Sleep deprivation: కనీస సమయం నిద్ర పోవడం లేదా.. వెరీ డేంజర్ అంటున్న పరిశోధకులు..

కనీస సమయం నిద్ర పోవడం లేదా.. 

రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవాలని సాధారణంగా ఎవరైనా చెప్తారు. ఎక్కువ సమయం నిద్రపోతే.. నిద్ర దెయ్యం పట్టిందా.. వాడు సోమరిపోతులా తయారవుతున్నాడు. వాడికెంత బద్దకమో అంటూ ఉంటారు ఇంట్లో ఎక్కువ సేపు నిద్రపోతే బద్ధకం పెరిగి ఎన్నో ఆరోగ్య సమస్యలు..

 

ఎక్కువ సేపు నిద్రపోతే బద్ధకం పెరిగి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంటారు. కాని కనీస సమయం పడుకోకపోయినా ఇబ్బందే అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. నిద్ర లేమి శరీరంలో ఎన్నో రోగాలు వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర లేమి కారణంగా ఏకాగ్రత లోపించడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలతో ఇది ముడిపడి ఉంటుందట. అయితే తాజా అధ్యయనం ప్రకారం తగినంత నిద్ర లేకపోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని తేలింది. మరి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా కనీస సమయం నిద్రపోవాలంటే మన లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు అవసరమంటున్నారు వైద్య నిపుణులు. రోజులో కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోవచ్చు. అయితే ఒక గంట అటు ఇటు పర్వాలేదు కాని.. బాగా తక్కువ సమయం పడుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. నిద్ర లేమి శరీరంలో జీవక్రియ మార్పులకు దారితీస్తుందని, ఫలితంగా గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుందని తేలింది. దీని వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని ఈఅధ్యయనం తెలిపింది.

నిద్రకు తగిన సమయం కేటాయించాలి

ఒక రోజులో ఎంత సేపు పడుకోవాలో షెడ్యూల్ చేసుకోవాలి. మనం మేల్కొనే సమయం కూడా నిర్ణయించుకోవాలి. నిద్ర రావడంలేదంటూ కొన్ని సార్లు పడుకోము. అలాకాకుండా మనం నిర్ణయించుకున్న సమయానికి పడుకోవాలి అలా కొద్ది రోజులు ప్రయత్నిస్తే ఆటైంకి పడుకోవడం అలవాటు అయిపోతుంది.

ప్రశాంత వాతావరణం

నిద్రపోయేటప్పుడు ఎంత హాయిగా ఉంటున్నారనేది చూసుకోవాలి. సౌకర్యవంతమైన పరుపులు, దిండ్లు ఎంచుకోవాలి. గది ఉష్ణోగ్రత సమానంగా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే పడుకునే ముందు కొద్ది సేపు మంచి మెలోడీ సాంగ్స్ వినడం మంచిది.

కాఫీ, టీలు తాగడం తగ్గించాలి

నిద్రలేమితో బాధపడుతున్నవారు కాఫీ, టీలు తాగడం తగ్గించాలి. ఇలా చేస్తే నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఒత్తిడిని తగ్గించుకోవాలి

వ్యక్తిగత లేదా పని సంబంధిత ఒత్తిడికి గురవడం నిద్రలేమికి కారణం కావచ్చు. మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం వలన మీరు మీ మనస్సుపై ఒత్తిడి లేకుండా చూసుకోవచ్చు. నిద్రకు ముందు ఒత్తిడి లేకుండా ఎలా తగ్గించుకోవచ్చో పలు సూచనలు చేస్తారు. వైద్యులు సూచనల ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

ఆయుర్వేద శాస్త్రం ప్రశాంతమైన నిద్ర కోసం కొన్ని ఔషదాలను సూచిస్తున్నాయి. వాటికి సంబంధించి సారస్వతారిష్ట, అశ్వగంధారిష్ట, ద్రాక్షారిష్ట, అర్జునారిష్ట, నాల్గింటినీ కలిపిన ఔషధాన్ని రోజు రెండుసార్లు ఆరు చెంచాల చొప్పున తీసుకుని కొద్దిగా నీళ్ళు కలిపి తాగండి. క్రమేణా నిద్ర వస్తుంది. క్షీరబలాతైలం గొట్టాలు ఆయుర్వేద మందుల షాపుల్లో దొరుకుతాయి. వీటిని పూటకు రెండు చొప్పున రెండు పూటలా తీసుకొంటూఉంటే నిద్రాభంగం తగ్గుతుంది. ప్రాణాయామం నిద్ర పట్టేలా చేస్తుంది. జాజికాయ, జాపత్రి, మరాటీ మొగ్గలను 10 గ్రాముల చొప్పున తీసుకుని, అందులో 5 గ్రాముల పచ్చ కర్పూరం ఈ నాల్గింటినీ మెత్తగా నూరి ఒక సీసాలో భద్రపరచుకోండి. ప్రతిరోజూ ఉదయం, రాత్రి రెండు పూటలా గ్లాసు వేడి పాలలో పావుచెంచా పొడిని కలిపి తాగుతుంటే మంచి నిద్ర వస్తుంది. కుముదేశ్వర రసం, ఉదయభాస్కర రసం అనే ఔషధాలు రెండూ వాడుతూ ఉంటే నిద్రభంగం నుండి విముక్తి పొందవచ్చు. ఇవన్నీ ఆయుర్వేద వైద్యుని పర్యవేక్షణలో పాటిస్తే మంచి ఫలితం పొందవచ్చు.

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh