నేడు కృష్ణా జిల్లాలో భారీ ఏర్పాట్లు మద్య జనసేన ఆవిర్భావ సభ

machilipatnam janasena sabha

Jinasena : నేడు కృష్ణా జిల్లాలో భారీ ఏర్పాట్లు మద్య జనసేన ఆవిర్భావ సభ

ఏపీలో వైసీపీ ప్రభుత్వం బహిరంగ సభలకు కొన్ని కండీషన్లు పెట్టడంతో అది జనసేన పార్టీకి సమస్యగా మారుతోంది. నేడు పదో వార్షిక ఆవిర్భావ సభను అత్యంత ఘనంగా  జరపాలి అనుకున్న జనసేన  పార్టీకి పోలీసుల ఆంక్షలు సమస్యగా మారుతున్నాయి.

అయినప్పటికీ  కుదిరనంతలో  ఘనంగా నిర్వహించేందుకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ రోజు సభలో అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తోపాటూ కొందరు కీలక నేతలు పాల్గొంటున్నారు. 2014 మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావo జరిగింది. ఇప్పటికి 9 ఏళ్లు పూర్తి చేసుకొని పదో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌తోపాటూ తెలంగాణలోనూ యాక్టివ్ గానే ఉంది జనసేన . అందువల్ల పదో ఆవిర్భావ సభకు తెలంగాణ నుంచి కూడా భారీ ఎత్తున జనసేన నేతలు, కార్యకర్తలూ వస్తున్నారు. పోలీసుల ఆంక్షల్ని లెక్కలోకి తీసుకొని 100 ఎకరాల్లో సభ, పార్కింగ్ అన్నీ పక్కాగా ఉండేలా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ దగ్గరుండి చూసుకున్నారు. ఈ సభ 35 ఎకరాల్లో ఉంటుంది. దీనికి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరు పెట్టారు. శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదిక అని పెట్టారు.

ఈ సభ జరిగే ప్రాంతంలో సభ జరిపేందుకు రైతులు అనుమతి ఇచ్చారు. సభా ప్రాంగణంలో10 గ్యాలరీలు, భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సభకు వచ్చే కార్యకర్తలకు భోజన ఏర్పాట్లను పార్కింగ్ స్థలంలోనే ఓవైపున ఏర్పాటు చేశారు. ఎండాకాలం కాబట్టి వచ్చినవారికి మంచినీటితోపాటూ మజ్జిగ, పండ్లు కూడా ఇవ్వనున్నారు జనసేన నాయకులు. ఇక భారీ ఎత్తున వచ్చే కార్యకర్తలకు ఏదైనా అనారోగ్య సమస్య ఏర్పడితే వెంటనే ట్రీట్‌మెంట్ అందించేందుకు డాక్టర్లు, 8 అంబులెన్సులు కూడా రెడీ చేశారు.

ఈ సభలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మధ్యాహ్నం వారాహి వాహనంలో విజయవాడ ఆటోనగర్‌ నుంచి మచిలీపట్నం రానున్నారు . సాయంత్రం 5గంటలకు సభకు చేరతారు అప్పటి నుంచి రాత్రి 9 వరకు సభ ఉంటుంది. పవన్‌ కళ్యాణ్ రాక కోసం విజయవాడ – బందరు మధ్య భారీ స్వాగత ఏర్పాట్లు చేసుకుంటున్నారు అభిమానులు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కరెక్టుగా సంవత్సరం టైమ్ ఉంది. ఏ రాజకీయ పార్టీకైనా ఇది కీలక సమయం. ఈ సంవత్సర కాలంలో పార్టీ పనిచేసే తీరును బట్టే ఎన్నికల్లో ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అందుకే పవన్ కళ్యాణ్  ఇప్పుడు పార్టీని యాక్టివ్ చేస్తున్నారు. అయితే జనసేన  కార్యకర్తల్లో ఎన్నో అనుమానాలున్నాయి. జనసేన ఒంటరిగా వెళ్తుందా? టీడీపీతో కలిసి వెళ్తుందా? బీజేపీతో ఉన్న పొత్తు సంగతేంటి? ఓట్లు చీలనివ్వనన్న పవన్ కళ్యాణ్ అందుకు ఏం చేయబోతున్నారు? క్షేత్రస్థాయిలోకి పార్టీని ఎలా విస్తరించాలనుకుంటున్నారు? అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఎలా చేస్తారు? ఏపీ రాజధానిపై పవన్ ప్రణాళిక ఏంటి? యువతకు ఉపాధి అవకాశాలు, రాష్ట్ర అభివృద్ధిపై జనసేన అజెండా ఏంటి? ఎన్నికలకు కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ నేడు  సమాధానం వస్తున్నది  అనేది ఆసక్తిగా మారింది.

 

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh