Andhra Pradesh: ఏపీ రేషన్ కార్డు దారులకు శుభవార్త

Andhra Pradesh

ఏపీ రేషన్ కార్డు దారులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్

Andhra Pradesh: ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. బియ్యం కార్డుదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసరాలను అందించేందుకు చర్యలు చేపట్టింది. మే 1 నుంచి రాయలసీమ జిల్లాల్లో జొన్నలు, రాగులు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి జొన్న ఉత్పత్తులను సేకరించగా కర్ణాటక ప్రభుత్వం నుంచి ఎఫ్‌సీఐ ద్వారా రాగులు కొనుగోలు చేస్తున్నారు. అంతేకాదు ఆ పంట ఉత్పత్తులను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తోంది.

రైతులు కూడా వరికి ప్రత్యామ్నాయంగా చిరు ధాన్యాలు పండించేలా అవగాహన కల్పిస్తున్నారు. స్థానికంగానే రైతుల నుంచి చిరుధాన్యాల ఉత్పత్తులను మద్దతు ధరకు కొనుగోలు చేసి పీడీఎస్‌లో పంపిణీ చేయనున్నారుముందుగా రాయలసీమ జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా రాగులు, జొన్నల పంపిణీ చేస్తున్నారు. ఈ పంపిణీ విజయవంతమైతే Andhra Pradesh అంతటా  చిరు ధాన్యాల పంపిణీని అమలు చేయనున్నారు. కేంద్రం కూడా చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సాహించేందుకు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అలానే ఐక్యరాజ్య సమితి కూడా.. 2023ను చిరుధాన్యాల ఏడాదిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజారోగ్యం పెండచం కోసం ప్రభుత్వాలు చిరుధాన్యాల వినియోగాన్ని పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనిలో భాగాంగానే బియ్యం కంటే రాగులు, జొన్నలు పౌష్టికాహరంగా భావిస్తోంది ప్రభుత్వం. అలానే చిరుధాన్యాల కొనుగోలుకు అయ్యే ఖర్చే కూడా చాలా తక్కువ. అందుకే ప్రభుత్వం చిరు ధాన్యాలను పంపిణీ చేయబోతోంది.అలాగే కేంద్రం నుంచి వచ్చే వరకు ఎదురు చూడాల్సిన పని ఉండదంటున్నారు. అంతేకాక వీటిని నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయడం ద్వారా వారికి మద్దతు ధర దక్కుతుందని భావిస్తోంది.

అంతేకాదు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా.. పీడీఎస్ కింద.. గోధుమ పిండిని కిలో రూ.16 చొప్పున కార్డుకు గరిష్టంగా రెండు కిలోలు సరఫరా చేస్తున్నారు. అయితే గోధుమను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు వినియోగదారుల నుంచి ఐవీఆర్‌ఎస్‌ ద్వారా అభిప్రాయాలను సేకరించారు. ఇక్కడ ప్రతినెలా ఇచ్చే రేషన్‌లో కేజీ బియ్యం బదులు ఉచితంగా గోధుమ పిండి ఇచ్చేలా పౌరసరఫరాల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్రంలో బయట మార్కెట్లో కిలో గోధుమ పిండి రూ.40 ఉంటే.. ప్రభుత్వం మాత్రం రూ.16కే అందిస్తోంది.

అంతకాదు పీడీఎస్‌ అవసరాల కోసం నేరుగా రైతుల నుంచి వచ్చే ఖరీఫ్‌లో కందులు సేకరించాలని భావిస్తోంది పౌరసరఫరాల శాఖ. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.45 కోట్ల రైస్‌ కార్డులు ఉంటే.. ఇందులో ప్రతి నెలా సగటున 5,500 టన్నుల కందిపప్పు అవసరం అవుతోంది. బయట మార్కెట్‌లో రూ.120 నుంచి రూ.130 వరకు ఉంది. ప్రభుత్వం సబ్సిడీపై కిలో కందిపప్పును రూ.67కే అందిస్తోంది. ఇలా Andhra Pradesh ప్రభుత్వం పీడీఎస్ ద్వారా ప్రజలకు పౌష్టికాహరం అందిస్తోంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh