JUNIOUR NTR: వామ్మో జూనియర్ ఎన్టీఆర్ ఇది ఊహించాడా.??.
ఎన్.టి.ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో జూనియర్ ఎన్. టీ ర్ స్పందించిన తీరుపై టీడీపీ శ్రేణుల నుంచి ఓ రేంజ్ లో విమర్శలు వస్తున్నాయి.అయితే ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే ఊహించాడా అంటే అవుననే అంటున్నాయి సన్నిహిత వ్వర్గాలు.
నందమూరి ఫ్యామిలీ నట వారసుడిగా ప్రస్తుతం తన ఫాం కొనసాగిస్తున్న JUNIOUR NTR రాజకీయాల్లో రావాలంటే చాలా కథ ఉంది.నందమూరి ఫ్యాన్స్ అంతా కూడా జూనియర్ ఎన్.టి.ఆర్ ని అభిమానిస్తున్నారు అని అనుకుంటే పొరపడినట్టే.
ఈ గొడవ వల్ల కేవలం తారక్ కి కొంతమంది నందమూరి ఫ్యాన్స్ నుంచే సపోర్ట్ ఉందని అర్ధమవుతుంది.ఊహించే JUNIOUR NTR ఎక్కడ టంగ్ స్లిప్ అవకుండా మాట్లాడాడు.అయితే ఎన్.టి.ఆర్ హెల్త్ వర్సిటీ విషయంలో కూడా ఆయన స్పందించిన తీరు హుందాగా ఉన్నా ఇది మాకు సరిపోదు వైసీపీ వాళ్లని బండబూతులు తింటాలని తెలుగు తమ్ముళ్లు ఆశిస్తున్నారు..
మరి ఈ విషయంపై JUNIOUR NTR కూడా తన వెనక ఉన్న అసలు మద్ధతుదారులు ఎవరు అన్నది విశ్లేషించుకునే అవకాశం కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి తను కేవలం సినిమాలు మాత్రమే చేద్దాం అనుకుంటున్న తారక్ కి ఇలాంటి ఎదురుదెబ్బలు తగలడం కామన్ అయ్యింది.
విదేశాల్లో ఆర్ఆర్ఆర్ క్రేజ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్:
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద ఎంత ప్రభంజనం సృష్టించిందో తెలిసిన విషయమే. ఈ సినిమాకు ప్రపంచమే ఫిదా అయ్యింది. జక్కన్న స్క్రీన్ ప్లేకు హాలీవుడ్ డైరెక్టర్స్ ప్రశంసలు కురిపించారు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్,JUNIOUR NTR కలిసి నటించిన ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఇటీవలే ఈ సినిమా ఆస్కార్ అవార్డ్ 2023కు నామినేట్ అవుతుందని భావించారు. కానీ చివరి నిమిషంలో గుజరాతీ ఫిల్మ్ ఛలో షో ఎంపికైంది. ఇక ఇప్పుడు విదేశాల్లో ఆర్ఆర్ఆర్ క్రేజ్ ఎలా ఉందనేది తెలియజేస్తూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
కాలిఫోర్నియాలోని ఓ పాఠశాలలో విద్యార్థులు ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ హిందీ వెర్షన్ ఆలపించారు. విద్యార్థులు అందంగా నాటు నాటు సాంగ్ పాడుతున్న వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది. ఇది రాజమౌళి గొప్ప విజయం అని.. ఏ దర్శకుడికి దొరకని అభిమానం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ అవసరం లేదని.. ఇది అంతకంటే ఎక్కువ విజయం అంటూ కామెంట్స్ చేశారు.
అర్జున్ కోసం కాజల్ ‘ ఉ ‘ అంటాదా?
సుకుమార్ డైరక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప ది రైజ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది.ఈ సినిమా నార్త్ ఆడియన్స్ కి బీభత్సంగా ఎక్కేసింది.ఏమాత్రం అంచనాలు లేకుండా పుష్ప పార్ట్ 1 హిందీలో 100 కోట్ల పైన రికార్డ్ వసూళ్లని రాబట్టింది.పుష్ప ది రైజ్ లో సమంత చేసిన స్పెషల్ ఐటం సాంగ్ ఉ అంటావా మామా సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో తెలిసిందే.
ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తో అక్కడ క్రేజ్ తెచ్చుకున్న సమంత ఈ సాంగ్ తో దుమ్ముదులిపేసింది.ఇక ఇదిలాఉంటే పుష్ప 2 కోసం కూడా సుకుమార్ అదే రేంజ్ లో మరో స్పెషల్ ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
ఈ సాంగ్ కోసం ఈసారి కాజల్ అగర్వాల్ ని ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారట.కాజల్ కూడా ఆల్రెడీ ఒకసారి స్పెషల్ సాంగ్ చేసింది.అయితే పెళ్లై ఓ పిల్లాడు కూడా ఉన్న కాజల్ ఈ టైం లో స్పెషల్ సాంగ్ కి ఓకే చెబుతుందా అన్నది డౌటే.
కానీ కాజల్ తన కం బ్యాక్ ఓ రేంజ్ లో ఉండాలని ఆ సాంగ్ ఆఫర్ కి ఓకే చెప్పిందని అంటున్నారు.పుష్ప 2 లో కాజల్ స్పెషల్ సాంగ్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టే.అల్లు అర్జున్ తో ఆర్య 2 లో నటించింది కాజల్ మళ్లీ ఈ స్పెషల్ సాంగ్ తో జోడీ కడుతుంది.
రాజమౌళికి పోటీగా…వివి వినాయక్..
ఒకప్పుడు దర్శకుడు రాజమౌళితో పోటీపడ్డారు వివి వినాయక్. బాహుబలి సిరీస్ తో రాజమౌళి అందనంత ఎత్తుకు ఎదిగితే… వినాయక్ మాత్రం ప్లాప్స్ తో క్రిందికి జారిపడ్డారు. స్టార్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన వివి వినాయక్ చాలా కాలం ఖాళీగా ఉన్నారు. ఒక దశలో ఏం చేయాలో తెలియక హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. సీనయ్య టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. దిల్ రాజు నిర్మాతగా ఉన్న ఈ ప్రాజెక్ట్ ప్రకటనతోనే ఆగిపోయింది.
కాగా వివి వినాయక్ ప్రస్తుతం హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో ఛత్రపతి హిందీ రీమేక్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ నిర్మాణ భాగస్వామిగా ఉన్న పెన్ స్టూడియోస్ వివి వినాయక్ కి భారీ ఆఫర్ ప్రకటించిందట. రూ. 500 కోట్ల బడ్జెట్ తో మూవీ చేసేందుకు సై అందట.
ఛత్రపతి రీమేక్ అవుట్ ఫుట్ పట్ల సంతృప్తికరంగా ఉన్న పెన్ స్టూడియోస్ ఆయనతో భారీ పాన్ ఇండియా మూవీ చేద్దామని డీల్ కుదుర్చుకుందట. కథా చర్చలు కూడా ముగియగా.. ఛత్రపతి ముగియగానే ఈ ప్రాజెక్ట్ పనులు మొదలుకానున్నాయట.
ఈ విషయాన్ని నిర్మాత బెల్లంకొండ సురేష్ వివరించారు. పరిశ్రమ నుండి కనుమరుగు అవుతున్న తరుణంలో ఇలాంటి ఆఫర్ రావడమంటే మామూలు విషయం కాదు. వివి వినాయక్ ఈ అవకాశం ఉపయోగించుకుంటే రాజమౌళికి మరలా పోటీ ఇవ్వడం, స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో జాయిన్ కావడం ఖాయం.
అయితే ఛత్రపతి రిజల్ట్ పైనే ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఛత్రపతి విజయం సాధిస్తే మేకర్స్ విశ్వాసంతో ముందుకు వెళతారు లేదంటే… కష్టమే. కాబట్టి బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి పైనే వివి వినాయక్ ఆశలన్నీ.
తెలుగు వర్షన్ కి మించి యాక్షన్ డోస్ అధికంగా ఛత్రపతి హిందీ లో ఉంటుందట. హీరోయిన్స్ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో మేకింగ్ ఆలస్యమైందట. ప్రస్తుతం షూటింగ్ పూర్తి కాగా డబ్బింగ్ పనులు జరుగుతున్నాయట.
ఇక విఎఫ్ఎక్స్ కి కూడా బాగానే ఖర్చు చేస్తున్నారట. మొత్తంగా వివి వినాయక్ కి పెన్ స్టూడియోస్ రూపంలో మంచి అవకాశం దక్కింది. ఆ అవకాశాన్ని ఆయన ఎంత వరకు ఉపయోగించుకుంటాడో చూడాలి.