KTR America Tour: నేడు అమెరికాకు మంత్రి కేటీఆర్

KTR America Tour

KTR America Tour: నేడు అమెరికాకు మంత్రి కేటీఆర్

KTR America Tour: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. పెట్టుబడుల లక్ష్యంగా ఈరోజు నుంచి రెండు వారాల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. టూర్‌లో భాగంగా మంత్రి అమెరికాలోని ప్రముఖు కంపెనీల ఛైర్మన్లు, సీఈఓలు, ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలుచేస్తున్న విధానాలను మంత్రి వారికి వివరించనున్నారు.

అయితే మే మూడవ వారం వరకు కేటీఆర్ అమెరికా పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ తెలంగాణలో అనుసరిస్తున్న నీటి వివరాలను వివరించనున్నారు.

అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ నిర్వహిస్తున్న వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ సదస్సులో ప్రసంగించనున్నారు.

తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన విజయాలను..సాధిస్తున్న విజయాలను, మిషన్ భగీరథ ప్రాజెక్టు గురించి సదస్సులో వివరించనున్నారు.

తెలంగాణలో అనుసరిస్తున్న సాగు, తాగునీటి వివరాలను తెలియజేసేందుకు తమ సదస్సుకు హాజరు కావాలన్న సంస్థ విజ్ఞప్తి మేరకు కేటీఆర్ పర్యటన కొనసాగనుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల నిర్మాణం, వాటి ఫలితాల పైన మంత్రి ఈ సదస్సులో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

ఇటీవల లండన్‌ టూర్‌ వెళ్లిన మంత్రి కేటీఆర్‌ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించిన విషయం తెలిసిందే. స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్ దిగ్గజం డాన్జ్ హైదరాబాద్​లో ప్రొడక్ట్ డెవలప్​మెంట్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే.

వీటితో పాటు బ్రిటన్‌కు చెందిన ఇన్‌క్రెడిబుల్ హస్క్ ఇంటర్నేషనల్ గ్రూప్ రూ.200 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో పరిశ్రమ పెట్టేందుకు ముందుకొచ్చింది.

ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌ తాజా అమెరికా టూర్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కేటీఆర్‌తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌తో పాటు పలువురు అధికారులు కూడా అమెరికా వెళ్లనున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh