Ratan Tata: ఒకప్పుడు వ్యాపారం చెయ్యడానికి పనికిరాడు అన్నారు.

Ratan Tata: టాటా ..ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. ఉప్పు నుండి ఉక్కు వరకు … టీ నుండి ట్రక్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా(TATA) పేరు వినబడుతుంది.

23 లక్షల కోట్ల రూపాయల విలువతో, సుమారుగా 8 లక్షల మంది ఉద్యోగులతో మన దేశం లోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానం లో నిలిచింది.

ఇంత పెద్ద కంపెనీ ని విజయవంతంగా నడిపిస్తున్న వ్యక్తి రతన్ టాటా.దేశంలోనే అతి పెద్ద కంపెనీలు అయినటువంటి రిలయన్స్(Reliance), ఆదిత్య బిర్లా(Aditya Birla), అడాగ్ (ADAG) ఈ మూడు కలిపినా కూడా వీటన్నిటి కన్నా టాటా గ్రూప్ పెద్దది.

కానీ అంత పెద్ద కంపెనీ అయినా కూడా ఏనాడూ అత్యంత ధనవంతుల జాబితాలో టాటా ఎందుకు లేరు? అలాగే సుమారుగా 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టాటా గ్రూప్ గురించి, దానిని నడిపించిన రతన్ టాటా గురించి ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..


టాటా కంపెనీ మొదట ఒక టెక్సటైల్ మిల్ గా ప్రారంభమైయింది. జంషెట్జి టాటా(Jamsetji Tata) అనే ఆయన దీనిని స్థాపించారు. అలా 1868 లో మొదలైన ఈ కంపెనీ తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది.

అసలు మన దేశం లో మొట్టమొదటి సారిగా ఎయిర్ లైన్స్ కంపెనీని స్టార్ట్ చేసింది టాటా లే. ఇప్పుడు ఎయిర్ ఇండియా గా చెప్పుకుంటున్న Airlines మొదట టాటా Airlines గా ఉండేది కానీ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అది ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది.

తిరిగి 2022 లో ఎయిర్ ఇండియా ని టాటా గ్రూప్ చేజిక్కించుకుంది.ఇదొక్కటే కాదు ఆసియా లోనే మొట్ట మొదటి స్టీల్ కంపెనీ , అలాగే మన దేశం లోనే మొట్ట మొదటి హోటల్ అయినటువంటి తాజ్ హోటల్ (Taj Hotel) ని స్థాపించింది కూడా టాటా లే.

ఇలా మన దేశానికి ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలను పరిచయం చేసారు. దేశ నిర్మాణంమరియు అభివృద్ధి లో టాటా ల పాత్ర ఎంత గానో ఉంది. వీళ్లందరిలో మనం ముఖ్యంగా చెప్పుకోవలసింది రతన్ టాటాగారి గురించి…


Ratan Tata December 28, 1937 సంవత్సరం లో దేశం లోనే అత్యంత ధనిక కుటుంబంలో జన్మించారు. ఈయనకి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి తండ్రులిద్దరు విడిపోవడం తో వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగారు.

తరువాత అమెరికాలోని Cornell University లో ఇంజినీరింగ్ పూర్తి చేసారు. వెంటనే IBM company లో ఉద్యోగం వచ్చింది .. కానీ JRD టాటా, రతన్ టాటా ని ఇండియా కి వచ్చి టాటా స్టీల్ లో చేరమని సలహా ఇవ్వడం తో అమెరికా నుండి ఇండియా కి వచ్చి జంషెడ్ పూర్ టాటా స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.


తరువాత 1991 లోJRD టాటా, Ratan Tata ని టాటా గ్రూప్ చైర్మన్ గా నియమించారు. అప్పట్లో చాలా మంది బోర్డు అఫ్ మెంబెర్స్ ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు.

ఎటువంటి అనుభవం లేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని పెట్టడాన్ని వ్యతిరేకించారు. కానీ వాళ్ళందిరి అభిప్రాయాలు తప్పని నిరూపించాడు రతన్ టాటా.

ఈయన హయాం లో టాటా గ్రూప్ పరుగులు తీసింది. 10000 కోట్ల రూపాయలుగా ఉండవలసిన వ్యాపారాన్ని 23 లక్షల కోట్లకు చేర్చాడు రతన్ టాటా.

మరి ఇంత పెద్ద కంపెనీని నడుపుతున్నప్పటికీ కూడా రతన్ టాటా భారత దేశంలో గాని ప్రపంచ ధనవంతుల జాబితాలో గాని ఏనాడూ కనిపించలేదు. ఎందుకో తెలుసా…

టాటా కంపెనీకి వచ్చే లాభాలలో 66% శాతం టాటా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న స్వచ్చంద సేవ సంస్థలకే వెళ్ళిపోతుంది. ఒకవేళ ఈ ఆస్తి అంతా సేవ సంస్థలకి కాకుండా రతన్ టాటా కి చెందినట్టయితే ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి ముగ్గురిలో రతన్ టాటా తప్పకుండా ఉండేవారు.Ratan Tata ఆయన ప్రయాణం లో ఎన్నో అవరోధాలను అవమానాలను ఎదుర్కొన్నారు.

దాంతో అందరూ టాటా ఇండికాను అమ్మెయ్యాలని సలహా ఇచ్చారు. దానికి టాటా కూడా ఒప్పుకుని .. ఇండికా కార్ల వ్యాపారాన్ని అమ్మడం కోసం అమెరికాలోని ఫోర్డ్ కంపెనీకి టాటా మరియు ఆయన టీం వెళ్లారు.

అయితే ఆ మీటింగ్ లో ఫోర్డ్ కంపెనీ చైర్మన్, రతన్ టాటా తో “మీకు కార్లు ఎలా తయారు చెయ్యాలో తెలియనప్పుడు కార్ల బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేసారు” అని టాటాను మరియు అయన టీం ని అవమానపరిచారు. దాంతో టాటా ఆ డీల్ మాట్లాడకుండానే తిరిగి ముంబై కి వచ్చేసారు.


కొన్ని సంవత్సరాల తరువాత టాటా ఇండికా నష్టాల నుండి లాభాల బాట పట్టింది. అదే సమయంలో ఫోర్డ్ కంపెనీ కి చెందిన లగ్జరీ కార్లు Jaguar-Land Rover కంపెనీలు భారీగా నష్టాల్లోకి వెళ్లిపోయాయి.

ఆ సమయంలో రతన్ టాటా ఫోర్డ్ కంపెనీ కి, Jaguar-Land Rover రెండు కంపెనీలను తాను కొంటానని ఆఫర్ చేసారు .ఈసారి ఫోర్డ్ కంపెనీ కి చెందిన టీం అమెరికా నుండి ముంబైకి చేరుకొని టాటా ను కలుసుకుంది.

అలా నష్టాల్లో ఉన్న Jaguar-Land Rover లను 9300 కోట్ల రూపాయలకు takeover చేసి ఆ రెండిటిని మళ్ళీ లాభాల బాట పట్టించాడు. ఈ విధంగా ఎవరైతే తనను అవమానించి తక్కువగా చూసారో వాల్లనే తన దగ్గరికి వచ్చేలా చేసుకున్నారు రతన్ టాటా.

ఇదొకటే కాదు యూరప్ కి చెందిన Corus అనే స్టీల్ కంపెనీ ని కొనుగోలు చేసాడు. అలాగే ఇంగ్లాండ్ కి చెందిన Tetly Tea కంపెనీ ని కొని టాటా టీ (TATA Tea) లో కలపడంతో ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద టీ కంపెనీ గా టాటా టీ ఎదిగింది.

ఒకప్పుడు ఏ బ్రిటిష్ వాళ్ళైతే మన భారతీయులను పరిపాలించారో ఇప్పుడు అదే బ్రిటిష్ వాళ్ళకు తన కింద ఉద్యోగులను ఇచ్చే స్థాయి కి ఎదిగారు. ఇవే కాదు ఇతర దేశాలకు చెందిన 22 కు పైగా అంతర్జాతీయ కంపెనీలను టాటా గ్రూప్ లో కలుపుకుని టాటా ని ఒక అంతర్జాతీయ బ్రాండ్ గా మార్చారు రతన్ టాటా.


టాటా లు ఎప్పుడూ ఇండియా ని ఒక ఎకనామిక్ సూపర్ పవర్ అవ్వాలని కోరుకోలేదు. భారత దేశం ఒక ఆనందకరమైన దేశం గా ఎదగాలని అనుకున్నారు. అందుకే వాళ్ళు పేద,మధ్య తరగతుల వాళ్ళ కోసమే ఎక్కువగా కృషి చేసారు.అందుకు ఉదాహరణే టాటా నానో . ఒక సారి Ratan Tata గారు తన కారులో ప్రయాణిస్తూ ఉండగా వర్షం లో ఒక స్కూటర్ మీద ఒక భర్త , భార్య ఇద్దరు పిల్లలు ఇబ్బంది పడుతూ ప్రయాణించడం చూశారట.

అంతే వెంటనే ఆయన పేద,మధ్య తరగతులకు అందుబాటులో ఉండేలా లక్ష రూపాయల్లో ఒక కారుని తయారు చెయ్యాలనుకున్నారు. ఈ మాట చెప్పగానే ఎంతో మంది నవ్వుకున్నారు. లక్ష రూపాయల్లో కారుని ఎలా తయారు చేస్తారు అని భయపెట్టారు. కొంత మంది వెటకారం చేసారు. కానీ టాటా మాత్రం వెనక్కి తగ్గలేదు.

ఇంజినీర్ల ను పిలిపించారు. కానీ వాళ్ళు లక్ష రూపాయల లో కారుని తయారు చెయ్యడం కుదరదని చెప్పారు. అయినా రతన్ టాటా వినలేదు. ధైర్యంగా ముందడుగు వేశారు. చివరకు ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు విడుదలైంది. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అయితే కొన్ని కారణాల వలన నానో కారు కొద్దిగా విఫలం అయ్యింది.

నానో కారు తయారుచెయ్యడం వల్ల వేల కోట్లలో నష్టాలు వస్తున్నప్పటికీ రతన్ టాటా వాటిని తయారుచెయ్యడం ఆపలేదు. ఎందుకంటే అది ఆయన కలల కారు. కారులో తిరగాలనే ప్రతి పేదవాడి కలను నిజం చేయడమే ఆయన కల.


రతన్ టాటా వ్యాపారవేత్తగా తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నానో కార్ల తయారీ కోసం పశ్చిమ బెంగాల్ లో ప్లాంట్ మొత్తం నిర్మాణం అయిపోయిన తరువాత అక్కడి ప్రజలు వ్యతిరేకించడంతో మొత్తం ప్లాంట్ అంతటిని పశ్చిమ బెంగాల్ నుండి గుజరాత్ కి తరలించడానికి చాలా ఇబ్బంది పడ్డారు.

అలాగే 2008 లో టాటా గ్రూప్ కి చెందిన తాజ్ హోటల్ పైన ఉగ్రవాదులు దాడి జరపడం.. ఇలా ఎన్నో కష్టాలను ధైర్యంగా తట్టుకున్నారు.మనకు తెలియని మరొక విషయం ఏమిటంటే రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. ఆయన అమెరికాలో ఉన్నప్ప్పుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు.

అయితే చదువు పూర్తైన తరువాత టాటా అమెరికా నుండి ఇండియా కి రావలసి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇండియా కి రావడానికి సిధ్ధ పడింది కానీ. అదే సమయంలో ఇండియాకి, చైనా కి యుద్ధం జరుగుతుండడంతో ఆ అమ్మాయి భయపడి ఇండియా కి రాలేదని అమెరికాలోనే వేరొకరిని పెళ్లి చేసుకుందని రతన్ టాటా ఒక టీవీ ఇంటర్వ్యూ లో చెప్పారు.

అందువల్ల ఆ తరువాత ఇక పెళ్లి గురించి ఆలోచించలేదట.సుమారుగా 84 ఏళ్ల వయసు వచ్చిన రతన్ టాటా లో చురుకుదనం ఏ మాత్రం తగ్గ లేదు. ఇప్పటికి కూడా గంటకు 2000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే Falcon విమానాలను, హెలికాఫ్టర్లు, సూపర్ ఫాస్ట్ కార్లని నడపడం ఈయనకు హాబీ.


రతన్ టాటాకు యువత మీద, వాళ్ళ శక్తి మీద మంచి నమ్మకం ఉంది. అందుకే Snapdeal, Paytm, Cardekho, Bluestone, Ola, Xiaomi , ఇలా 39 కి పైగా StartUp లలో పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించారు.సాధారణంగా వ్యాపారం అంటే లాభాలు, విస్తరణ, వారసత్వం ఇలా ఉంటుంది.

కానీ టాటా అలా కాదు టాటా గ్రూప్ ఎప్పుడు కూడా తన కుటుంబం కోసమో , వ్యక్తిగత ఆస్తులను కూడపెట్టడం కోసమో వ్యాపారం చెయ్యలేదు. కంపెనీకి వచ్చిన లాభాలలో 66% సమాజ సేవ కోసం ఖర్చు చేసే ఏకైక కంపెనీ ప్రపంచంలోనే టాటా గ్రూప్ ఒక్కటే. టాటా లు సంపాదిస్తున్న దాంట్లో చాల వరకు సమాజానికే వెచ్చిస్తున్నారు . అందుకే భారతీయులలో టాటా అంటే ఒక నమ్మకమైన బ్రాండ్ గా స్థిరపడిపోయింది


నిజాయితీ, నైతిక విలువలు అనేవి టాటా గ్రూప్ DNA లోనే ఉన్నాయి. అందుకు తాజ్ హోటల్ లో ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు అక్కడి ఉద్యోగులు చూపించిన తెగువే దానికి నిదర్శనం అంత భయంకరమైన పరిస్థిలో కూడా ఏ ఉద్యోగి కూడా తమ ప్రాణాలను లెక్క చెయ్యకుండా తమ హోటల్ లోని సుమారుగా 1500 మందికి పైగా అతిధులను కాపాడారు.

ఆ ప్రయత్నం లో భాగంగా ఏంతో మంది ఉద్యోగులు ప్రాణాలను సైతం కోల్పోయారు. దీనిని బట్టి టాటా గ్రూప్ విలువలకు ఎంత ప్రాధాన్యమిస్తుందో ప్రపంచానికి అర్ధమయ్యింది.అలాగే టాటా ట్రస్ట్ …. దేశం లోని మారుమూల ప్రాంతాలలోని పేద ప్రజలకు విద్య ,ఉద్యోగం, ఆరోగ్యాన్ని అందించే దిశగా కృషి చేస్తుంది.

ఇప్పటికి మన దేశం తో పాటుగా విదేశాలలో చదువుకుంటున్న ఎన్నో వేళ మంది భారతీయ విద్యార్థులకు టాటా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్ లు అందుతున్నాయి. అలాగే తాజ్ హోటల్ లో ఉగ్రవాదుల దాడిలో గాయపడిన చనిపోయిన కుటుంబాలకు Ratan Tata ప్రత్యేకంగా సేవలందించారు.

అంతే కాదు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ కి 300 కోట్ల రూపాయలు పైగా విరాళంగా ఇచ్చారు రతన్ టాటా. అందుకు గాను హార్వర్డ్ యూనివర్సిటీ తన క్యాంపస్ లో ఒక భవనానికి గౌరవంగా టాటా హాల్ అని పేరుని పెట్టింది. ఒక సంవత్సరం దీపావళి పండుగ కానుకగా కేన్సర్ పేషంట్ల కోసం ఏకంగా 1000 కోట్లను దానం చేసారు రతన్ టాటా .

ఈయన చేసిన ఎన్నో సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లతో సత్కరంచింది. ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు ఆయనను డాక్టరేట్లతో గౌరవించాయి. యావత్ పారిశ్రామిక ప్రపంచానికి ఆదర్శప్రాయుడైన రతన్ టాటా మన దేశానికి చెందిన వ్యక్తి కావటం మనం గర్వించదగిన విషయం.


ఒకప్పుడు వ్యాపారం చెయ్యడానికి పనికిరాడు అన్నారు .. కానీ ఇప్పుడు 10000 కోట్ల రూపాయల విలువైన సంస్దని తన నాయకత్వం లో 23 లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్యంగా మార్చారు రతన్ టాటా. ఇప్పుడు టాటా అడుగు పెట్టని రంగం అంటూ లేదు.

టాటా స్టీల్ (TATA Steel), టాటా మోటార్స్(Tata Motors), టాటా టీ ,TCS , కెమికల్స్ , టెలి సర్వీసెస్ , హోటల్స్ (Hotels), పవర్, ఎలక్ట్రానిక్స్ , ఇన్సూరెన్స్ ,ఇలా ఏకంగా 96 కి పైగా వ్యాపారాలను నడుపుతుంది ఈ సంస్థ. ఇంత పెద్ద పారిశ్రామిక వేత్త అయినప్పటికీ అయన లైఫ్ స్టైల్ చాల సింపుల్ గా ఉంటుంది.

మీడియాకి మీటింగ్ లకు దూరంగా ఉంటారు. కనీసం ఒక బిజినెస్ మాన్ కి ఉండవలసిన కనీస గర్వం, అహంకారం కూడా లేని వ్యక్తి రతన్ టాటా.వీటన్నిటికి మించి తరతరాల నుంచి టాటా అంటే విలువలు పాటించే ఒక బ్రాండ్ అనే నమ్మకాన్ని ఇప్పటికీ ప్రజల మనస్సులో నిలపటంలో 100 శాతం విజయాన్ని సాధించారు. డబ్బు పరంగా అయన గొప్ప ధనవంతుడు కాకపోవచ్చు. కానీ మంచితనం లో ఆయన అపరకుబేరుడు. అందుకే ఇప్పటికీ భారతీయులందరు ఇష్టపడే గౌరవించే బిజినెస్ మాన్ గా రతన్ టాటా నిలిచిపోయారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh