సుప్రీం మూడు రాజధానులు వద్దంటే కేంద్రంపైనే ఒత్తిడి అంటున్న కొడాలి

 సుప్రీం  మూడు రాజధానులు వద్దంటే కేంద్రంపైనే ఒత్తిడి అంటున్న కొడాలి..

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం  తెరపైకి తెచ్చిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా హైకోర్టు గతంలోనే తీర్పు చెప్పింది. దీన్ని వైసీపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన  విషయం తెలిసిందే.  దీనిపై విచారణ కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ లోపు సుప్రీంకోర్టు విచారణ పూర్తి చేసి రాజధానులకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని వైసీపీ అంచనా వేస్తోంది.  కానీ ఒకవేళ అలా కాకుండా సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పునే సమర్ధిస్తే..ఏం జరగబోతోంది  అనేది ఇప్పుడు ఏపీలో ఆసక్తి గా మారింది.  ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణలో ఉంది.

మరోవైపు త్వరలో కాబోయే రాజధాని విశాఖకు వెళ్తున్నానంటూ సీఎం జగన్ తాజాగా ప్రకటించారు. దీంతో సుప్రీంకోర్టు ఆ లోపు తీర్పు ఇవ్వబోతోందా ? ఇస్తే అందులో అమరావతిని సమర్ధిస్తుందా లేక మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్ధిస్తుందా అనేది తేలాల్సి ఉంది. పలు సంక్లిష్ట అంశాలతో కూడిన రాజధాని వ్యవహారాన్ని సుప్రీంకోర్టు కూడా అంత త్వరగా తేల్చడం సాధ్యం కాకపోవచ్చని న్యాయనిపుణులు కూడా చెబుతున్నారు. అయినా ఎందుకైనా మంచిదన్న ధోరణితో వైసీపీ సర్కార్ ముందస్తు వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటున్నట్లు  సమాచారం.వైసీపీ సర్కార్ మూడు రాజధానుల్ని ఎట్టి పరిస్దితుల్లోనూ ఈ ఏడాది అమల్లోకి తీసుకురావాలని గట్టి పట్టుదలతో కనిపిస్తోంది.

అదే సమయంలో ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు.. దీన్ని అంత సీరియస్ గా తీసుకోనట్లే కనిపిస్తోంది. దీంతో విచారణ కూడా పలుమార్లు వాయిదాలు వేస్తువస్తూ  వస్తుంది. అయితే విచారణ మరో రెండునెలల్లో పూర్తయి సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పుకు రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వ పెద్దలు కూడా మందుగానే ప్రిపేర్ అవుతున్నట్లే కనిపిస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే మూడు రాజధానుల్ని సుప్రీంకోర్టు సమర్ధిస్తే సరి, లేకుంటే ఏం చేయాలనే దానిపై వైసీపీ మరో అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న ఈ రాజధాని వ్యవహారంపై మాట్లాడిన వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని సంకేతాలు ఇచ్చేశారు. సుప్రీంకోర్టు మూడు రాజధానుల్ని వద్దంటే ఏం చేయాలనుకుంటున్నారో కొడాలి నాని చెప్పేశారు. ఒకవేళ సుప్రీం రాజధానులు వద్దంటే కేంద్రంపైనే ఒత్తిడి తెచ్చి మూడు రాజధానుల బిల్లు పెట్టిస్తామంటూ కొడాలి అంటున్నారు. దీంతో కేంద్రంతో తాడోపేడో తేల్చుకుని అయినా మూడు రాజధానుల్ని అమలు చేయించే దిశగా వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు అర్ధమవుతోంది.

 

ఇది కూడా చదవండి:

.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh