Pawan Kalyan: ఫిధా అయ్యిన పవన్ ఫాన్స్

Pawan Kalyan

Pawan Kalyan: ఫిధా అయ్యిన పవన్ ఫాన్స్

Pawan Kalyan: ఒక వైపు  రాజకీయం మరోక వైపు సినిమాలతో ఫుల్ బిజీగా వున్నా పవన్  కళ్యాణ్  గారు ఇప్పుడు  వరుస షూట్స్ లో పాల్గొంటున్నారు. 2024 ఎలక్షన్స్(Elections) కి ఫుల్ ఫోకస్ చేయాలని ఈ లోపే 2023 చివరికల్లా చేతిలో ఉన్న సినిమాలు షూటింగ్స్ పూర్తవ్వాలని వరుసగా డేట్స్ ఇస్తూ సినిమా షూట్స్ పూర్తి చేసేస్తున్నాడు పవన్. ఇప్పటికే వినోదయ సితంసినిమా రీమేక్ షూట్ పూర్తి చేసేసిన పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసేసారు. ఇక సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ హైప్ ఉన్న సినిమా OG కూడా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసేశారు.

అయితే ‘గబ్బర్ సింగ్’ వంటి భారీ హిట్ తర్వాత పవన్ కల్యాణ్ – హరీష్ శంకర్ కలయికలో వస్తున్న సినిమానే ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను ఇటీవలే మొదలు పెట్టారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను జరిపారు. అలాగే మిగిలిన షెడ్యూళ్లను కూడా పక్కా ప్లాన్‌తో చేసుకుంటూ ముందుకు వెళ్లాలనుకుంటోన్నారు. ఈ గ్యాప్‌లో ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు చిత్ర యూనిట్ అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు రెడీ చేస్తోంది.

Also Watch

Minister KTR: సామాన్యునిగా క్యూలో నిల్చున్న కేటీఆర్‌

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ ని నేడు సాయంత్రం 4.59 కి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో అభిమానులు ఈ గ్లింప్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ ని మరింత జోష్ లో నింపడానికి తాజాగా సర్ ప్రైజ్ చేస్తూ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఫస్ట్ లుక్ లో పవన్ స్టైలిష్ గా నించొని ఉన్నాడు. పోలీసులు అడ్డం పెట్టే బ్యారికేడ్ కు ఆనుకొని ఉన్నాడు. వెనకాల కొంతమంది మనుషులు నించొని ఉన్నారు. ఫోటో చూస్తుంటే ఏదో ఫైట్ సీన్ కి సంబంధించిందని అర్ధమవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ ఈ పోస్టర్ ని వైరల్ చేస్తున్నారు.

ఈ మూవీ లో  శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ‘తేరీ’ మూవీకి రీమేక్‌గా రూపొందుతోంది. ఇందులో అశుతోష్ రాణా, గౌతమి, నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, గిరి, టెంపర్ వంశీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ వంటి వాళ్లు నటిస్తున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh