలు పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

2021లో ఒకసారి గుండెపోటుకు గురయ్యారు. అప్పుడు కూడా ఇదే రమేశ్ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులు వైద్యం చేయించారు. అత్యవసర శస్త్రచికిత్స అందించడంతో గతంలో ప్రాణాపాయం తప్పింది. సర్జరీ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది. అయితే డిసెంబర్ 28న మరోసారి గుండెపోటు వచ్చింది. ఈసారి కూడా తమ అభిమాన నేత క్షేమంగా తిరిగొస్తారని అభిమానులు భావించారు. పెద్ద ఎత్తున ప్రార్థనలు కూడా చేశారు కానీ వారి ప్రార్థనలు ఫలించలేదు.

కరోనా సమయంలో రెండుసార్లు వైరస్ సోకింది. అప్పటి నుంచి ఆయన పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. కరోనా తర్వాత ఊపిరితిత్తుల సమస్యతో బాధపడటం, గుండెపోటు రావడం జరుగుతోందని బచ్చుల అనుచరులు చెబుతున్నారు. కాగా బచ్చుల ప్రస్తుతం గన్నవరం టీడీపీ ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి దూరమవ్వడంతో గన్నవరం బాధ్యతలను బచ్చులకు చంద్రబాబు అప్పగించారు. నాటి నుంచి నియోజకవర్గంలో కార్యకర్తలు, ప్రజా సమస్యల పరిష్కారానికై బచ్చుల కృషి చేస్తూ వచ్చారు.

ఇది కూడా చదవండి :

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh