Pathan : అశ్లీలం, మితిమీరిన హింస @ రోజుకు లాభం 100 కోట్లు
Pathan : బొమ్మ ఏదైనా సరే ఎవరిదైనా సరే అందులో అశ్లీలం, హింస వుంటే మాత్రం మా ఆదరణ ఇలానే వుంటుంది అంటున్నారు మన భారతీయ యువ ప్రేక్షకులు.
ఎందుకంటే పాశ్చాత్య పోకడలతో అల్లాడుతున్న నేటి యువత సినిమా కథతో సంబంధం లేకుండా మూడు అశ్లీల సీన్లు ఆరు హింసాత్మక దృశ్యాలతో ఏ సినిమానైనా లాభాల పంట పండిస్తున్నారు నేటి సినీ ప్రేక్షకులు.
నేటి యువతకు ఈ పాశ్చాత్య సంస్కృతిని అలవాటు చేస్తుంది ఈనాటి సినిమా. మితిమీరిన హింస, విచ్చలవిడితనం, జుగుప్సాకర సన్నివేశాలతో యువతలో వున్న భావావేశాలను లాభసాటిగా వ్యాపారం చేసుకుంటున్న రంగం నేటి సినిమా.
పైన చెప్పిన అంశాలన్ని కలుపుకుని వివాదాల నడుమ ఈ మధ్యనే విడుదలైన సినిమా ‘పఠాన్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా హిందీ సినిమా చరిత్రలోనే ఓ రికార్డు సృష్టించింది. విడుదలైన మొదటిరోజే 100 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది.
ఇటీవల వరుస ఫ్లాపులతో అల్లాడుతున్న హిందీ సినిమా రంగానికి పఠాన్ ఓ ఆయువు పట్టు అని చెప్పొచ్చు. కథాపరంగా విషయం లేని ఈ సినిమా లో అశ్లీల సన్నివేశాలు, హింసాత్మక పోరాట పోకడలు పుష్కలంగా వున్నాయి.
ఓ పక్క దక్షిణాది సినిమా RRR ఆస్కార్ రేసు లో నిలబడిన తరుణంలో ఉత్తరాది సినిమా అయిన ఈ పఠాన్ లాభాల పంటలో నడవడం విశేష విడ్డూరం. ఏది ఏమైనా మన దేశంలో సినీ ప్రేక్షకులు అశ్లీలం, హింస కు ఒక్కరోజులో వందకోట్లు ఇస్తారంటే రాబోయే సినిమాలకు క్రియేటివిటీ అక్కరలేదు, కేవలం పైన చెప్పిన రెండు వుంటే చాలు లాభాలపంటే.. దర్ళకులూ ఇక మీ క్రియేటివిటీని తాకట్టు పెట్టి ఈ విషయాల మీద ఆలోచించండి నిర్మాతలు మీకు ఎర్రతివాచీ పరుస్తారు.