మూడోసారి ‘ఆస్కార్‌’ను దక్కించుకున్నప్రముఖ దర్శకుడు

Guillermo del Toro third Academy Award

మూడోసారి ‘ఆస్కార్‌’ను దక్కించుకున్నప్రముఖ దర్శకుడు

ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌ అవార్డు ను గెలుచుకోవాలని సినీ రంగంలోని వారంతా ఎంతో ఎదురు చూస్తువుంటారు. అసలు  జీవితంలో ఒక్కసారైనా ఆ అవార్డును ముద్దాడాలనుకుంటారు. ఒకే వ్యక్తికి మూడు సార్లు ఆస్కార్‌ అవార్డు వరిస్తే  మరి ఆ ఆనందం మాటల్లో చెప్పలేరు. ప్రస్తుతం అలాంటి అనుభూతిని ఆస్వాదిస్తున్నారు ప్రముఖ దర్శకుడు గిలెర్మో దెల్‌ టోరో.

95వ ఆస్కార్‌ అవార్డు వేడుకల్లో బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ‘పినాకియో’ సినిమా అవార్డును దక్కించుకుంది. ఈ చిత్ర దర్శకుడు గిలెర్మో దెల్‌ టోరో తన జీవితంలో మూడోసారి ఆస్కార్‌ వేదికపైకి వచ్చి అవార్డును తీసుకున్నారు. ఆయన గతంలో గిలెర్మో దెల్‌ టోరో తెరకెక్కించిన ‘ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌’ చిత్రానికిగాను రెండు ఆస్కార్‌ అవార్డులను అందుకున్నారు. 2017లో విడుదలైన ఈ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో ఆస్కార్‌ గెలుపొందింది. ‘బెస్ట్‌ పిక్చర్‌’, ‘బెస్ట్‌ డైరెక్టర్‌’, ‘బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫిల్మ్‌’ విభాగాల్లో పురస్కారం అందుకున్నారు.

ఈ ఏడాది లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌ ఆస్కార్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’  సినిమా ఏకంగా ఏడు అవార్డులను సొంతం చేసుకుని అందరి దృష్టిని  తమ వైపు ఆకర్షించెల చేసింది. భారత్‌ నుంచి ‘ది ఎలిఫింట్‌ విస్పరర్స్‌’ బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌గా ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ను సొంతం చేసుకున్నాయి.

ఇది కూడా చదవండి :

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh