సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి
Movie Industry: చిత్ర పరిశ్రమలో వరస విషాదలు చోటు చేసుకుంటున్నాయి. నెలల వ్యధిలోనే అగ్ర హీరోలు, హీరోయిన్లు, దర్శకులు మరణిస్తు చిత్ర పరిశ్రమకు తిరని దుఖః కలిగిస్తున్నారు.
ఇప్పుడు Movie Industry లో మరో విషాదం చోటు చేసుకుంది. తమిళంలో ఎన్ఐసీ ఆర్ట్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత ఎస్ ఎస్ చక్రవర్తి గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.నిర్మాత అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి.
చక్రవర్తికి కొడుకు, కుమార్తె కూడా ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు శోకంలో మునిగిపోయారు. ఆయన కుమారుడు జాని రేణిగుంట అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఎన్ఐసీ ఆర్ట్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మించిన ఎస్ఎస్ చక్రవర్తి దాదాపు 14 చిత్రాలను నిర్మించారు,
చక్రవర్తి ప్రాజెక్టుల్లో 90 శాతం అజిత్ సినిమాలే అంటే అతిశయోక్తి కాదు. 1997లో ‘రాశి’తో మొదలైన ఆయన ఆ తర్వాత ‘వాలి’, ‘ముగవరి’, ‘సిటిజన్’, ‘రెడ్’, ‘విలన్’ వంటి చిత్రాలతో స్టార్ నటుడితో వరుసగా పనిచేశారు. . 2003లో విక్రమ్ తో ‘కాదల్ సడుగుడు’ సినిమా చేసిన తర్వాత అజిత్ తో ‘ఆంజనేయ’, ‘జీ’, ‘వరలారు’ అనే మూడు సినిమాలు చేశాడు. ‘కాళై’, ‘రేణిగుంట’, ’18 వాయసు’, ‘వాలు’ తదితర చిత్రాల్లో నటించారు.
ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్ ‘విలంగు’లో ఆయన వేమల్, ఇనియా జంటగా నటించారు. ఈ వెబ్ సిరీస్ లో ఆయన పోలీస్ ఆఫీసర్ గా నటించారు. 2015లో ‘తోప్పి’ చిత్రంతో నటుడిగా తెరంగేట్రం చేశారు.అలాగే చక్రవర్తి మరణంతో ఒకసారిగా కోలీవుడ్ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతికి పలువురు అగ్ర హీరోలు కూడా సంతాపం తెలియజేశారు. అలాగే తమిళ Movie Industry లో తనకంటూ ఓ చరిత్ర సృష్టించిన చక్రవర్తిపై ప్రముఖ దర్శకుడు టి.రాజేందర్ ప్రశంసలు కురిపించారు.నిర్మాత ఎస్ ఎస్ చక్రవర్తి అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి.