Selfie suicide: హైదరాబాద్ లో సాప్ట్ వేర్ ఇంజినీర్‌ సెల్ఫీ సూసైడ్

Selfie suicide

Selfie suicide: హైదరాబాద్ లో సాప్ట్ వేర్ ఇంజినీర్‌ సెల్ఫీ సూసైడ్

Selfie suicide:  హైదరాబాద్ పరిధిలోని నాచారంలో మానసిక ఒత్తిడికి గురైన ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఫ్యాన్ కు ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది . ఆత్మహత్యకు ముందు తన చావుకి

కారణం భర్తేనని పేర్కొంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేసింది. ఫేస్ బుక్ లో లైవ్ వీడియో పెట్టి తన గోడు తెలిపింది. ఐదు నెలలుగా తన భర్త తీవ్రంగా వేధిస్తున్నాడని, అందుకే చనిపోతున్నానంటూ సాఫ్ట్

వేర్ ఇంజినీర్ సన పేర్కొంది.  అయితే  సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సన ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు పంపారు. తన భర్త హేమంత్

వేధింపులకు గురిచేస్తున్నా.. కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోలేదని, వాళ్లు కూడా తమ ఇష్టానికి మాట్లాడారని తెలిపింది. భర్త వేధింపులు మరింత ఎక్కువ అవడంతో.. భరించలేక ప్రాణం తీసుకుంటున్నట్లు తెలిపింది.

మరో వైపు ఆమె తండ్రి మాత్రం మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె భర్త, అతని కుటుంబం టార్చర్‌ భరించలేక తన కూతురు ప్రాణం తీసుకుందని ఆమె తండ్రి వాపోతున్నాడు.

అయితే  అసలు వివరాలలోకి వెళ్ళితే.. సాప్ట్ వేర్ ఉద్యోగి అయిన సనా.. తండ్రి ఉంటున్న బిల్డింగ్‌లోనే మరో పోర్షన్‌లో ఉంటోంది. ఈ క్రమంలో సనాతల్లి ఎంతసేపు తలుపులు కొట్టినా తీయకపోవడంతో

బద్ధలు కొట్టిచూశారు. సనా ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. భర్త, మామల్ని ఫేస్‌బుక్‌లో లైవ్‌పెట్టి మరీ ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్న

ఆమె.. తండ్రి సాయంతో కొడుక్కి(3) స్కూల్‌లో తాజాగా అడ్మిషన్‌ ఇప్పించింది. అంతా సంతోషంగా ఉందనుకుంటున్న సమయంలో ఆమె ఇలా చేయడాన్ని ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు.

అయితే తన అల్లుడి కుటుంబం వేధింపుల వల్లే తన కూతురు చనిపోయిందని సనా తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 2019లో రాజస్థాన్‌కు చెందిన రాజ్‌పుత్‌ యువకుడు హేమంత్‌తో ఆమె ప్రేమ

వివాహం జరిగింది. మతం మారతానని ముందుకొచ్చిన అతను.. ఆమె తండ్రిని ఒప్పించి మరీ వివాహం చేసుకున్నాడు.

హైదరాబాద్ లో సాప్ట్ వేర్ ఇంజినీర్‌ సెల్ఫీ సూసైడ్

అయితే.. అతని కుటుంబ సభ్యులకు ఈ వివాహం ఇష్టం లేదు. అందుకే సనాను

మానసికంగా వేధింపులకు గురి చేస్తూ వచ్చింది. ఈలోపు అతని దగ్గరికి సంగీతం నేర్చుకోవడానికి సూఫీ ఖాన్‌ వచ్చింది.

నటిగా పరిచయం చేసుకున్న సూఫీ ఖాన్‌తో సనా భర్తకు చనువు ఏర్పడింది. ఇద్దరూ వివాహేతర సంబంధం కొనసాగించారు.

దీంతో సనాకు, ఆమె భర్తకు మధ్య గొడవలు జరిగాయి. సూఫీఖానాను ప్రేమలో

పడి తన కూతురిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడని టార్చర్‌ పెట్టాడని సనా తండ్రి నాచారం పీఎస్‌లో ఫిర్యాదు కూడా చేశాడు.

అప్పుడు ఇరుకుటుంబాలు మాట్లాడుకుని గొడవను సర్దుమణిగేలా చేశాయి. ఆపై ఆ

భార్యాభర్తలు రాజస్థాన్‌ వెళ్లిపోయి ఉద్యోగాలు చేసుకుంటూ కొడుకును చూసుకుంటున్నారు.

ఈలోపు సూఫీఖాన్‌ విషయంలోనే మళ్లీ ఆ భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. కోపంతో కొడుకును

తీసుకుని తిరిగి నాచారం వచ్చేసిందామె. అయితే కొడుకును చూసుకుంటూ..

సంతోషంగానే ఆమె ఉందని అంతా భావించారు. ఈలోపే ఇలా అఘాయిత్యానికి ఒడిగట్టింది సనా.

సూఫీఖాన్‌కు, సనా భర్త మధ్య జరిగిన సంభాషణలు, వాట్సాప్‌ ఛాటింగ్‌, వాళ్లు దిగిన ఫొటోలు, వాళ్ల వివాహేతర సంబంధానికి సంబంధించిన అన్నీ సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని సనా తండ్రి

అంటున్నాడు. తన కూతురికి న్యాయం చేయాలని కన్నీళ్లతో డిమాండ్‌ చేస్తున్నాడాయన. భర్త వేధింపులు ఎక్కువ కావడంతోనే ఆమె..

వాళ్లను లైవ్‌లో పెట్టి మరీ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని ఆమె

తండ్రి  ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh