చిరంజీవికి వార్నింగ్‌ ఇచ్చిన చరణ్

Charan warns Chiranjeevi

చిరంజీవికి వార్నింగ్‌  ఇచ్చిన చరణ్

మెగాస్టార్ చిరంజీవి కి ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వార్నింగ్‌ ఇచ్చారంట .ఇప్పుడు  నెట్టింట ఇది తెగ వైరల్ అవుతోంది. అసలు తండ్రిపైతనయుడికి అంత కోపం ఎందుకు వచ్చిందో ఇప్పుడు  మనం తెలుసుకుందాం. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ `ఆర్ఆర్ఆర్‌`. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, రామ్ చరణ్ హీరోలుగా నటించాడు.  గత ఏడాది విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్‌(RRR) ఆస్కార్ రేసులో దూసుకుపోతోంది. ఈ సినిమాలోని `నాటు నాటు` పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ బరిలో నిలిచింది. ఈ క్రమంలోనే హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరాన్ ఆర్ఆర్ఆర్ పై మరోసారి ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఈ పీరియాడికల్ మూవీలో రామ్ చరణ్ పోషించిన సీతారామరాజు పాత్ర తనకు ఎంతో నచ్చేసిందంటూ కొనియాడారు.

ఇందుకు సంబంధించిన వీడియోను చిరంజీవి తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. జేమ్స్ కామెరూన్ లాంటి దర్శకుడు తన కొడుకు గురించి చెప్పడంతో చిరంజీవి పుత్రోత్సాహంతో పొంగిపోయారు. `జేమ్స్ కామెరూన్ లాంటి దర్శకుడుకి రామ్ పాత్ర బాగా నచ్చింది అంటే.. అది ఆస్కార్ అవార్డుకు ఏమాత్రం తక్కువ కాదు. చరణ్ కి దక్కిన గొప్ప గౌరవం ఇది. చరణ్ ని చూస్తుంటే తండ్రిగా గర్వంగా ఉంది` అంటూ చిరు తన పోస్ట్ లో రాసుకొచ్చింది. ఇదే వివాదానికి తెర లేపింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ మాత్రమే కాదు ఎన్టీఆర్ కూడా ఎంతో గొప్పగా నటించాడు.

అసలు ఎన్టీఆర్ లేకుంటే చరణ్ పాత్రకు అర్థం లేదు. అలాగే రాజమౌళి కష్టం ఎంతైనా ఉంది. కానీ మెగాస్టార్ గారు  మాత్రం తన కొడుకు గురించి మాత్రం ట్వీట్ వేసుకోవడంతో ఎన్టీఆర్‌(NTR), రాజమౌళి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫైర్ అయ్యారు. ఈ విషయంలో రాజమౌళి కూడా కాస్త హర్ట్‌ అయ్యారని తెలిసింది . దీంతో చరణ్ తన తండ్రి చిరంజీవికి సున్నితంగా చివాట్లు పెట్టారట. ఇంకోసారి ఇలాంటి ట్వీట్లు చేయొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారని టాక్ నడుస్తోంది.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh