వివేకా హత్య కేసు: మార్చి 10 విచారణకు హాజరుకావాల్సిందిగా అవినాష్ రెడ్డి కి సీబీఐ నోటీసులు

once again time to enquire avinash reddy cbi in viveka murder case

వివేకా హత్య కేసు: కడప ఎంపీ కి మరోసారి నోటీసులు జారీ చేసిన సీబీఐ

తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన వివేకానందరెడ్డి హత్య ఈ కేసులో సీబీఐ విచారణ తుది దశకు చేరుకుందా ఇక అరెస్ట్ ల పర్వం ప్రారంభంకానుందా? సునిల్ యాదవ్ బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ తో ఈ కేసులో స్పష్టత వచ్చిందా? కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి విచారణకు పిలవడం దేనికి సంకేతం వివేకా హత్య కేసు ఏపీ నుంచి తెలంగాణకు మారిన తరువాత విచారణలో వేగం పెరిగింది. నిందితులు, అనుమానితుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. అయితే కీలక వ్యక్తుల ను వరుసగా విచారణకు పిలుస్తుండడంతో అరెస్టలు కూడా స్టార్ట్ కానున్నాయని ప్రచారం మొదలైంది.

ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు రెండుసార్లు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆయన వెల్లడించిన కొన్ని విషయాలను బట్టి కేసులో కొంతవరకూ పురోగతి సాధించారు. జగన్ ఓఎస్డీ, ఆయన సతీమణి భారతి వ్యక్తిగత సహాయకుడు నవీన్ తదితరుల పాత్రపై విచారణ చేపట్టారు. వారికి కూడా నోటీసులిచ్చి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే తనకు మరోసారి విచారణకు పిలిచే చాన్స్ లేదని అవినాష్ రెడ్డి చెబుతున్న తరుణంలో సడెన్ గా సీబీఐ అధికారులు పులివెందుల చేరుకున్నారు.

ఈ క్రమంలోనే తొలుత సోమవారం(మార్చి 6)వ తేదీన విచారణకు రావాల్సిందిగా అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు అందజేశారు. అయితే ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్స్ ఉండటంతో సోమవారం విచారణకు హాజరుకాలేనని అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు సమాచారం అందించారు. అయితే ఖచ్చితంగా  ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతానికి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తుది దశకు చేరుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏపీ పరిధిలో విచారణ సాగినప్పుడు తమకు నచ్చినట్టు దర్యాప్తు సాగాలని అధికారులపై ఒత్తిడి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది  అయితే తెలంగాణకు మారిన తరువాత కేసు విచారణలో పురోగతి కనిపించింది. తాజాగా కడప సెంట్రల్ జైల్ లోని కొంతమంది నిందితులను సీబీఐ అధికారులు విచారించారు. వైఎస్ భారతి వ్యక్తిగత సహాయకుడు నవీన్ మరోసారి విచారణ చేపట్టనున్నట్టు ఆయన లాయర్ కు ఇప్పటికే సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డికి సీబీఐ నుంచి పిలుపు రావడం సంచలనానికి కారణమవుతోంది.

ఇంకొక వైపు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డికి నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఆయనను  కడపలోనే విచారించనున్నారు. అయితే సునీల్ యాదవ్ బెయిల్ పై సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ తో దాదాపు కేసులో ఒక స్పష్టత వచ్చింది. చేసిందెవరు? చేయించిందెవరు? అన్న విషయాలను సీబీఐ స్పష్టం చేసింది. కూడా అప్పటి నుంచి కీలక వ్యక్తులకు నోటీసులిచ్చిన ప్రతీసారి అరెస్టులంటూ హడావుడి నడుస్తోంది.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh