Nandamuri Family ఫ్యామిలి ఫంక్షన్లో ఎన్టీఆర్ ను తారక్ రత్న అవమానించారా?

Nandamuri Family ఫ్యామిలి ఫంక్షన్లో ఎన్టీఆర్ ను తారక్ రత్న అవమానించారా? ?? అలా ఎందుకు చేశారు?

Nandamuri Family టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడు.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. సూటిపోటి మాటలు తప్పలేదు. కెరీర్ ప్రారంభంలో సొంత కుటుంబం నుంచి సరైన మద్దతు లేదు. ఎప్పుడు అయితే `స్టూడెంట్ నెంబర్ 1`, `ఆది`, `సింహాద్రి` సినిమాలు వచ్చాయో అప్పటినుంచి నందమూరి తెలుగుదేశం అభిమానులు కూడా తారక్ ను తమ వాడిగా ఓన్ చేసుకున్నారు.`యమదొంగ` తర్వాత కెరీర్ పరంగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. సరైన హిట్ లేదు.

మళ్లీ `టెంపర్` సినిమా నుంచి ఆరు వరసహిట్లతో.. ఈరోజు టాలీవుడ్ లోనే తిరుగులేని నెంబర్ వన్ హీరోగా ఉన్నాడు. అటు `త్రిబుల్ ఆర్` సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు వరుసగా కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఎన్టీఆర్ `స్టూడెంట్ నెంబర్ 1` సినిమాతో హిట్టు కొట్టాక నందమూరి ఫ్యామిలీ నుంచి మరో కుర్ర హీరోను ఎన్టీఆర్‌కు పోటీగా తీసుకురావాలన్న ప్రయత్నాలు జరిగాయి.ఆ ప్రయత్నాల్లో భాగంగానే నందమూరి తారకరత్నను హీరోగా చేశారు.

అప్పుడు ముఖ్య మంత్రిగా ఉన్న చంద్రబాబు తారకరత్న హీరోగా ఒకేసారి ఏకంగా తొమిది సినిమాలకు ప్రారంభోత్సవం చేశారు. ఒక టాలీవుడ్ హీరోను పరిచయం చేసే క్రమంలో ఏకంగా తొమ్మిది సినిమాలు ఒకేరోజు ప్రారంభం కావటం తెలుగు సినిమా చరిత్రలోనే ఓ రికార్డుగా నిలిచిపోయింది. ఎన్టీఆర్ పోటీగానే తారకరత్నను రంగంలోకి దింపారు..

అన్నది వాస్తవం. అయితే తారకరత్న కనీసం మిడిల్ రేంజ్ హీరోగా కూడా సక్సెస్ కాలేకపోయాడు. అది వేరే విషయం.ఇక నందమూరి ఫ్యామిలీతో ఎన్టీఆర్‌కు గొడవలు ఉన్నాయన్న విషయం ఎప్పటికప్పుడు వార్తల్లోనే ఉంటుంది.ఒకసారి నందమూరి ఫ్యామిలీ ఫంక్షన్ కు ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణ ద్వారా వెళ్లారట. ఆ ఫంక్షన్ లో తార‌కరత్న ఎన్టీఆర్‌ను కావాల‌నే అవమానించారు అన్న ప్రచారం అప్పట్లో వినిపించింది. ఈ ప్రచారంపై తారకరత్న తన తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

ఎన్టీఆర్‌ను అవమానించాల్సిన అవసరం తనకు లేదని.. అది కేవలం పుకారు మాత్రమే అని… కొందరు పనికట్టుకుని ఈ పుకార్లను ప్రచారం చేస్తూ ఉంటారని తారకరత్న క్లారిటీ ఇచ్చాడు. ఇక హీరోగా సక్సెస్ కానీ తారకరత్న `అమరావతి` సినిమాతో విలన్ గా కూడా ఎంట్రీ ఇచ్చారు.

 ఆదిపురుష్ టీజర్ బాలేదు…అట్టర్ ప్లాప్ అన్న వాళ్ళకి దిమ్మతిరిగే న్యూస్.

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినీ కెరీర్ లో మోస్ట్ అవైటెడ్ మూవీగా ఆదిపురుష్ నిలిచింది. ఓం రౌత్ డైరెక్షన్ లో 500 కోట్ల రూపాయలతో బడ్జెట్ ను ప్రభాస్ రాముని పాత్రలో చూపిస్తూ.. ఆదిపురుష్ మూవీ అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా ఈ టీజర్ ను ఫిల్మ్ టీమ్ రీసెంట్ గా రిలీజ్ చేశారు ఫిల్మ్ టీమ్.

టీజర్ లో ప్రభాస్ లుక్ ఓ రేంజ్ లో ఉంది. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు వీఎఫ్ఎక్స్ అద్దిరిపోయాయి. లంకేష్ గా సైఫ్ అలీఖాన్ లుక్ అద్భుతంగా ఉంది.అయితే ఆదిపురుష్ టీజర్ పై ఆడియన్స్ రియాక్షన్ పాజిటివ్ గా కంటే నెగిటివ్ గానే వైరల్ అవుతుంది. ఆదిపురుష్ గ్రాఫిక్స్ కంటే నాగిని లాంటి సీరియల్ గ్రాఫిక్స్ బావున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాకుండా కొంతమంది మూవీ విశ్లేషకులు కూడా ఆదిపురుష్ టీజర్ బొమ్మల గ్రాఫిక్స్ చూసినట్లు ఉన్నాయంటూ కామెంట్ చేస్తున్నారు.సాహో, రాధేశ్యామ్ మూవీస్ తర్వాత ప్రభాస్ ఇలాంటి ప్రాజెక్ట్ ను ఎందుకు ఒప్పుకున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ టీజర్ పై ఫుల్ గా ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.మరి ఈ టీజర్ బాలేదనేవారికి, అట్టర్ ఫ్లాప్ అంటూ నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్లకు దవడ పగిలిపోయే రేంజ్ లో బ్రేకింగ్ న్యూస్ ఒకటి చెప్పమంటారా? ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ టీజర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రికార్డ్ క్రియేట్ చేస్తుంది.

అన్ని భాషల్లో కలిపి కేజీఎఫ్ 2 టీజర్ 24 గంటల్లో 68 మిలియన్ల వ్యూస్ సాధించగా, ఆదిపురుష్ టీజర్ కేవలం 17 గంటల్లోనే 88 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. అలాగే 932కె లైక్స్ వచ్చాయి. మరి 24 గంటలు పూర్తయ్యేసరికి మరిన్ని రికార్డులను ప్రభాస్ తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.

సిల్క్ బార్‌లో.. ధూమ్ ధామ్ అంటూ దుమ్ములేపారు

న్యాచురల్ స్టార్ నాని ఈసారి ఊరమాస్ లుక్‌లో ఎంటర్‌టైన్ చేయబోతున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘దసర. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ‘నేను లోకల్’ సినిమా తర్వాత మరోసారి నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన నాని మాస్ అవతారంలో ఉన్న పిక్స్..

సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేయగా.. తాజాగా ఈ సినిమాలో ‘ధూమ్ ధామ్ ధోస్థాన్’ సింగల్ వదిలారు మేకర్స్. ఫుల్ సాంగ్ వదలడానికి ముందు వచ్చిన చిన్న చిన్న ప్రోమో వీడియోలు ఈ పాట ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని వేచి చూసేలా చేశాయి. ఆ ఎదురుచూపులకు తెరదించుతూ.. దసరా పండుగను పురస్కరించుకుని ‘దసరా’లోని ఈ దుమ్మురేపే సాంగ్‌ని వదిలారు.
తెలంగాణ-శైలి జానపదంతో మొదలైన ఈ పాట..‘‘ ధూమ్ ధామ్ ధోస్థాన్ ఇరగ మరగ చేద్దాం’’ అంటూ ఊర మాస్ స్టెప్పులతో సాగిన ఈ పాటలో కనకవ్వ పాడిన ‘బతకమ్మ’ పాటని కూడా చేర్చారు. ఈ పాటలో నాని లుక్, మేకోవర్‌కి మునుపెన్నడూ చూడని విధంగా వుంది. నాని, అతని బ్యాచ్ అద్భుతమైన, డైనమిక్ డ్యాన్స్ మూవ్స్‌తో బొగ్గు గనులలో దుమ్ము రేపారు. ఈ పాటను సంతోష్ నారాయణ్ కంపోజ్ చేయగా..

రాహుల్ సిప్లిగంజ్, పాలమూరు జంగిరెడ్డి, నర్సమ్మ, గొట్టె కనకవ్వ, గన్నోర దాస లక్ష్మి పాడారు. తెలంగాణ స్టైల్‌లో కాసర్ల శ్యామ్ ఈ పాటకు ఆకట్టుకునేలా సాహిత్యం అందించారు. మాసియెస్ట్ లోకల్ స్ట్రీట్ సాంగ్‌లా.. మాస్ జాతరే అన్నట్లుగా ఉందీ పాట. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. కాగా, ఈ సినిమాని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 30 మార్చి 2023న విడుదలచేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh