పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన భీమవరం యమ్.ల్.ఏ

grandhi rinivas ysrcp mla from bhimavaram

పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన భీమవరం యమ్.ల్.ఏ

2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఘోరంగా ఓడిపోయారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ చేతిలో 8,000కు పైగా ఓట్ల తేడాతో మట్టికరిచారు. ఆయన పరాజయాన్ని చవి చూసిన మరో నియోజకవర్గం- గాజువాక. పవన్ కల్యాణ్ ను ఓడించిన వైఎస్ఆర్పీసీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డికి సాధించిన మెజారిటీ- 14,000లకు పైమాటే

మళ్ళీ ఇప్పుడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొంటోన్నారు భీమవరం శాసన సభ్యుడు గ్రంధి శ్రీనివాస్.  వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తోన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆయనకు టికెట్ దక్కే అవకాశాలు లేకపోలేదు. పవన్ కల్యాణ్ ను ఓడించిన జెయింట్ కిల్లర్ గా పేరుతెచ్చుకున్నారు. దీనికి అనుగుణంగా ఆయన నియోజకవర్గంపై తన పట్టును నిలుపుకొంటోన్నారు.

ఈ నేపద్యం లో  జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై గ్రంధి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది కూడా పవన్ కల్యాణ్ తెలియని అయోమయం లో వున్నారు అని అవహేళన  చేశారు. ఒక్కోసారి ఒక్కో నియోజకవర్గం పేరు వినిపిస్తోందని అన్నారు. పవన్ కల్యాణ్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 1000 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వనున్నట్లు ఈ మధ్యే ఓ దినపత్రిక ప్రచురించగా.  దానిపై ఇప్పటివరకు స్పందించలేదని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్యాకేజీ గురించి ప్రస్తావిస్తే- ఆవేశంతో ఊగిపోయే పవన్ కల్యాణ్ ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నాడని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే ఆయన ముమ్మాటికీ ప్యాకేజీ స్టార్ అనేది తేలిపోతోందని అన్నారు. ప్యాకేజీలకు అమ్ముడుపోయే నాయకులు రాజకీయాలకు పనికి రారని గ్రంధి శ్రీనివాస్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేది కూడా పవన్ కల్యాణ్ కు తెలియట్లేదని గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు.

అసలు చంద్రబాబు చెబితే గానీ తన నియోజకవర్గాన్ని ఖరారు చేసుకునే స్థితిలో లేడని ఎద్దేవా చేశారు.  కాకినాడ రూరల్, భీమవరం, పిఠాపురం, కైకలూరు, తాడేపల్లిగూడెం.  ఇలా ఎన్నో నియోజకవర్గాల పేర్లు బయటికి వస్తోన్నాయని చెప్పారు. సింగిల్ గా పోటీ చేసే దమ్ము పవన్ కల్యాణ్ కు లేదని విమర్శించారు. భీమవరం, గాజువాక ఓటర్లు కొట్టిన దెబ్బకు పవన్ కల్యాణ్ వణికిపోతున్నాడని, సింగిల్ గా పోటీ చేయడానికి భయపడుతున్నాడని గ్రంధి శ్రీనివాస్ అన్నారు. సింగిల్ గా పోటీ చేయడం అంటే వీరమరణం పొందడమేనంటూ పవన్ కల్యాణ్ నేరుగా అంగీకరించాడని గుర్తు చేశారు. ఈ దెబ్బకు పవన్ కల్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా పోటీ చేయలేడని, చంద్రబాబు నాయుడు వద్దన్నా ఆయనతోనే పొత్తు పెట్టుకుంటాడని అన్నారు.

ఇది కూడా చదవండి:

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh