shubaman Gill ఫైనల్ వన్డేలో టీమిండియా ఘన విజయం…కాని అది ఒక్కటే బాధ.

shubaman Gill ఫైనల్ వన్డేలో టీమిండియా ఘన విజయం…కాని అది ఒక్కటే బాధ.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియా దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా 19.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. దక్షిణాఫ్రికా జట్టు నిర్దేశించిన 100 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు అలవోకగా చేధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది.

టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు పరుగులు సాధించడంలో ఘోరంగా విఫలమైంది. దక్షిణాఫ్రికా ఓపెనర్లు మలాన్, క్వింటన్ డి కాక్ పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు.మలాన్ 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సిరాజ్ బౌలింగ్‌లో ఔట్ కాగా, డి కాక్ 6 పరుగులకే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అవీష్ ఖాన్‌కు క్యాచ్‌గా చిక్కి వెనుదిరిగాడు. హెండ్రిక్స్ కూడా 3 పరుగులకే సిరాజ్ బౌలింగ్‌లో స్లిప్‌లో ఉన్న రవి బిష్ణోయికి క్యాచ్‌గా దొరికిపోయాడు. మర్క్రమ్ 9 పరుగులకే కీపర్ క్యాచ్‌గా సంజూ శాంసన్‌కు క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. క్లాసెన్ 34 పరుగులతో పర్వాలేదనిపించినా షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కావడంతో సఫారీ జట్టు అభిమానులు నిరాశకు లోనయ్యారు. మిల్లర్ కూడా 7 పరుగులకే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఫెహ్లుక్వాయో 5, మార్కో జాన్సెన్ 14 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్ విభాగం ఘోరంగా విఫలం కావడంతో 99 పరుగులకే ఆలౌట్ అయింది.వంద పరుగుల లక్ష్య సాధనకు బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్ ధావన్ వికెట్‌ను 42 పరుగుల స్కోర్ వద్ద కోల్పోయింది. 8 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధావన్ రనౌట్‌గా వెనుదిరగాల్సొచ్చింది. ధావన్ ఔట్ కావడంతో క్రీజులోకొచ్చిన ఇషాన్ కిషన్ కూడా 10 పరుగులకే కీపర్ క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. అయితే.. మరో ఓపెనర్ శుభ్‌మన్ 49 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. శ్రేయాస్ అయ్యర్ (22), సంజూ శాంసన్ (4) పరుగులు చేసి మ్యాచ్‌ను గెలుపుతో ముగించారు.

టీమిండియా బౌలర్లలో కుల్దీప్‌ 4 వికెట్లతో సత్తా చాటగా, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, షాబాద్ అహ్మద్ తలో రెండు వికెట్లతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగీ ఎంగ్డీకి ఒక వికెట్, ఫోర్టాన్‌కు చెరో వికెట్ దక్కింది. ధావన్ రనౌట్‌తో కలిపి టీమిండియా మూడు వికెట్లను కోల్పోయింది. ఈ మ్యాచ్ మొత్తం మీద టీమిండియా ఫ్యాన్స్‌‌కు కాస్త నిరాశ కలిగించిన విషయం ఏమైనా ఉందంటే.. 49 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గిల్ ఔట్ కావడమే. మ్యాచ్ అనంతరం గిల్ కూడా కొంచెం బాధగా అనిపించిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

23ఏళ్ల కుర్రాడిలా సచిన్ క్లాస్ బ్యాటింగ్..

Click Here

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh