సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు రూట్స్ ఇవే !

Vande Bharat Train: సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు రూట్స్ ఇవే !

తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందేభారత్ రైలు పరుగులు పెట్టనుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్‌ను భారతీయ రైల్వే చాలా వేగంగా విస్తరిస్తోంది. అందులో భాగంగానే సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసును నడిపేందుకు సిద్ధమవుతోంది ఏప్రిల్ 8న తేదీన సికింద్రాబాద్-తిరుపతి  వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం కానున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.

అయితే ప్రయాణికులకు సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని అందించడానికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును రూపొందించినట్లు భారతీయ రైల్వే చెబుతోంది.వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గంటకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ట్రాక్‌ను అప్‌గ్రేడ్ చేశారు. ఆ ట్రైన్ రూట్, టికెట్ ఛార్జీలు, టైమింగ్స్ తదితర అంశాలపై ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే అధికారులు కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.

అలాగే  ప్రస్తుతం నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ ఈ మార్గంలో 12 గంటల్లో ప్రయాణిస్తుంది. అయితే వందే భారత్ రైలు 6 నుంచి 7 గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేయనుంది.రైలు ఆగే స్టేషన్లపై ఇంకా క్లారిటీ రాలేదు. బహుశా గుంటూరు, నెల్లూరు స్టేషన్లలో రైలు ఆగోచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

జనవరి కానుకగా సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య వందేభారత్ రైలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ రైలుకు ప్రయాణీకుల నుంచి మంచి స్పందన రావడమే కాదు రిజర్వేషన్లు కూడా ఫుల్ అవుతున్నాయి. దీంతో సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ట్రైన్‌ను కూడా పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు.

సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఇప్పటికే వేర్వేరు రూట్లలో పలు రైళ్లు నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇక వందేభారత్ రైలు సికింద్రాబాద్ నుంచి నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా తిరుపతి వెళ్లే అవకాశం ఉంది.

ఇక ఛార్జీల విషయానికొస్తే వందేభారత్‌ రైలులో ఎగ్జిక్యూటివ్ చైర్ కారు ధర రూ. 2వేలు పైమాట.. ఏసీ చైర్ కారు రూ. 1150గా ఉండొచ్చునని సమాచారం.. అటు సికింద్రాబాద్ టూ తిరుపతి విమాన ఛార్జీలు పరిశీలిస్తే దాదాపు రూ. 3500 నుంచి రూ. 6000 వరకు ఉన్న సంగతి తెలిసిందే. విమాన ఛార్జీలతో పోలిస్తే వందేభారత్ ధరలు చౌక అని చెప్పొచ్చు.  అయితే ఈ ఛార్జీలు, ఆగే స్టేషన్లపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలు మాదిరిగానే. సికింద్రాబాద్ టూ తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైలు కూడా ఆదివారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుందట. ప్రస్తుతం, సికింద్రాబాద్ – త్రివేండ్రం శబరి ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి – తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ గుంటూరు మీదుగా తిరుపతికి పరుగులు పెడుతున్నాయి. వీటి ప్రయాణ సమయంలో దాదాపు 12 గంటలు. ఇక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయాన్ని 8 గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటుంది.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh