Rahul Gandhi Marriage: పెళ్లెప్పుడు చేసుకుంటావ్.. అని ప్రశ్నించారు
Rahul Gandhi Marriage: కాంగ్రెస్ అగ్ర నాయకుడు మోస్ట్ బ్యాచిలర్ రాహుల్ గాంధీ వద్ద బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చారు.
నిన్న (శుక్రవారం) బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల ఐక్యత సమావేశంలో భాగంగా ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్..
రాహుల్ గాంధీకి పెళ్లి చేసుకోవాలని సలహా ఇచ్చారు. రాహుల్ గాంధీ మీరు పెళ్లి చేసుకుంటే.. ఆ వేడుకలో తామంతా పాల్గొంటాం అని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు.
అయితే గతంలో కూడా తాను పెళ్లి చేసుకోవాలని సూచించినా.. రాహుల్ గాంధీ చేసుకోలేదు కానీ ఇప్పుడు అయిన ఒకసారి ఆలోచించమని ఆయన అన్నారు.
పెళ్లికి నువ్వు ఒప్పుకోకపోవటంతో మీ అమ్మ (సోనియా) టెన్షన్ పడుతోంది’ అని అన్నారు.
మా మాట విను.. పెళ్లి గురించి ఇప్పుడే స్పష్టత ఇవ్వు’ అని అన్నారు. పెళ్లి చేసుకోవాలని గతంలో తాను ఇచ్చిన సలహా పాటించి ఉంటే ఇప్పటికే రాహుల్ పెళ్లి చేసుకుని ఉండేవారని పేర్కొన్నారు.
పెళ్లిని ఇంకా ఆలస్యం చేయవద్దని రాహుల్ గాంధీకి సూచించారు. దీంతో ప్రతిపక్ష పార్టీల సమావేశానికి హాజరైన నాయకులందరూ నవ్వుకున్నారు.
దీనికి బదులుగా రాహుల్ కాస్తంత సిగ్గు పడుతూ ముసిముసి నవ్వులు నవ్వారు.
లాలూ మాటలకు సమాధానంగా 53 ఏళ్ల రాహుల్ గాంధీ నవ్వుతూ దీనికి బదులిచ్చారు.
మీరు చెప్పారు కాబట్టి అది జరుగుతుందని అన్నారు. అయితే ఇప్పటివరకు రాహుల్ పెళ్లి గురించి ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రశ్నలు వేశారు కానీ ఆయన ఎప్పుడూ ఓపెన్ అయ్యింది లేదు. కానీ మొదటిసారి సానుకూలంగా స్పందించారు.
అలాగే ఈ ఏడాది జనవరిలో భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
సరైన అమ్మాయి నచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని రాహుల్
చెప్పారు. అయితే ఎలాంటి అర్హతలు ఉండాలని ప్రశ్నించగా ప్రేమించే గుణం, తెలివైన అమ్మాయి అయితే చాలు అని అన్నారు. అలాగే గత ఏడాది డిసెంబర్లో కూడా ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన
ఇంటర్వ్యూలోనూ రాహుల్ గాంధీ తన పెళ్లి విషయాన్ని ప్రస్తావించారు. తన తల్లి సోనియా గాంధీ, నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీలకు ఉన్న లక్షణాలు కలిగిన భాగస్వామిని భార్యగా కోరుకుంటున్నట్లు రాహుల్ చెప్పారు.
#WATCH | "You didn't listen to my advice earlier. You should have married. It is not too late even today. You must get married," says RJD leader Lalu Yadav to Rahul Gandhi during opposition leaders' press meet in Patna pic.twitter.com/T4HomIpZo5
— ANI (@ANI) June 23, 2023