Allu Arjun: బ్యాంకాక్‏లో సందడి చేయనున్న పుష్పరాజ్.. పుష్ప 2 నుంచి క్రేజీ అప్డేట్..

పుష్ప 2 క్రేజీ అప్డేట్..

 అల్లు అర్జున్ పూర్తిగా కొత్త లుక్‏లో కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు నెట్టింట ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చక్కర్లు

 

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో పూర్తిగా కొత్త లుక్‏లో కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు నెట్టింట ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ మూవీలోని యాక్షన్ సన్ని వేశాలను చిత్రీకరించేందుకు చిత్రయూనిట్ బ్యాంకాక్ వెళ్లనున్నట్లు సమాచారం.

 

నవంబర్ 13న బన్నీతోపాటు.. చిత్రబృందం బ్యాంకాక్ వెళ్లనున్నారని తెలుస్తోంది. ఇక ఆ తర్వాత పుష్ప ప్రమోషన్లలో భాగంగా రష్యా వెళ్లనున్నాడట. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన పుష్ప సినిమా ఇప్పుడు రష్యాలో విడుదల కానుంది. పుష్ప 2 సినిమా కోసం మరింత పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ కోసం చిత్రయూనిట్ నవంబర్ 13న బ్యాంకాక్ వెళ్లనున్నట్లు సమాచారం.

 

దాదాపు 15 రోజులపాటు అక్కడ యాక్షన్ షెడ్యూల్ నిర్వహించనున్నారని… అనంతరం రష్యాలో పుష్ప పార్ట్ 1 త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రష్మిక, ఫహద్ ఫాజిల్, అనుసూయ, సునీల్ కీలకపాత్రలలో నటించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ కానుంది.

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh