Minister KTR: సామాన్యునిగా క్యూలో నిల్చున్న కేటీఆర్‌

Minister KTR

Minister KTR: సామాన్యునిగా క్యూలో నిల్చున్న కేటీఆర్‌

Minister KTR: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ యూకే పర్యటనకు వెళ్లారు. ఇవాళ వేకుమజామున శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి యూకేకు వెళ్లారు. తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను తీసుకురావాలనే లక్ష్యంతో యూకే పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నెల 13వ తేదీ వరకు కేటీఆర్ యూకేలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా యూకేలోని పారిశ్రామిక దిగ్గజ సంస్థలతో పాటు వ్యాపార, వాణిజ్య సంఘాలతో సమావేశం కానున్నారు.

ఈ పర్యటనలో భాగంగా యూకేలోని పారిశ్రామిక దిగ్గజాలతో పాటు వ్యాపార, వాణిజ్య సంఘాలతో సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కంపెనీల ప్రతినిధులు వివరిస్తారు. యూకేకు వెళ్లేందుకు ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేటీఆర్ వచ్చారు. ఈ సందర్భంగా నిరాడంబరత ప్రదర్శించారు. చెకింగ్ సమయంలో సామాన్యునిగా క్యూలైన్‌లో నిలబడ్డారు. సాధారణ ప్రయాణికులతో కలిసి క్యూలో నిలబడి చెకింగ్ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. చెకింగ్ పూర్తయిన అనంతరం ఎయిర్‌పోర్ట్‌ లోపలికి కేటీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు ప్రయాణికులు పోటీ పడ్డారు.

Also Watch

Tatikonda Aishwarya: హైదరాబాద్ కు చేరుకున్న మృతదేహం..

తమతో పాటు క్యూలో నిల్చున్న కేటీఆర్‌ను ప్రయాణికులు ఆసక్తిగా వీక్షించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కేటీఆర్ వెంట పలువురు సిబ్బంది ఉన్నారు. ఈ వీడియోని కేటీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వరస పెట్టని సామాన్యుడు అంటూ పోస్టులు పెడుతున్నారు.

కేటీఆర్ రాష్ట్ర మంత్రి కావడంతో ఎయిర్‌పోర్టులో ప్రొటోకాల్ ఉంటుంది. వీఐపీ ప్రొటోకాల్ ప్రకారం కేటీఆర్‌ను సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేక ప్రవేశ ద్వారం గుండా లోపలికి అనుమతిస్తారు. కానీ కేటీఆర్ ప్రొటోకాల్ ఉపయోగించుకోకుండా సాధారణ ప్రయాణికులతో కలిసి క్యూలో నిల్చొని లోపలికి వెళ్లారు. కాగా గత ఏడాది మే 18 నుంచి 22వ తేదీ వరకు లండన్‌లో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా కంపెనీల ప్రతినిథులతో చర్చలు జరిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని వారికి సూచించారు. కేటీఆర్ సూచనతో పలు కంపెనీలు తెలంగాణలో పెట్టబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh