Khushbu: ఆస్పత్రిలో చేరిన ఖుష్బూ.. కోలుకుంటున్నానంటూ పోస్ట్
Khushbu: ఒకప్పటి స్టార్ హీరోయిన్, నటి కుష్బూ అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.
అయితే కుష్బూ సినిమాలకు గ్యాప్ ఇచ్చి బీజేపీలో చేరి.. ప్రజలకు సేవను అందిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే కుష్బూ నటి గానే కాకుండా నిర్మాతగా కూడా పనిచేసింది. అయితే ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
బీజేపీ నాయకురాలిగా ప్రజలకు సేవను అందిస్తూ.. మరోవైపు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
బీజేపీలో చేరిన తర్వాత ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు పదవి చేపట్టింది.
నిత్యం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ప్రతిపక్షాలకు తనదైన రీతిలో మాటలను వదులుతూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.
కుష్బూ తమిళ దర్శకుడు సుందర్ ను 2000 సంవత్సరంలో వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు.
నటిగా సౌత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఆమె రాజకీయాలపై ఆసక్తితో 2010 లో డీఎంకే పార్టీలో చేరింది.
ఆ తర్వాత నాలుగేళ్లకు కాంగ్రెస్ పార్టీలోకి మారి.. 2020 వరకూ కాంగ్రెస్ లో పనిచేసింది.
ఆ తర్వాత కుష్బూ తర్వాత బీజేపీలో చేరింది. అప్పటి నుంచి బీజేపీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది.
2021 తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కుష్బూ పోటీ చేసి ఓడిపోయింది.
తర్వాత అధిష్టానం ఆమెకు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నామినేట్ చేసింది. ఇక సినిమాలు, టీవీ షో లలో కూడా పాల్గొంటు బిజీగా ఉంది.
అయితే కుష్బూ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు.
కొన్నాళ్ల నుంచి వెన్నుముక్క సమస్యతో బాధ పడుతున్న కుష్బూ.. గత ఏడాది అక్టోబర్ లో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోని ఇంటికి చేరుకున్నారు.
కానీ ఆ సమస్య నుంచి ఆమె ఇంకా కోలుకోలేదని తాజా సమాచారం బట్టి తెలుస్తుంది.
ఆమె వెన్నుముక్క సమస్యతో మళ్ళీ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యినట్లు కుష్బూ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. “కోకిక్స్ బోన్ (టెయిల్ బోన్) చికిత్స కోసం నేను మళ్లీ ఆసుపత్రికి వచ్చాను.
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ఈసారైనా పూర్తిగా కోలుకోవాలని ఆశిస్తున్నా” అంటూ ట్వీట్ చేశారు.
ఇది చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. తమ అభిమాన నటిని ఇలా బెడ్ పై చూసి తట్టుకోలేకపోతున్నారు.
ఏమైందీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
On the road to recovery! Underwent a procedure for my coccyx bone ( tail bone ) yet again. Hope it heals completely. 🙏 pic.twitter.com/07GlQxobOI
— KhushbuSundar (@khushsundar) June 23, 2023