DC Vs RCB : బౌలింగ్ ఎంచుకున్న బెంగుళూరు

DC Vs RCB

DC Vs RCB : టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న బెంగుళూరు

DC Vs RCB ఐపీఎల్ 2023 సీజన్ లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ కు రంగం సిద్ధమైంది. శనివారం డబుల్ ధమాకాలో భాగంగా కాసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు .. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఫ్యాన్స్ ను ఈ పోరును కోహ్లీ వర్సెస్ గంగూలీగా చూస్తున్నారు.

ఇక, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. అన్రిచ్ నోర్ట్జే స్థానంలో ముఖేష్ కుమార్ తిరిగి జట్టులో చోటు సంపాదించాడు. మిచెల్ మార్ష్ తిరిగి జట్టులో చేరాడు. ఇక.. ఆర్సీబీ ధోని మిత్రుడు కేదార్ జాదవ్ ని ప్లేయింగ్ ఎలెవన్ లోకి తీసుకుంది.

ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ 23 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించడంతో 174 పరుగుల స్కోరు చేసిన ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌ని 151 పరుగులకే కట్టడి చేసింది. మనీశ్ పాండే 50 పరుగులతో రాణించినా ఢిల్లీకి విజయాన్ని అందించలేకపోయాడు.

ఈ మ్యాచ్ సమయంలో అగ్రెసివ్ యాటిట్యూడ్‌తో వార్తల్లో నిలిచాడు విరాట్ కోహ్లీ. మ్యాచ్ ముగిసిన తర్వాత సౌరవ్ గంగూలీతో షేక్ హ్యాండ్ ఇవ్వకుండా తప్పించుకోవడం, బౌండరీ లైన్ దగ్గర బీసీసీఐ మాజీ బాస్‌ని కోపంగా చూడడం టీవీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది.  నాటకీయ పరిణామాల మధ్య ముగిసిన ఆ మ్యాచ్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌కి హైప్ పెరిగిపోయింది. గౌతమ్ గంభీర్‌తో వాగ్వాదం జరిగిన తర్వాత సౌరవ్ గంగూలీతో విరాట్ కోహ్లీ ఎలా ప్రవర్తిస్తాడని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. లక్నో సూపర్ జెయింట్స్‌పై 18 పరుగుల తేడాతో గెలిచిన ఆర్‌సీబీ, ప్రస్తుతం 9 మ్యాచుల్లో 5 విజయాలతో ఐదో స్థానంలో ఉంది.

టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న బెంగుళూరు

మరోవైపు 9 మ్యాచుల్లో 3 విజయాలు మాత్రమే అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరి స్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌లో ఓడితే ఢిల్లీ క్యాపిటల్స్, ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటుంది..

గాయంతో రిషబ్ పంత్ దూరమవడంతో డేవిడ్ వార్నర్ సారథ్యంలో బరిలోకి దిగిన డిల్లీ  DC Vs RCB క్యాపిటల్స్ జట్టు.. ఆశించిన మేర రాణించలేకపోతోంది. తొలి ఐదు మ్యాచుల్లో ఓటమి పాలైన ఢిల్లీ ఆరో మ్యాచులో తొలి విజయాన్ని అందుకుంది. తర్వాత 4 మ్యాచుల్లో 3 విజయాలు సాధించింది. ఢిల్లీ ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన 5 మ్యాచుల్లోనూ భారీ రన్ రేట్‌తో గెలవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున ఢిల్లీ నిలిచింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ చేరాలంటూ పూర్తిస్థాయి DC Vs RCB  ప్రదర్శన చేయాల్సిందే. పేలవ ఫామ్‌లో ఉన్న పృథ్విషాను తప్పించిన ఢిల్లీ ఫిల్ సాల్ట్‌ను ఓపెనర్‌గా పంపుతోంది. అక్షర్ పటేల్, డేవిడ్ వార్నర్ పైనే ఆ జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది. బౌలింగ్ లో ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కీలకం కానున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ : డేవిడ్ వార్నర్(కెప్టెన్), ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), మిచ్ మార్ష్, రిలీ రస్సో, మనీష్ పాండే, అక్షర్ పటేల్, DC Vs RCB అమన్ హకీమ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), అనుజ్ రావత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లామ్రోర్, దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్), కేదార్ జాదవ్, వానిందు హసరంగ, కరణ్ శర్మ, మహమ్మద్ సిరాజ్, హేజిల్ వుడ్

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh