Kedarnath : మంచు వర్షం.. అప్రమత్తం అయిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
చార్‌ధామ్ యాత్రకు ప్రతికూల వాతావరణం ఆటంకం కలిగిస్తోంది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఉత్తరాఖండ్‌లోని భారీ హిమపాతం, వర్షాలు కురవనున్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ముఖ్యంగా కేదార్‌ఘాట్‌లో ఈ వారంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుందని హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. హిమాలయాల్లో భారీవర్షంతో పాటు మంచు కురిసే అవకాశం ఉన్నందున రానున్న రెండు మూడు రోజుల్లో కేదార్‌నాథ్ ధామ్ సందర్శనకు వచ్చే యాత్రికులు జాగ్రత్తలు తీసుకోవాలని రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ కోరారు.
అలాగే కేదర్‌నాథ్ ఆలయానికి వచ్చే భక్తులకు మెజిస్ట్రేట్ పలు సూచనలు చేశారు. భక్తులు ఒకే చోట ఉండాలని సూచించారు. ప్రస్తుతం కేదర్‌నాథ్ ధామ్‌లో మంచుKedarnath కురుస్తుందని తెలిపారు. ఉదయం 10:30 గంటల తర్వాత సోన్‌ప్రయాగ్ నుంచి కేదర్‌నాథ్‌కు భక్తుల రాకపోకలను నిలిపివేస్తామని ప్రకటించారు.
గడిచిన 30 గంటల్లో 14 వేల మందికి పైగా భక్తులను కేదార్‌నాథ్ ఆలయానికి పంపారు. Kedarnath అందులో 50 శాతం మంది మధ్యాహ్నం వరకూ కేదార్‌నాథ్ ధామ్ వరకు ఇప్పటికే చేరుకున్నారు. ఇంకొందరు భక్తులు గౌరీకుండ్, జంగల్‌చట్టి, భీంబాలి, లించోలికి చేరుకున్నారని అధికారులు వెల్లడించారు. భారీ హిమపాతం వల్ల విపరీతంగా చలి పెరుగుతోందని, మంచు బారి నుంచి భక్తులను రక్షించేందుకు మందిర్ మార్గ్ తో పాటుగా పలు ప్రదేశాల్లో జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ రెయిన్ షెల్టర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అయితే జిల్లా యంత్రాంగానికి భక్తులు సహకరించాలని మెజిస్ట్రేట్ విజ్ఞప్తి చేశారు. వాతావరణం పూర్తిగా చక్కబడిన తర్వాతనే కేదర్‌నాథ్‌కు భక్తులను అనుమతిస్తామని స్పష్టం చేశారు. అటు, కేదార్‌నాథ్ సందర్శనకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. భారీ హిమపాతం, వర్షం కారణంగా బద్రీనాథ్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. Kedarnath మరోవైపు, హిమాచల్ ప్రదేశ్‌లో సైతం రాబోయే రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. భారీ వర్షాలు, హిమపాతం సంభవిస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గత 24 గంటల్లో హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిశాయి. కాంగ్రా జిల్లాలో అత్యధికంగా 58 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన కేదర్‌నాథ్ ఆలయం తలుపులు తెరిచిన సంగతి తెలిసిందే.