సుమ చేసిన పనికి అందరు ఫిదా
బులితెర లో స్టార్ యాంకర్ అంటే ముందుగా గుర్తు కు వచ్చే పేరు సుమ కనకాల. ఎంతమంది కొత్త యాంకర్ పుట్టుకొచ్చిన సుమ ను మించలేరు. అవ్వడానికి మలయాళ అమ్మాయి అయినా.. తెలుగువారికంటే స్పస్టమైన తెలుగు మాట్లాడుతూ.. యాంకర్ గా స్టార్ డమ్ తో దూసుకుపోతోంది సుమ కనకాల. సుమ గురించి మన తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాంకర్ గా ఇంత లాంగ్ టైమ్ ఎంటర్టైన్ చేసిన వారు ఇంకెవరూ లేరనే అనాలి.
సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అయిన. టాక్ షోలైనా.గేమ్ షోలైనా.. మరి ఏ షో అయిన తనదైన మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు సుమ. స్టార్ హీరోలు సైతం సుమకు ఫ్యాన్స్ గా మారిపోయారు. అంతలా ఆమె చలాకీగా తెలుగులో మాట్లాడుతూ.. యాంకరింగ్ చేస్తూ అలరిస్తున్నారు. ఇక సుమ పలు సీరియల్స్ తో పాటు సినిమాల్లోనూ నటించారు. ఆ తర్వాత యాంకరింగ్ లో దూసుకుపోతున్నారు. సుమ కెరీర్ బినింగ్ లో పలు సీరియల్స్ లో నటించారు అలరించారు సుమ. ప్రస్తుతం ఇప్పుడు సుమ చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రేక్షకులు. తాజాగా సుమ చెన్నై లోని ఒక కాలేజ్ కు వెళ్లారు. అక్కడి విద్యార్థులతో ఆమె సరదాగా మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. “నేను పుట్టింది పాలక్కాడ్ లో.. నాకు 15 ఏళ్ల వయసున్నప్పుడు యాంకరింగ్ మొదలుపెట్టాను. జీవితం అంటేనే పెద్ద ఛాలెంజ్, పోయేవరకు ఏదో ఒక ట్రబుల్ వస్తూనే ఉంటుంది అని అన్నారు సుమ. అలాగే ”ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్” అనే సంస్థ నా డ్రీం.. ఎందుకంటే నన్ను ఆదరించి ఇంత దాన్ని చేసిన ప్రేక్షకుల కోసం ఏదోకటి చేయాలి అనుకున్నా.. నాకు వచ్చే దాంట్లో నేను తినడమే కాదు అందరికీ ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో దీనిని స్టార్ట్ చేయడం జరిగింది.
నా వంతుగా 30 మంది స్టూడెంట్స్ ని అడాప్ట్ చేసుకుని చదివిస్తున్నాను. వాళ్ళు బాగా సెటిల్ అయ్యే వరకు నేను వాళ్ళతోనే ఉంటాను. ఇప్పటికే అమెరికాలో ఉన్న ఎఫ్ ఐ ఏ సంస్థ వాళ్ళు మాతో కొలాబరేట్ అయ్యారు అలాగే జైపూర్ లింబ్స్ డొనేట్ చేశారు” అంటూ సుమ చెప్పుకొచ్చారు.దీనితో ఆమెపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి: