Sri Rama Navami: Bhadradri Ramaiah Kalyan Mahatsavam

SITHARAMULA

Sri Rama Navami: Bhadradri Ramaiah Kalyan Mahatsavam

Sri Rama Navami:Bhadradri Ramaiah Kalyan Mahatsavam అంగరంగ వైభవంగా భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవం..
రాముడు అందరికీ దేవుడే.. అయినా తెలుగువాళ్లకు స్పెషల్‌. రాములోరి కల్యాణం మరీ మరీ స్పెషల్‌. అలాంటి అపురూపమైన భద్రాద్రి సీతారాముల కల్యాణ ఘట్టాన్ని మనం లైవ్‌లో చూడగలమా.? లేదా.? 40 ఏళ్ల ఆనవాయితీ ఈసారి ఏమవుతుంది.? శ్రీరామనవమి అంటే.. అందరికీ గుర్తొచ్చేది భద్రాచలంలో సీతారాముల కల్యాణమే. అంగరంగ వైభవంగా జరిగే ఈ కల్యాణాన్ని తప్పకుండా తిలకించాలని భక్తులు కోరుకుంటారు. సాధ్యమైన వారు భద్రాచలం వెళ్లి రాములోకి పెళ్లిని చూస్తారు. అక్కడ జరిగే ప్రతీ ఘట్టాన్ని తనివితీరా చూసి తరించి పులకిస్తారు. ఇక భద్రాచలం వెళ్లలేని భక్తులు మాత్రం టీవీల్లో వచ్చే ప్రత్యక్ష ప్రసారాన్ని మిస్‌ అవ్వరు. అత్యంత వైభవంగా జరిగే రాములోరి కల్యాణ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎదురు చూస్తుంటారు. దాదాపు 40ఏళ్ల నుంచి సీతారాముల కల్యాణాన్ని టీవీల్లో చూస్తున్నారు భక్తులు. కాని ఈసారి లైవ్‌ టెలీకాస్ట్‌పై ఎన్నికల కోడ్‌ ఎఫెక్ట్‌ పడింది. ఈసీ విధించిన నిబంధనలు.. కల్యాణఘట్టం లైవ్‌ టెలికాస్ట్‌కు అడ్డంకిగా మారాయి. ప్రభుత్వం అధికారికంగా లైవ్‌ టెలికాస్ట్‌ చేయొద్దని ఈసీ నిబంధన విధించింది. ఈ విషయాన్ని సీఎస్‌కు లేఖరాసింది.
దేవాదాయ శాఖామంత్రి కొండా సురేఖ రాష్ట్ర సీఈవోకి లేఖ రాశారు. కళ్యాణం లైవ్‌ టెలీకాస్ట్‌కు అడ్డుపడొద్దని కోరారు. ప్రత్యక్షప్రసారానికి కోడ్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. దాదాపు 40 ఏళ్లుగా కల్యాణమహోత్సవం ప్రత్యక్షప్రసారం జరుగుతోందని.. కల్యాణం, పట్టాభిషేక కార్యక్రమాల ప్రత్యక్షప్రసారానికి అనుమతి ఇవ్వాలని అటు సీఈసీకి కూడా లేఖ రాశారామె. ఇటు బీజేపీ బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ సైతం శ్రీరాముడి కళ్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ని కలిసి లేఖ అందజేశారు. ఎన్నికల కోడ్‌ పేరుతో లైవ్‌కి అనుమతి ఇవ్వకపోవడం సరైన నిర్ణయం కాదన్నారాయన. 40 ఏళ్లుగా వస్తున్న సెంటిమెంట్‌కు బ్రేక్‌ వెయ్యొద్దన్నారు. పండురోజు భక్తులను బాధపెట్టొద్దంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా… ఈసీ నిర్ణయంతో భక్తులు ఆవేదన చెందుతున్నారు. రామయ్య కళ్యాణం ఎలా చూసేదంటూ భాదను వ్యక్తం చేస్తున్నారు.

 

Sri Rama Navami 2024 Date, Story, Celebrations & Importance

for more information click here

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh