NAYANTHARA నయనతార దంపతులకు 5 సంవత్సరాల జైలు శిక్ష?
తల్లిదండ్రులైన ఆనందం నయనతార, విగ్నేష్ దంపతులకు ఎంతో సేపు నిలవలేదు. సరోగసీ పద్దతిలో పిల్లల్ని కన్న ఈ దంపతులపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు చట్టపరమైన చిక్కులు వెంటాడేలా కనిపిస్తున్నాయి. పెళ్ళైన నాలుగు నెలలకే తమకు పిల్లలు పుట్టినట్లు నయనతార-విగ్నేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. నయనతార గర్భం దాల్చని పక్షంలో వీరు సరోగసీని ఆశ్రయించారని అందరూ నమ్ముతున్నారు.
అదే సమయంలో వీరికి సరోగసీ చట్టం వర్తిస్తుందా లేదా అనే వాదన మొదలైంది. నిజంగా సరోగసీ పద్దతిలో నయనతార పిల్లల్ని కన్నట్లైతే వారికి శిక్ష తప్పదు. సరోగసీ చట్టాన్ని నయనతార-విగ్నేష్ దంపతులు ఉల్లగించినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. చట్ట ప్రకారం పెళ్ళైన దంపతులు, విడాకులు తీసుకున్న, భర్త చనిపోయిన ఒంటరి మహిళలు సరోగసీ పద్దతిలో పిల్లల్ని కనవచ్చు. నయనతార-విగ్నేష్ గత ఏడేళ్ళగా సహజీవనం చేస్తున్నారు.
పెళ్ళికి ఐదు నెలల ముందే సరోగసీని వీరు ఆశ్రయించినట్లు తెలుస్తుంది. అంటే పెళ్లి కాకుండా నయనతార-విగ్నేష్ సరోగసీ పద్దతిలో పిల్లల్ని కన్నట్లు అయ్యింది. తమిళనాడు గవర్నమెంట్ వీరిపై విచారణ చేపట్టాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సైనెస్స్ ని ఆదేశించారు. అలాగే తమ కవల పిల్లల పుట్టుకకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని నయనతార దంపతులను ప్రభుత్వం కోరింది.
2.బాలయ్య రెండో ఫ్యామిలీ మ్యాటర్ లీక్..
అన్‌స్టాపబుల్‌విత్ ఎన్బీకే 2` షో ఈ నెల 14(శుక్రవారం) నుంచి ప్రసారం కానుంది. అందులో భాగంగా (మంగళవారం) సాయంత్రం ఈ షోకి సంబంధించి తొలి ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు. తొలి ఎపిసోడ్‌కి మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే. బావబావమరుదుల మధ్య సంభాషణల ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా సాగడం విశేషం. ఇందులో మొదట బాలయ్య తన ఫ్యామిలీకి సంబంధించిన షాకింగ్ విషయాలు బయటపెట్టారు. తనకిప్పుడు రెండు ఫ్యామిలీలున్నాయన్నారు. జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 45లో వసుందర, పిల్లలున్నారని చెప్పారు.
గతేడాది నుంచి మరో ఫ్యామిలీని మెయింటేన్ చేస్తున్నానని షాకిచ్చాడు. గతేడాది నుంచి ఇంకో ఫ్యామిలీ స్టార్ట్ అయ్యాయనని, చాలా డీప్‌గా కనెక్ట్ అయిపోయా అని తెలిపారు. బావ చంద్రబాబు నాయుడు ముందే ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. `అన్‌స్టాపబుల్` టాక్ షోని బాలయ్య తన రెండో ఫ్యామిలీగా వర్ణించడం విశేషం.మరోవైపు తన చెల్లి(భువనేశ్వరి) మ్యాటర్ తీసుకొచ్చాడు బాలయ్య. మా చెల్లిని ఏమని పిలుస్తారు బావ అని అడగ్గా, `భూ.. `అని పిలుస్తా అని చెప్పడంతో హౌజ్‌లో అరుపులు హోరెత్తాయి. అంతటితో వదల్లేదు. అందరి సాక్షిగా మా చెల్లికి ఐ లవ్ యూ చెప్పాలని పట్టుబట్టాడు బాలయ్య. దీంతో వెంటనే భువనేశ్వరికి ఫోన్ చేసిన చంద్రబాబు.. మీ బాలకృష్ణగారి చేతిలో ఇరుక్కుపోయా నేను అంటూ మాట్లాడటం మరింత నవ్వులు పూయించింది.
3…ప్రజల ఆస్తి పత్రాలపై సీఎం బొమ్మ ఎందుకు?
‘‘ఆస్తి హక్కు పత్రం అనేది భూ యజమాని భద్రంగా దాచుకునేది. దానిపై ముఖ్యమంత్రి ఫోటో, మంత్రుల ఫొటోలను కూడా ముద్రించాలని అనుకుంటున్నారట… ఇదెక్కడి అరాచకం, ఆటవికం’’ అంటూ నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. ఈ విషయంపై న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై తాను నిపుణులతో చర్చిస్తున్నానని తెలిపారు. మంగళవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
మన ఆస్తి హక్కు పత్రాలపై ముఖ్యమంత్రి బొమ్మ ముద్రించడాన్ని భూ యజమానులంతా ముక్తకంఠంతో నిరసించాలని ఆయన పిలుపునిచ్చారు. రాచరికపు రోజుల్లో కూడా లేని ఈ విధానాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక వ్యక్తి ప్రవేశపెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. బ్రిటిష్ వారి పాలనలోనే భూముల సర్వేలు ప్రారంభి భూ హక్కుదారులకు పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు. అయినా భూ యజమాన్య హక్కు పత్రాలపై తమ ఫోటోలను ముద్రించుకోలేదన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా జారీ చేసే పాసు పుస్తకాలపై జగన్ ఫోటోను ముద్రించాలనే నిర్ణయాన్ని ఆక్షేపించారు.
4.మునుగోడులో టీఆర్‌ఎస్ ఆపరేషన్..భారీగా ఆఫర్లు..
మునుగోడు ఉప ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారడంతో.. పట్టు సాధించేందుకు అధికార టీఆర్‌ఎస్ అన్నివిధాలా ప్రయత్నిస్తోంది. స్థానిక నాయకత్వంతో విభేదాలతోనో, ఇతర పార్టీల నుంచి వచ్చిన ‘ఆఫర్ల’ మేరకో పార్టీని వీడిన నేతలను తిరిగి సొంత గూటికి రప్పించే ప్రయత్నాలు చేస్తోంది. సర్పంచ్ మొదలు జడ్పీటీసీ సభ్యుల దాకా అందరితోనూ రాయబారాలు ముమ్మరం చేసింది.
గ్రామానికొకరు చొప్పున ఇన్‌చార్జులుగా నియమితులైన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నారు. పార్టీని వీడిన నేతలు తిరిగి సొంతగూటికి వస్తే పదవులు, నగదు ప్యాకేజీతోపాటు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత భారీగా అభివృద్ధి పనులు కేటాయిస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. ఎవరిపైనైనా పోలీసు కేసులు ఉంటే.. వాటిని ఎత్తేస్తామని హామీ ఇస్తున్నారు. వినని వారిపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఇటీవల టీఆర్‌ఎ్‌సను వీడి బీజేపీలో చేరిన చండూరు జడ్పీటీసీ సభ్యుడు కర్నాటి వెంకటేశం తాజాగా తిరిగి గులాబీ కండువా కప్పుకొన్నారు.
5. 2 నెలల్లో 25 వేల ఓటర్ల నమోదా…? టీఆర్ఎస్ హస్తం..?: బీజేపీ ఆరోపణ.:-
మునుగోడులో కొత్త ఓటర్ల జాబితా ప్రకటనపై స్టే విధించాలని బీజేపీ కోర్టును ఆశ్రయించింది. కేవలం రెండు నెలల్లో సుమారు 25వేల కొత్త ఓటర్ల దరఖాస్తులను ఎన్నికల సంఘం స్వీకరించడంపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది. 14న ప్రకటించనున్న ఓటర్ల జాబితాపై స్టే విధించాలని కోరింది. ఇన్ని దరఖాస్తులు రావడం వెనక టీఆర్ఎస్ హస్తం ఉందని ఆరోపణలు చేసింది. దీంతో ఈనెల 13న విచారణకు రానుంది.
6.. ‘వైస్సార్సీపీ గర్జన’ కార్యక్రమానికి ..పవన్ కౌంటర్ ….
AP: మూడు రాజధానులకు మద్దతుగా అక్టోబర్ 15న విశాఖలో నిర్వహించే ‘విశాఖ గర్జన’ కోసం జేఏసీ సిద్ధమవుతోంది. అందుకు సంబంధించిన పోస్టర్ను మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, జేఏసీ నాయకులు విడుదల చేశారు. పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని, ఇప్పటికే అన్ని ప్రాంతాల ప్రజలు విశాఖకు వచ్చేందుకు సిద్ధమయ్యారని అమర్నాథ్ తెలిపారు.
మరోవైపు …దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ … నిన్న తిరుపతి జిల్లా కేవీబీపురంలో కన్నకొడుకు మృతదేహాన్ని తండ్రి బైక్పై తీసుకెళ్లిన ఘటనపై పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేనికి గర్జన? ఆస్పత్రిలో మృతి చెందినవారిని తరలించేందుకు వాహనం కూడా సమకూర్చలేనందుకా? కన్నుమూసిన బిడ్డను భుజాన వేసుకుని బైక్ మీద తీసుకువెళ్లేలా చేసినందుకా? అంబులెన్స్ మాఫియాను పెంచి పోషిస్తున్నందుకా?’ అని ప్రశ్నలు గుప్పించారు.
7..చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు!
వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణించే కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్ జిల్లాలో ఓ వ్యక్తి స్టేజిపైనే కుప్పకూలిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రాంలీలాలో శివుడి పాత్ర పోషిస్తోన్న వ్యక్తికి హారతి ఇస్తుండగా.. అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఇలా ఎందుకు జరుగుతున్నాయో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
8.వర్మ పట్టిన కథ … ఇక సినిమా రచ్చ రచ్చే..
రామ్ గోపాల్ వర్మకి చాలా గ్యాప్ తర్వాత ఓ కథ దొరికింది. ఆల్రెడీ తన ట్విట్టర్ అకౌంట్‌లో టీజర్ కూడా వదిలాడు.. ఇక సినిమానే..’.. ఇది తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్స్ చూసిన వారంతా చేస్తున్న కామెంట్స్. కొన్ని రోజులుగా వర్మ సైలెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే. కాంట్రవర్సీ మ్యాటర్ ఏదీ దొరకలేదో.. లేక ఆయనకి ఇష్టమైంది ఇంకా దిగలేదో తెలియదు కానీ.. ఇన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న వర్మకి.. ‘గరికపాటి’ రూపంలో ఇప్పుడు మాంచి కాంట్రవర్సీ మ్యాటర్ దొరికింది. ఇక వరసబెట్టి వాయించుడు మొదలెట్టాడు. ఆ వాయించుడు చూస్తుంటే..
త్వరలో ఈ మ్యాటర్‌తో ఆయన సినిమా అనౌన్స్ చేసినా చేసేయవచ్చు.. అనేలా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రీసెంట్‌గా జరిగిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో మహా సహస్రవధాని గరికపాటి నరసింహారావు.. మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన కొన్ని కామెంట్స్.. వైరల్ అవడమే కాకుండా.. అనేక చర్చలకు తావిచ్చాయి. అయితే, చిరంజీవి హుందాగా వ్యవహరించి.. మ్యాటర్‌ని అక్కడితో క్లోజ్ చేశానని అనుకున్నాడు కానీ..
ఆ తర్వాత నాగబాబు, ఉత్తేజ్, అనంత శ్రీరామ్ వంటివారు చేసిన కొన్ని కామెంట్స్, లేఖలు, వీడియోలు ఈ విషయాన్ని మరింత కాంట్రవర్సీకి దారితీసేలా చేశాయి. అయితే, మెగాబ్రదర్ నాగబాబు.. ఆ తర్వాత ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి.. గరికపాటివారి నుండి క్షమాపణలు ఆశించడం లేదు అంటూ ఓ ట్వీట్ చేసి.. దాదాపు విషయం సద్దుమణిగేలా చేశారు. కానీ ఇప్పుడు తెరపైకి వర్మ వచ్చారు.
9. ఐనాక్స్ లో టీ20 ప్రపంచకప్…
ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే టీవీల ముందు అతుక్కుపోతుంటాం. 8 మ్యాచ్ మరి ఆ థియేటర్లలో వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి..? అవును టీ 20 వరల్డ్ కప్ని థియేటర్లలో చూసే అవకాశం రాబోతోంది. ఈమేరకు ఐసీసీతో ఐనాక్స్ సంస్థ ఒప్పందం చేసుకుంది. దేశవ్యాప్తంగా 25కు పైగా నగరాల్లో ఇండియా ఆడే మ్యాచ్లను ఐనాక్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.