అవే మా ఓటమికి ప్రధాన కారణాలు : రోహిత్‌ శర్మ

IND vs AUS: అవే మా ఓటమికి ప్రధాన కారణాలు : రోహిత్‌ శర్మ

విశాఖపట్నం వేదికగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత్ జట్టుని ఓడించేసింది ఆస్ట్రేలియా. 10 వికెట్ల తేడాతో అలవోకగా భారత్ జట్టుపై ఆస్ట్రేలియా పై చేయి సందించింది.    కాగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు 26 ఓవర్లలో 117 పరుగులకే అందరూ అల్అవుట్ అయ్యారు. ఆస్ట్రేలియా ఆ లక్ష్యాన్ని కేవలం 11 ఓవర్లలోనే ఒక్క  వికెట్ కూడా నష్టపోకుండా చేదించేసింది. ఇది  టీమిండియాకు ఊహించని పరాభవం అనే చెప్పాలి . ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ సొంతం చేసుకోవాలి  అనుకున్న భారత్‌ జోరుకు ఆసీస్‌ బ్రేక్‌లు వేసింది.

118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్‌ వికెట్‌ నష్టపోకుండా కేవలం 11 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ 1-1 సమమైంది. సిరీస్‌ విజేతను నిర్ణయించే ఆఖరి వన్డే చెన్నై వేదికగా మార్చి22న జరగనుంది. ఇక​ఈ ఘోర ఓటమిపై మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. తమ ఓటమికి కారణం బ్యాటింగ్‌ వైఫల్యమే అని రోహిత్‌ శర్మ  అంగీకరించాడు.

“ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ పరంగా మేము దారుణంగా విఫలమయ్యాం. స్కోర్‌ బోర్డుపై తగినంత పరుగులు ఉంచలేకపోయాం. ఇటువంటి మంచి వికెట్‌పై కేవలం 117 పరుగులు మాత్రమే చేస్తామని అస్సలు ఊహించలేదు.  అయితే వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడం మా జట్టును దెబ్బతీసింది. తొలి ఓవర్‌లో శుభ్‌మన్‌ వికెట్‌ను కోల్పోయినప్పుడు నేను విరాట్‌ ఇన్నింగ్స్‌ను కాస్త సెట్‌ చేశాము.

మేమిద్దరం త్వరగా 30 నుంచి 35 పరుగులు రాబట్టాము. అయితే తర్వాత వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయాం. అది మమ్మల్ని మరింత నిరాశకు నెట్టింది. అటువంటి క్లిష్ట పరిస్థితుల నుంచి మేము తిరిగి కోలుకోలేకపోయాం. ఈ రోజు మాకు పూర్తిగా కలిసి రాలేదు అనే చెప్పాలి.

ఇక ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో హార్దిక్ పాండ్యాకి మిచెల్ మార్ష్ చుక్కలు చూపించేశాడు. ఆ ఓవర్‌లో మూడు సిక్సర్లు బాదిన మార్ష్ కేవలం 28 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌ని కూడా ఈ ఓపెనర్లు వదల్లేదు.

స్టార్క్ అద్భుతమైన బౌలర్‌. అతడు కొత్త బంతితో అద్భుతాలు సృష్టిస్తాడు. స్టార్క్‌ కొత్త బంతిని స్వింగ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. ఇక మార్ష్‌ ఒక మంచి పవర్‌ హిట్టర్‌ అని మనకు తెలుసు. అతడు సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడు ప్రపంచం‍లోనే పవర్‌ హిట్టర్లలో టాప్‌ 3 లేదా నాలుగో స్థానంలో మార్ష్‌ ఉంటాడు అని” రోహిత్‌ పేర్కొన్నాడు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh