పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. ఆ పవిత్ర దినం ఈ రోజు కావడంతో దేశంలోని అన్నీ శైవ క్షేత్రాలు భక్తులతో రద్దీగా మారాయి. కోరి కొలిచిన వారికి కొంగుబంగారం, అందరి కోరికలను తీర్చే బోళా శంకరుడు అయిన పరమశివుడికి ఈ రోజు ప్రీతిపాత్రమైనది. ఈ మహా శివరాత్రి ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు జరుపుకుంటాము. ఈరోజు శివ భక్తులు అందరూ ఉపవాస దీక్ష చేపట్టి, జాగరణ చేస్తూ శివుడి కటాక్షం వారిపై ఉండాలని శివపూజలను చేస్తారు. అలాగే ఈ పర్వదినం కావడంతో ప్రతి శివాలయంలో ప్రతి ఒక్కరు అభిషేక ప్రియుడైన శివుడిని రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు పాలభిషేకాలతో హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నయి. ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్షతో మహాశివుడిని మనసులో లగ్నం చేసుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించి, జాగరణ చేసి స్వామి కటాక్షం కోసం భక్తులు ప్రయత్నం చేస్తారు.
కాగా పురాణాలు ప్రకారం మహాశివరాత్రికి సంబంధించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరంలో ఎవరు గొప్ప అన్న వాదన వచ్చినప్పుడు ఆ సమయంలో ఈశ్వరుడు లింగ రూపం ధరించాడని ఆది అంతాలను కనుకోవాలని బ్రహ్మ విష్ణువులకు చెప్పాడని దాంతో అది తెలుసుకోవడం కోసం మహా విష్ణువు శ్వేత వారాహరూపంలో మూలం కనుక్కోవడానికి వెళితే, బ్రహ్మ శివలింగానికి పైభాగం వైపు వెళ్తాడు. ఇద్దరూ మహా శివలింగానికి ఆదిఅంతాలను కనుక్కోలేకపోయారంట . ఆ సమయంలో బ్రహ్మకు కేతకి పుష్పం, గోవు దర్శనమీవగా, బ్రహ్మ తన శివలింగాన్ని కనుక్కున్నానని మొగలిపువ్వుకి, గోవుకు చెప్పి అదే విషయాన్ని విష్ణువు, శివుడితో చెప్పాలని చెబుతాడు. ఇక బ్రహ్మ చెప్పినట్టుగానే కేతకి పుష్పం, గోవు రెండు బ్రహ్మ శివలింగం యొక్క ఆధునికనుకున్నాడని విష్ణువు, శివునికి చెబుతారు. వారిద్దరూ అబద్ధం చెబుతున్నారని గుర్తించిన శివుడు అబద్ధం చెప్పించిన బ్రహ్మకు భూలోకంలో గుడి పూజలు ఉండవని శాపాన్ని ఇస్తాడు.
ఇక మొగలి పువ్వు పూజకు పనికిరానిదని, గోమాత ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పినందుకు గోమాత ముఖం చూస్తే పాపమని, తోక చూస్తే పాప పరిహారమని శివుడు శపిస్తాడు. శ్రీమహావిష్ణువు నిజం చెప్పడం వల్ల ఆయన విశ్వవ్యాప్తంగా అన్నిచోట్ల పూజింపబడతాడని శివుడు అనుగ్రహిస్తాడు. బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణకోటిని రక్షించే భారాన్ని, మోక్షం ఇచ్చే అధికారాన్ని కూడా మహావిష్ణువుకు ఇవ్వడం లింగోద్భవ కాలంలోనే జరిగిందని శివపురాణంలోనూ, కూర్మా వాయు పురాణాలలోనూ ప్రధానంగా చెప్పబడింది. అలాగే బ్రహ్మ కూడా శివుడికి లింగ రూపం లోనే ఉంటావని శాపాన్ని ఇవ్వడం వల్ల లింగ రూపంలోనే మహా శివుడికి పూజలు నిర్వహించడం జరుగుతుంది.
ఇది కూడా చదవండి: