Navadeep: నవదీప్ షాకింగ్ కామెంట్స్….నేను ‘గే’ కాదు

Navadeep

Navadeep: నవదీప్ షాకింగ్ కామెంట్స్….నేను ‘గే’ కాదు

Navadeep: తెలుగు నటుల్లో నవదీప్ కాస్త డిఫరెంట్. ఎందుకంటే హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాడు. మధ్య విలన్ రోల్స్ చేశాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ పాజిటివ్ సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నాడు. గత కొన్నాళ్ల నుంచి మాత్రం పూర్తిగా వెబ్ సిరీసుల్లో నటిస్తున్నాడు.

ప్రస్తుతం నవదీప్ న్యూసెన్స్ అనే సిరీస్ తో ఆహా ఓటీటీలో రాబోతున్నాడు. నవదీప్, బిందుమాధవి జంటగా నటించారు. మీడియా బేస్డ్ స్టోరీని ఇందులో చూపించబోతున్నారు. నవదీప్, బిందుమాధవి.. రిపోర్టర్స్ గా లీడ్ రోల్స్ చేశారు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి వచ్చిన టీజర్, ఓ సాంగ్ ప్రేక్షకులని మెప్పించాయి. ఈ న్యూసెన్స్ సిరీస్ మే 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవ్వనుంది. తాజాగా నేడు న్యూసెన్స్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో నవదీప్, Navadeep: బిందు మాధవి, చిత్రయూనిట్, ఆహా టీం పాల్గొన్నారు. ట్రైలర్ లాంచ్ అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో నవదీప్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

గతంలో కొన్నేళ్ల క్రితం నవదీప్ గే అని, నవదీప్ వల్ల ఓ హీరోయిన్ చనిపోయిందని వార్తలు వచ్చాయి. తాజాగా నవదీప్ వీటిపై స్పందించాడు. నవదీప్ మాట్లాడుతూ‘2005లో నా వల్ల ఓ హీరోయిన్ చనిపోయిందని ఓ పత్రికలో న్యూస్ వచ్చింది. అది పూర్తిగా అబద్ధం. ఏ హీరోయిన్ కూడా చనిపోలేదు. నేను గే అనే వార్తలు కూడా వచ్చాయి. అది కూడా అబద్ధం. నేను రేవ్ పార్టీలో పాల్గొన్నాని ఓ పేపర్ లో వచ్చింది. ఇదీ ఫేక్. ఎందుకంటే అది జరిగిన టైంలో నేను అమ్మతో ఫామ్ హౌస్ కి వెళ్లాను. అది నా మంచికే. ఎందుకంటే ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల మా ఇంట్లో కూడా నన్ను అనుమానించే పరిస్థితి వచ్చింది. అమ్మతో ఉన్నప్పుడు అలా జరిగిందనే వార్త రాశారు. దాంతో నాపై మా ఇంట్లో నమ్మకం పెరిగింది. మీడియాపై కక్ష సాధింపు చర్యగా మాత్రం ఇందులో యాక్ట్ చేయలేదు’ అని నవదీప్ క్లారిటీ ఇచ్చాడు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh