Megastar : ని కలిసిన మాజీ సీబీఐ జేడీ

Megastar

Megastar : ని కలిసిన మాజీ సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ దంపతులు

Megastar : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఈ పేరు తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కరలేదు.

సంచలనాత్మక కేసుల దర్యాప్తునకు చిరునామాగా మారిన సీబీఐ హైదరాబాద్ విభాగం జాయింట్ డైరెక్టర్.

ప్రస్తుతం జేడీ లక్ష్మీనారాయణ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి.

ఈ సందర్భంగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సతీసమేతంగా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.

లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళతో కలిసి వీరి కుమార్తె వివాహానికి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి.

. చిరంజీవి, సురేఖ దంపతుల్ని ఆహ్వానించారు. ప్రియాంక వివాహానికి లక్ష్మీనారాయణ పలువురు ప్రముఖుల్ని కూడా ఆహ్వానించారు.

జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ కుమార్తె ప్రియాంక‌ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ కూడా నడుస్తుంది.

కాకపోతే ఈ విషయంపై జేడీ లక్ష్మీనారాయణ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

కాకపోతే ఈ విషయంపై జేడీ లక్ష్మీనారాయణ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

అయితే లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేయడం ఖాయమని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనదే మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఆ సమయానికి తన ఆలోచనలకు దగ్గరగా ఉండే Megastar :  పార్టీలో చేరి పోటీ చేస్తానని.

. ఒకవేళ కుదరని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని చెప్పారు.

జేడీ లక్ష్మీనారాయణ యూపీఏ హయాంలో వైఎస్ జగన్ పై అక్రమాస్తుల కేసుల విషయంలో అప్పుడు

సీబీఐ జేడీగా ఉన్న వీవీ లక్ష్మినారాయణ ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత వీఆర్ఎస్ తీసుకున్న లక్ష్మినారాయణ గత ఎన్నికల్లో జనసేన తరపున విశాఖపట్నం

నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికే జనసేన నుంచి బయటకు వచ్చారు.

మళ్లీ ఆయన విశాఖపట్నం నుంచి బరిలో నిలవాలని చూస్తున్నారు.

అయితే లక్ష్మినారాయణను వైసీపీలో చేర్చుకునే ప్రయత్నాలు జరిగాయని వార్తలు వచ్చాయి.

కానీ గతంలో బహిరంగ ర్యాలీలు, రోడ్ షోలకు సంబంధించి తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 విషయంలో కూడా జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని వీవీ లక్ష్మినారాయణ సమర్ధించారు.

‘ఈ పోలీసు చట్టం 1861లో వచ్చింది. అనేక రాష్ట్రాలు వాళ్లవాళ్ల పోలీస్ యాక్ట్ తీసుకొచ్చాయి. సభలు పెట్టాలంటే.. సంబంధింత పోలీస్ స్టేషన్ Megastar : దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అన్ని వివరాలు ఇస్తే.. వాళ్లు ఏర్పాట్లు చేస్తారు. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలో కొత్త విషయం ఏమీ లేదు. అన్ని పాత అంశాలే. ప్రతీదాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నారు.   అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. తనకు బీఆర్ఎస్, వైసీపీల నుంచి పార్టీలో చేరాల్సిందిగా ఆఫర్ వచ్చిందని చెప్పారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh