ప్రకృతికి అనుగుణంగా జీవనశైలిని అలవర్చుకోవాలి – భారత రాష్ట్రపతి
ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనస్సును పొందడానికి యోగా అవసరం, యోగాను భారతదేశం యొక్క పురాతన శాస్త్రం మరియు ఆధ్యాత్మిక అభ్యాసంగా ప్రశంసించారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆరోగ్యకరమైన మానవ సమాజాన్ని సృష్టించడమే యోగా యొక్క ముఖ్య లక్ష్యమని భువనేశ్వర్ లో జరిగిన జ్ఞానప్రభ మిషన్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. ఒడిశాకు చెందిన భారత రాష్ట్రపతి, రమాదేవి మహిళా విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, విద్యార్థిగా ఈ విశ్వవిద్యాలయంలో (అప్పటి కళాశాల) గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు. భువనేశ్వర్ లోని యూనిట్ -2 బాలికల పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత నాలుగేళ్లు ఈ సంస్థలోనే చదువుకున్నానని, ఆనాటి ఉపాధ్యాయుల ప్రేమ, ఆప్యాయతలు మరువలేనివని కొనియాడారు. అప్పటి నుంచి తన క్లాస్ మేట్స్ తో ఇప్పటికీ టచ్ లో ఉన్నానని చెప్పింది.
అలాగే యోగా గురించి, ప్రకృతి గురించి మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవితానికి చికిత్స కంటే నివారణ మంచి మార్గం అని, మనం ‘యోగ-యుక్త్’ (యోగాతో సంబంధం కలిగి) ఉంటే, మనం ‘రోగ్-ముక్త్’ (రోగాలు లేకుండా) ఉండగలము అన్నారు. యోగా ద్వారా ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనస్సును పొందవచ్చు అని తెలిపారు. అలాగే నేటి ప్రపంచంలో భౌతికవాద ఆనందం అనేది అందనంత దూరంలో లేదని, కానీ మన శాంతి చాలా మందికి అందుబాటులో లేదని వారు మనశాంతి పొందాలంటే యోగా ఒక్కటే మార్గమని ఈ సందర్భంగా రాష్ట్రపతి అన్నారు. భూమి వనరులు పరిమితం, కానీ మానవుల కోరికలు అపరిమితమైనవి. ప్రస్తుత ప్రపంచం ప్రకృతి యొక్క అసాధారణ ప్రవర్తనను చూస్తోందని, ఇది వాతావరణ మార్పు మరియు భూమి ఉష్ణోగ్రత పెరుగుదలలో ప్రతిబింబిస్తుంది” అని ముర్ము అన్నారు. తర్వాత తరానికి సురక్షితమైన భవిష్యత్తును ప్రకృతి స్నేహపూర్వక జీవనశైలి అవసరమని నొక్కి చెప్పారు ముర్ము. భారతీయ సంప్రదాయంలో విశ్వం ఒక్కటే, సమగ్రమైనది, మానవులు ఈ విశ్వంలో ఒక చిన్న భాగం మాత్రమే. సైన్సులో మనం ఎంత పురోగతి సాధించినా మనం ప్రకృతికి యజమాని కాదు, దాని బిడ్డలం. ప్రకృతికి కృతజ్ఞతగా ఉండాలి అని ఈ సందర్భంగా తెలిపారు. ప్రకృతికి అనుగుణంగా జీవనశైలిని అలవర్చుకోవాలి’ అని ముర్ము అన్నారు.
ఇది కూడా చదవండి: