Power Star: కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో
Power Star: జనసేనాని పవన్ కల్యాణ్ బీజేపీతో కొనసాగుతారా. కటీఫ్ చెప్పి టీడీపీతో కలుస్తారా. త్వరలోనే ఈ విషయం తేలిపోనుంది. వైసీపీని ఓడించటమే లక్ష్యంగా పని చేస్తున్నామని తమ రెండు పార్టీలతో పాటుగా టీడీపీని కలుపుకు వెళ్తామని బీజేపీ ముఖ్య నేతల ముందు ప్రస్తావించారు. ప్రస్తుతం పార్టీ ఫోకస్ అంతా కర్ణాటక మీద ఉందని, అక్కడ ఎన్నికలు పూర్తయిన తరువాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపైన నిర్ణయాలు ఉంటాయని బీజేపీ ముఖ్య నేతలు చెప్పినట్లు సమాచారం.
జనసేన అధినేత Power Star కర్ణాటకలో బీజేపీ తరపున ప్రచారం చేస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. పవన్ ఇటీవలి ఢిల్లీ పర్యటనలో ఈ మేరకు అంగీకారం తెలిపారని సమన్వయం చేసుకునే బాధ్యతను ఎంపీ, బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు తేజస్వి సూర్యకు అప్పగించారని అనుకున్నారు. అయితే నామినేషన్ల గడువు ముగిసినా పవన్ కల్యాణ్ ప్రచారం గురించి క్లారిటీ రాలేదు. తేజస్వి సూర్య సంప్రదిస్తున్నా Power Star స్పందించడం లేదని చెబుతున్నారు. బీజేపీ కి ప్రచారం చేసే విషయంలో పవన్ కల్యాణ్ ఆసక్తిగా లేరని బీజేపీ వర్గాలు వెల్లడించాయి .
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం పై ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. అదే సమయంలో వ్యతిరేకత కూడా ఎక్కునగానే ఉందన్న ప్రచారం జరుగుతోంది. సర్వేలన్నింటిలోనూ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందన్న అంచనాలు వస్తున్నాయి. దీంతో Power Star బీజేపీకి ప్రచారం చేసే విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదని చెబుతున్నారు. గతంలో కూడా పవన్ బీజేపీకి ప్రచారం చేయలేదు. కర్ణాటకలో పవన్ కల్యాణ్ కు పెద్ద ఎత్తు న ఫాలోయింగ్ ఉంది. ఆయన ప్రచారానికి వస్తే జనం విపరీతంగా వస్తారు. ఆయన స్పీచ్‌లు తెలుగు ఓటర్ల మీద ప్రభావం చూపిస్తాయి. కర్ణాటకలో స్థిరపడిన తెలుగు ఓటర్లను ఆకట్టుకోవాలంటే పవన్ లాంటి స్టార్ అవసరం అని గట్టిగా నమ్ముతున్నారు. కానీ పవన్ మాత్రం ఆసక్తి చూపించడం లేదు.
ఇప్పుడు 2024లో ఏపీలో 2014 తరహా పొత్తులతో ముందుకు వెళ్లాలని భావిస్తున్న పవన్..బీజేపీ నేతలను దగ్గర చేసుకొని తన వ్యూహం అమలు చేయటానికి ప్రచారంలో పాల్గొంటారా , లేక ఇప్పటి లాగానే దూరంగా ఉంటారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీ నిర్ణయాలకు అనుగుణంగానే పవన్ 2024 ఎన్నికల్లో తన వైఖరిపైన నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.