Anjan Kumar Yadav : మాజీ ఎంపి అంజ‌న్

Anjan Kumar Yadav : మాజీ ఎంపి అంజ‌న్ కుమార్ కి ఈడీ నోటీసులు

Anjan Kumar Yadav : నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కు ఈడీ అధికారులు నోటీసులు పంపారు.

ఈ నెల 31న విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.

రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసులో ఈడీ పేర్కొంది.

కాగా 2022 నవంబర్ 23న అంజన్ కుమార్ యాదవ్ ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే.

ఈ కేసులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఈడీ విచారణకు హాజరయ్యారు

తాజాగా మరోసారి ఈడీ విచారణకు హాజరు కావాలని అంజన్ కుమార్ యాదవ్ కు ఈడీ నోటీసులు పంపింది.

నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ మంత్రి గీతారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు ఈడీ విచారణకు హాజరయ్యారు.

ఇది ఇలా ఉంటే రూ. 2 వేల కోట్ల విలువైన అసెట్స్  ఈక్విటీ లావాదేవీల విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి.

నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆర్ధిక సహాయం అందించింది.

మరోవైపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బోర్డు డైరెక్టర్లుగా యంగ్Anjan Kumar Yadav :  ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది.

నేషనల్ హెరాల్డ్ కేసులో అవకతవకలు జరిగాయని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఆరోపించారు.

ఈ విషయమై ఆయన ఫిర్యాదు చేశారు. కేవలం రూ. 50 లక్షలు చెల్లించి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు

చెందిన ఆస్తులను రికవరీ చేసుకునే హక్కును పొందిందని సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. దీనిపైనే ఈడి విచార‌ణ కొన‌సాగిస్తున్న‌ది.

అయితే నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికను సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నిధులను దుర్వినియోగం

చేశారనేది ప్రధాన ఆరోపణ. ఈ మేరకు 2012లో బీజేపీ అగ్రనేత సుబ్రమణ్య స్వామి సోనియా గాంధీ,

రాహుల్ గాంధీలపై కేసు పెట్టారు. వారు వేల కోట్ల రూపాయల మేర మోసం చేశారని, భూకబ్జాలకు పాల్పడ్డారని

పేర్కొంటూ స్వామి 2012 నవంబర్‌లో ఢిల్లీలోని కోర్టులో ఫిర్యాదు చేశారు. యంగ్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ ద్వారా ఢిల్లీ,

యూపీతో పాటు ఇతర ప్రాంతాల్లో రూ. 1,600 కోట్ల రూపాయల విలువైన AJL ఆస్తులను మోసపూరితంగాAnjan Kumar Yadav :  స్వాధీనం

చేసుకున్నారని స్వామి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు గతేడాది పలు మార్లు

ఈడీ ఎదుట హాజరయ్యారు. తాజాగా అంజన్ కుమార్ యాదవ్‌ను మరోసారి ఈడీ విచారణకు పిలవటంతో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh