టాలీవుడ్ యంగ్ టైగెర్ ఎన్టీఆర్ తన అభిమానులతో ఓ చిత్రాన్ని పంచుకున్నారు. ఎన్టీఆర్ రాజమౌళి తీసిన RRR లో నటించిన పాత్రతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇకపై రాబోయే సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కొమరం బీమ్ గా ఎన్టీఆర్ నటనకు మంచి ఆదరణ లభించడంతో ఆయన తర్వాత ఏం చేస్తాడోనని జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా తారక్ ఫ్యామిలీ వెకేషన్‌తో అమెరికా లోని మియామీ బీచ్‌కి వెళ్లారు. అతను తన భార్య ప్రణతితో చాలా సరదాగా గడిపాడు. ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసాడు. ఆ ఫోటోలో, అతను ఆమెను ఏంటో ప్రేమగా కౌగిలించుకున్నట్లు కనిపించాడు. ఈ ఫోటో ఇప్పుడు చాలా వైరల్ గా మారింది.
ఎన్టీఆర్, కొరటాల శివల సినిమా వచ్చే ఏడాది విడుదల కానుందని అంటున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.ఇది నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.