NTR ఆర్‌ఆర్‌ఆర్ ఆస్కార్ విషయంలో రాజమౌళి హీరో అవుతాడా..జీరో అవుతాడా?
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి ఆరు నెలల క్రితం వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు 1200 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదయ్యాయి. కలెక్షన్స్ కంటే ఎక్కువగా ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్ అవుతూ ప్రపంచ వ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మీడియాలో ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ దక్కడం ఖాయం అంటూ పలువురు ప్రముఖులు వ్యాఖ్యలు చేశారు. దాంతో ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఆస్కార్ పై చాలా నమ్మకం పెట్టుకున్నారు. కానీ భారత్ తరపున అధికారికంగా ఆస్కార్ కి ఈ సినిమాను పంపించేందుకు అర్హత లేదు అంటూ భారత ఫిలిం అకాడమీ సంచలన నిర్ణయం తీసుకొని ఈ చిత్ర యూనిట్ సభ్యులకు నిరాశ మిగిల్చిన విషయం తెలిసిందే.
ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న రాజమౌళి టీం ఇప్పుడు ఆస్కార్ రేసులో నిలిచేందుకు జనరల్ కేటగిరీలో దరఖాస్తు చేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు. దేశం తరఫున అధికారికంగా కాకుండా ఇండిపెండెంట్ కేటగిరీలో ఆస్కార్ కోసం ఈ చిత్రం ఏకంగా 14 కేటగిరీల్లో నామినేషన్ కోసం దరఖాస్తు చేసింది. అందులో రెండు మూడు నామినేషన్స్ దక్కిన కూడా చాలా పెద్ద గౌరవం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
అవార్డు దక్కడం సంగతి ఏమో కానీ కనీసం నామినేషన్స్ దక్కితే రాజమౌళి పరువు దక్కినట్లే.. ఎందుకంటే భారత తరఫున అధికారికంగా ప్రకటించకుంటే ప్రైవేట్ గా ఆస్కార్ కి నామినేషన్ కోసం దరఖాస్తు చేశారు.ఒకవేళ ఆస్కార్ నామినేషన్ దక్కక పోతే కచ్చితంగా ఇండియన్ ఫిల్మ్ చరిత్రలో రాజమౌళి యొక్క వ్యతిరేక తీరు గురించి నిలిచి పోతుంది. భారత తరఫున అధికారికంగా పంపించకున్నా కూడా నామినేషన్స్ ప్రైవేట్ గా అప్లై చేసి దక్కించుకొని అవార్డు సొంతం చేసుకుంటే ఆ విషయం కూడా ఇండియన్ సినీ చరిత్రలో చిర స్థాయిగా నిలిచి పోతుంది అనడంలో సందేహం లేదు. ఈ రెండిట్లో ఏది జరుగుతుంది అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ఒకవేళ జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్స్ లో నామినేషన్స్ దక్కించుకుంటే హీరో అవుతాడు లేదంటే అనవసరంగా ప్రయత్నించి జీరో అవుతాడు. మరి మన జక్కన్న ఇన్నాళ్లు హీరోగా నిలిచాడు, హీరోల కంటే కూడా ఎక్కువ ప్రాముఖ్యతను దక్కించుకున్నాడు. మరి ఈ విషయంలో హీరో అవుతాడా జీరో అవుతాడా అనేది చూడాలి.
ఆర్ఆర్ఆర్” ప్రొడ్యూసర్ తో బాలయ్య భారీ చిత్రం.. డైరెక్టర్?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళితో కలిసి “RRR” వంటి గొప్ప చిత్రాన్ని తీసినందుకు, నిర్మాత డివివి దానయ్య కూడా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే అంతటి విజయాన్ని అందుకున్న ఈ నిర్మాత ఇప్పటి వరకు తన తదుపరి సినిమా ప్రకటించలేదు. అయితే ఈ నిర్మాత త్వరలో మళ్ళీ ఒక క్రేజీ కాంబినేషన్ తో రాబోతున్నట్లు తెలుస్తుంది.గతంలో దానయ్య రామ్ చరణ్‌తో ఒక సినిమా అనౌన్స్ చేస్తాడని వార్తలు వినిపించిన, వాటిలో నిజం లేదని తెలిసిపోయింది. కాగా ఈ నిర్మాత ఇప్పుడు నందమూరి నటసింహం బాలయ్యతో చేతులు కలపబోతున్నాడట.
బాలయ్య హీరోగా ఒక యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కించడానికి ఈ ప్రొడ్యూసర్ సన్నాహాలు చేస్తున్నాడట.ప్రముఖ ఓటిటి సమస్త ఆహాలో ప్రసారమవుతున్న “అన్‌స్టాపబుల్” టాక్ షో ప్రమోషన్స్ కోసం జత కట్టిన బాలయ్య, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ కోసం చేతులు కలపనున్నారట. డైరెక్టర్ ప్రశాంత్ ఇప్పటికే బాలకృష్ణకు కథ కూడా వినిపించినట్లు, బాలయ్య కూడా ఓకే చెప్పినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే, అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
రామ్ చరణ్ ను మోసం చేసిన శంకర్..? సీరియస్ వార్నింగ్ ఇచ్చి మెగాస్టార్ చిరంజీవి..?
స్టార్ డైరెక్టర్ శంకర్ తో మెగా ఫ్యామిలీకి మధ్య గ్యాప్ వస్తోందా..? శంకర్ చేసిన ఈ పొరపాటు మెగాస్టార్ కు సైతం కొపం తెప్పించిందా..? ఇంకీ శంకర్ చేసిన పొరపాటు ఏంటి..? ఇందులో నిజమెంతా..?
ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ హాట్ టాపిక్ నడుస్తోంది. ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి.. స్టార్ డైరెక్టర్ శంకర్ ను చెడా మాడా తిట్టేశారని..ఇలా ఎందుకు చేశారంటూ గట్టినా నిలదీశారట.ఇంతకీ అంతపెద్ద తప్పు శంకర్ ఏం చేశాడు..? ఎందుకు చేశాడు..? అయినా ఇదంతా నిజమేనా..? చరణ్ ను దాటుకుని మెగాస్టార్ దాకా మేటర్ ఎందుకు వెళ్లింది. ఈ మధ్య దర్శకులు రెండు పడవల ప్రయాణం చేయాలని చేస్తూన్నారు.
ఒక ప్రాజెక్ట్ లైన్ లో ఉండగానే వేరొకటి స్టార్ట్ చేస్తున్నారు. ఏదో ఒక దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే నిర్లక్ష్యం చేసింది ఏ చిన్న సినిమానో అయితే పెద్దగా పట్టింపు ఉండదు. వారి బాధలను అడిగేవారే ఉండరు.. కాని ఒక స్టార్ హీరో సినిమాను పక్కన పెట్టి.. మరో భారీ సినిమాను పూర్తి చేయడానికి చూస్తే.. ఊరుకోరుకదా..? శంకర్ ప్రస్తుతం ఆ ప్రాబ్లమ్ నే ఫేస్ చేస్తేన్నట్టు తెలుస్తోంది.
శంకర్ పేరు చెప్తే అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలే వినిపించేవి. కానీ రాను రాను ఆయన ట్రాక్ రికార్డు తగ్గుతూ వచ్చింది . కెరియర్ గ్రాఫ్ పడిపోతూ ఉంది. ఇక ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసిన భారతీయుడు2 సినిమా కూడా స్టార్టింగ్ లోనే ఆగిపోయింది. దాంతో ఆయనకు తెలుగులో వచ్చి బంపర్ ఆఫర్ ను వినియోగిచుకున్నాడు. రామ్ చరణ్ తో పాన్ ఇండియా మూవీ స్టార్ట్ చేశాడు. దాదాపు 60 శాతం షూటింగ్ కూడా పూర్తి చేశాడు శంకర్. ఇక ఈలోపు వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు2 షూటింగ్ కు మళ్లీ గ్రీన్ సిగ్నల్ రావడంతో.. శంకర్ అటు వైపుగా మళ్ళాడట. ఈ సినిమా మరో రెండు నెలల్లో పూర్తి అయిపోతుంది అనుకున్న టైమ్ లో … డైరెక్టర్ శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భారతీయుడు2 కోసం ఈ సినిమను నెగ్లెట్ చేస్తేున్నట్టు తెలుస్తోంది.
చిత్ర యూనిట్‌కు లీగల్ నోటీసులు…
ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ఆదిపురుష్ . కృతి సనన్ , సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఈ మూవీని నిర్మించారు. రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టారు. అయోధ్యలో అక్టోబర్ 2న టీజర్‌ను విడుదల చేశారు.
టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాను వివాదాలు చట్టుముడుతూనే ఉన్నాయి. రాముడి, రావణాసురుడి పాత్రలను అపహాస్యం చేసేలా చిత్రాన్ని రూపొందించారని నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. అయోధ్య రామాలయం పూజారి కూడా సినిమా విడుదల కాకుండా చూడాలన్నారు. వివాదాలు కొనసాగుతుండగానే తాజాగా ఢిల్లీ హై కోర్టు చిత్ర యూనిట్‌కు షాకిచ్చింది. ఈ సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. చిత్ర బృందంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది ఆశిష్ రాయ్ పిటిషన్ దాఖలు చేశారు. చిత్ర నిర్మాత భూషణ్ కుమార్, ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్‌లకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మూవీ విడుదల కాకుండా చూడాలని కోరారు. దీంతో ఢిల్లీ హైకోర్టు మూవీ యూనిట్‌కు నోటీసులు పంపించింది.